కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“పీఎంఆర్‌టీఎస్‌ & సీఎంఆర్‌టీఎస్‌ అనుమతుల నిబంధనలు & షరతుల సమీక్ష”పై ట్రాయ్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంపై వ్యాఖ్యలు/ప్రతివ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీ పొడిగింపు

प्रविष्टि तिथि: 26 SEP 2023 1:22PM by PIB Hyderabad

'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (ట్రాయ్‌), 29.08.2023న, “పీఎంఆర్‌టీఎస్‌ & సీఎంఆర్‌టీఎస్‌ అనుమతుల నిబంధనలు & షరతుల సమీక్ష”పై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఆ సంప్రదింపు పత్రంలోని అంశాలపై సంబంధిత వాటాదార్ల నుంచి రాతపూర్వక వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీగా 26.09.2023, ప్రతివ్యాఖ్యల కోసం చివరి తేదీగా 10.10.2023ను నిర్ణయించింది.

వ్యాఖ్యలు సమర్పించడానికి సమయం పొడిగింపు కోసం పరిశ్రమ వర్గాలు చేసిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, రాతపూర్వక వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలు సమర్పించే చివరి తేదీని వరుసగా 24.10.2023 & 07.11.2023 వరకు పొడిగించింది. మరోమారు గడువు పొడిగింపు కోసం వచ్చే అభ్యర్థనలను ట్రాయ్‌ పరిగణనలోకి తీసుకోదు.

వ్యాఖ్యలు/ప్రతివ్యాఖ్యలను శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేది, సలహాదారు (నెట్‌వర్కులు, స్పెక్ట్రం & అనుమతులు), ట్రాయ్‌ చిరునామాకు పంపవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో advmn@trai.gov.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చు. ఏదైనా స్పష్టత/సమాచారం కోసం శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేదిని టెలిఫోన్ నంబర్ +91-11-23210481లో సంప్రదించవచ్చు.

 

***


(रिलीज़ आईडी: 1961089) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , हिन्दी , Tamil , English , Urdu