రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇండో-పసిఫిక్ ప్రాంతం సంక్లిష్టతలు, ఇప్పటి వరకు స్పృశించని సామర్థ్యాలు... సంపన్నమైన, సురక్షితమైన, సమ్మిళిత భవిష్యత్తు కోసం సంఘటిత ప్రయత్నాలను కోరుతోంది, న్యూఢిల్లీలో జరిగిన 13వ ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్స్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేసిన రక్షణ మంత్రి


"భారతదేశం అంటే స్వేచ్ఛ, బహిరంగ, కలుపుకోగలిగే, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్"

"స్నేహపూర్వక దేశాలతో బలమైన సైనిక భాగస్వామ్యాన్ని నిర్మించడానికి మా ప్రయత్నాలు జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవటానికి మా నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి"

Posted On: 26 SEP 2023 11:42AM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఇండో-పసిఫిక్ ప్రాంతం సంక్లిష్టతలను ఎదుర్కోవటానికి సమష్టి వివేకం, సంఘటిత ప్రయత్నాలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో దాని పూర్తి సామర్థ్యాన్ని వెలికితీస్తూ, ప్రాచీన భారతీయ తత్వానికి అనుగుణంగా, శ్రేయస్సు, భద్రత,  చేరికతో గుర్తించిన భవిష్యత్తును నిర్ధారించడానికి కృషి జరగాలన్నారు. 'వసుధైవ కుటుంబం' (ప్రపంచం ఒక కుటుంబం), జి-20 నినాదం 'ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' మార్గం వేయాలని తెలిపారు. సెప్టెంబర్ 26, 2023న న్యూ ఢిల్లీలో జరిగిన 13వ ఇండో-పసిఫిక్ ఆర్మీస్ చీఫ్స్ కాన్ఫరెన్స్ (ఐపఏసిసి)లో రక్షణ మంత్రి ప్రారంభ ప్రసంగం చేస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, సైనిక దళాధిపతులు 35 దేశాలు నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇండో-పసిఫిక్ సముద్ర నిర్మాణం కాదని, పూర్తి స్థాయి భౌగోళిక-వ్యూహాత్మక నిర్మాణం అని, సరిహద్దు వివాదాలు, పైరసీతో సహా ఈ ప్రాంతం సంక్లిష్టమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నదని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. అమెరికన్ రచయిత, వక్త  స్టీఫెన్ ఆర్. కోవే సైద్ధాంతిక నమూనా ద్వారా తన దృష్టి కోణాన్ని వివరించారు, ఇది రెండు వృత్తాలపై ఆధారపడింది - 'సర్కిల్ ఆఫ్ కన్సర్న్', 'సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్'.

ఇండో-పసిఫిక్ ఆర్మీస్ మేనేజ్‌మెంట్ సెమినార్ (IPAMS) మరియు సీనియర్ ఎన్‌లిస్టెడ్ లీడర్స్ ఫోరమ్ (SELF) ఈ ప్రాంతంలోని సైనిక బలగాల అతిపెద్ద ఆలోచనాత్మక సంఘటనలలో ఒకటిగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్  పేర్కొన్నారు. ఈ సంఘటనలు భాగస్వామ్య దృక్పథం కోసం ఉమ్మడి దృక్కోణాలను నిర్మించడానికి, అందరికీ సహకార భద్రత స్ఫూర్తితో భాగస్వామ్యాలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయి, అని ఆయన అన్నారు.

 ****



(Release ID: 1961107) Visitor Counter : 99