రక్షణ మంత్రిత్వ శాఖ
భాగస్వామ్య పద్ధతిలో కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానం
- దరఖాస్తుదారుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 27, 2023న ప్రారంభం
Posted On:
26 SEP 2023 12:20PM by PIB Hyderabad
భాగస్వామ్య పద్ధతిలో 100 కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ చొరవలో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ) పరిధిలోని సైనిక్ స్కూల్ సొసైటీ అర్హత, ఆసక్తి గల పాఠశాలల వారి నమోదు కోసం https://sainikschool.ncog.gov.in/ తన పోర్టల్ను తిరిగి తెరవనుంది. అసక్తి కలిగిన దరఖాస్తుదారైన పాఠశాలలు, సెప్టెంబర్ 27, 2023 నుండి నవంబర్ 25, 2023 వరకు పోర్టల్లో తమ ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు. ఆసక్తిగల పాఠశాలలు/ ట్రస్టులు/ఎన్జీవోలు మొదలైనవి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న కొత్త సైనిక్ పాఠశాలల కోసం గుణాత్మక అవసరాలు, మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ మరియు రూల్స్ & రెగ్యులేషన్‌లను పరిశీలించి ముందుకు సాగాలని సూచించారు. రౌండ్-1, రౌండ్-2లో ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకున్న పాఠశాలలు/ NGOలు/ ట్రస్టులు/ సొసైటీలు మొదలైనవి కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు. మళ్లీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరమూ లేదు. అయితే ఇప్పటికే నమోదు చేసుకున్న దరఖాస్తుదారు పోర్టల్‌లో తాజాగా తమ డేటాను ఇన్‌పుట్‌లతో మరితంగా అప్‌డేట్ చేయడానికి అనుమతించబడతారు. ఈ విషయమై మరితం స్పష్టత/సహాయం కోసం, ఆసక్తిగల పాఠశాలలు sainikschoolaffiliation[at]gmail[dot]comకి ఇమెయిల్ పంపవచ్చు. కొత్త సైనిక్ పాఠశాలలను స్థాపించాలనే ప్రభుత్వ నిర్ణయం జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా సాయుధ దళాలలో చేరడం వారికి మెరుగైన కెరీర్ అవకాశాలను అందించడం మాత్రమే కాదు; రాష్ట్ర ప్రభుత్వాలు/ఎన్.జి.ఓలు/ప్రైవేట్ రంగానికి దేశ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలపడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. దీని కోసం, సైనిక్ స్కూల్స్ సొసైటీ 42 ప్రైవేట్/ఎన్జీవోలు/రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను కొత్త సైనిక్ పాఠశాలలుగా ఆమోదించింది. ఈ 42 పాఠశాలలు ఇప్పటికే మునుపటి పద్ధతిలో పనిచేస్తున్న 33 సైనిక్ పాఠశాలల మాదిరిగానే పని చేస్తున్నాయి. ఈ కొత్త పాఠశాలలు, సంబంధిత ఎడ్యుకేషన్ బోర్డులకు అనుబంధంగా ఉండటమే కాకుండా, సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి మరియు భాగస్వామ్య మోడ్‌లో కొత్త సైనిక్ స్కూల్స్ కోసం నియమాలు మరియు నిబంధనలను అనుసరిస్తాయి. అదనంగా, వారి రెగ్యులర్ అనుబంధ బోర్డు పాఠ్యాంశాలకు వారు సైనిక్ స్కూల్ నమూనాలోని విద్యార్థులకు అకడమిక్ ప్లస్ పాఠ్యాంశాల విద్యను కూడా అందిస్తారు.
****
(Release ID: 1961091)
Visitor Counter : 129