ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఏంజెల్ టాక్స్ సంబంధించి నిబంధన 11 యుఏలో సవరణ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సిబిడిటి
Posted On:
26 SEP 2023 7:29PM by PIB Hyderabad
నమోదుకాని కంపెనీలు ఆదాయం పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 56(2)(viib) పరిధిలో పెట్టుబడులు సేకరించడానికి న్యాయమైన మార్కెట్ విలువ (ఎఫ్ఎంవి) కి మించి వాటాలను విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు విడుదల చేసి సమీకరించిన ఆదాయాన్ని పన్ను మదింపు కోసం ' ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం' పద్దు కింద చూపించాలని ఆర్థిక చట్టం 2023 కు కేంద్రం సవరణ చేసింది.
చట్టాలు చేసే ముందు సంబంధిత వర్గాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ న్యాయమైన మార్కెట్ విలువ మదింపు కోసం రూపొందించిన ముసాయిదా నిబంధన 11 యూఏ పై సంబంధిత వర్గాలు, ప్రజల అభిప్రాయాలు కోరుతూ ప్రభుత్వం 2023 మే 19న నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ అంశంపై అందిన అభిప్రాయాలు, సంబంధిత వర్గాలతో జరిపిన చర్చలకు అనుగుణంగా సెక్షన్ 56(2)(viiబి) కింద న్యాయమైన మార్కెట్ విలువ మదింపు కోసం నిబంధన 11 యూఏ కు సవరణలు చేస్తూ 2023 సెప్టెంబర్ 25న 81/2023 నోటిఫికేషన్ జారీ అయ్యింది.
నిబంధన 11 యూఏ కు చేసిన ముఖ్యమైన సవరణలు కింది విధంగా ఉన్నాయి :
ఏ) నిబంధన 11 యూఏ కింద వాటాల విలువ మదించడానికి ప్రస్తుతం రెండు విధానాలు అమలులో ఉన్నాయి. అమలులో ఉన్న రాయితీ నగదు ప్రవాహం (డిసిఎఫ్), నికర ఆస్తి విలువ (ఎన్ఈవి) మరో 5 విధానాలు సవరణ ప్రకారం అందుబాటులోకి వస్తాయి. సవరణ ప్రకారం కంపేరబుల్ కంపెనీ మల్టిపుల్ విధానం , ప్రొపబిలిటీ వెయిటెడ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ విధానం, ఆప్షన్ ప్రైసింగ్ విధానం, , మైల్ స్టోన్ అనాలసిస్ విధానం, రీప్లేస్మెంట్ కాస్ట్ విధానం వంటి 5 కొత్త విధానాలు అమలులోకి వస్తాయి.
బి) కేంద్ర ప్రభుత్వం గుర్తించి నాన్-రెసిడెంట్ సంస్థగా ప్రకటించిన ఏదైనా సంస్థ నుంచి ప్రతిపాదన అందిన సమయంలో ఈక్విటీ వాటా ధర భారత జాతీయ , ప్రవాస భారతీయ పెట్టుబడిదారులకు కింది అంశాలకు లోబడి న్యాయమైన మార్కెట్ విలువగా పరిగణిస్తారు.:
(i) సదరు సంస్థ నుంచి అందిన ప్రతిపాదన న్యాయమైన మార్కెట్ విలువకు మించి ఉండకూడదు.
(ii) విలువ మదింపు కోసం పరిగణనలోకి తీసుకున్న వాటాల జారీ తేదీకి ముందు లేదా తర్వాత తొంభై రోజుల వ్యవధిలో గుర్తించిన సంస్థ నుంచి ప్రతిపాదన అంది ఉండాలి.
సి) ఇదే తరహాలో, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లేదా స్పెసిఫైడ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడికి సంబంధించి భారతీయలు, ప్రవాస భారతీయ పెట్టుబడిదారులకు ధర సరిపోలిక అందుబాటులో ఉంటుంది.
d) కంపల్సరీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్‌ల (CCPS)న్యాయమైన మార్కెట్ విలువ లెక్కించడానికి మదింపు పద్ధతులు కూడా అందించబడ్డాయి.
ఇ) విలువలో 10% వరకు వైవిధ్యాన్ని ఆమోదిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన పద్దతిలో జాతీయ, ప్రవాస భారతీయ పెట్టుబడిదారులకు విస్తృత సమానత్వాన్ని నూతన మదింపు విధానాలు అందిస్తాయి.
. 2023 సెప్టెంబర్ 25న జారీ అయిన 81/2023 నోటిఫికేషన్ www.incometaxindia.gov.in.లో అందుబాటులో ఉంది.
****
(Release ID: 1961145)
Visitor Counter : 129