గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సమస్య పరిష్కారానికి భారతదేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో నాయకత్వం వహించింది. ఆసియా పట్టణ పరివృత్తి వేదిక (అర్బన్‌షిఫ్ట్ ఆసియా ఫోరమ్‌) సమావేశంలో శ్రీ హర్దీప్ ఎస్ పూరి


మన పట్టణీకరణ యాత్ర ఒక విజయగాథ. ఇతర దేశాలు నేర్చుకొని ఆచరించడానికి అది ఒక నమూనాగా మారింది: శ్రీ హర్దీప్ ఎస్ పూరి

Posted On: 25 SEP 2023 4:04PM by PIB Hyderabad

 

         వాతావరణ మార్పుల సమస్యపై భారతదేశం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చర్య తీసుకున్నది.
ఆయన గాఢవాంఛతో రూపొందించిన పంచామృత కార్యాచరణ ప్రణాళిక మన వాతావరణ ప్రతిస్పందనకు లంగరుగా మారింది.
'వేగంగా పట్టణీకరణ చెందుతున్న మన నగరాలపై కేంద్రీకృతమై మా ప్రతిస్పందన ఉంది' అని గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం & సహజ వాయువు శాఖల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు.  దాని ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని అన్నారు.  ప్రపంచంలో వాతావరణ మార్పు సమస్య విషయంలో  అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఉందని  ప్రవర్తన సూచిక తెలియాజేస్తోంది.

           సోమవారం ఆసియా పట్టణ పరివృత్తి వేదిక ప్రారంభ సమావేశంలో శ్రీ హర్దీప్ ఎస్. పూరి ప్రసంగించారు. జి20 దేశాల బృందానికి అధ్యక్షత వహిస్తున్న భారత్  విస్తృత ప్రశంసలు అందుకుంది. స్థిరమైన పట్టణీకరణపై ఉన్నతస్థాయి చర్చను ఇండియా ప్రోత్సహించింది.  "మన పట్టణీకరణ యాత్ర  ఒక విజయగాథ, ఇది ఇతర దేశాలు, ముఖ్యంగా ప్రపంచంలోని దక్షిణ దేశాలు నేర్చుకోవడానికి నమూనాగా మారింది" అని ఆయన అన్నారు.

            కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను గురించి మంత్రి శోధన జరిపారు. అవన్నీ స్థిరమైన, సమ్మిళిత పద్ధతిలో పట్టణ ప్రాంతాల అభివృద్ధికి మార్గం చూపుతున్నాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (PMAY-U) గురించి మాట్లాడుతూ, దాదాపు 11.9 మిలియన్ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని,  11.3 మిలియన్లకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని,  ఈ పథకం కింద ఇప్పటికే దాదాపు 7.7 మిలియన్ల  ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

        పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ్ భారత్ మిషన్ అమలు గురించి కూడా మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమం అమలు ఫలితంగా జనం నడవడిక పరిశుభ్రత వైపు మళ్లిందని అన్నారు.  దాదాపు 7.36 మిలియన్ల వ్యక్తిగత, సామాజిక  టాయిలెట్లు నిర్మించడం ద్వారా దేశంలో నగరాలు మరియు పట్టణాలను బహిరంగ మల విసర్జన రహితంగా మారాయని చెప్పారు. 2014లో 17% ఉన్న ఘన వ్యర్థాల ప్రాసెసింగ్  ఇప్పుడు 75%కి పెరిగింది. SBM-U 2.0 కింద, 326 చెత్త డంప్‌సైట్‌లను బాగు చేయడం జరిగిందని, అంతేకాక 42.6 మిలియన్ టన్నుల వ్యర్థాలను తగ్గించడం జరిగిందని ఆయన చెప్పారు.

     అమృత్ మిషన్ విజయాల గురించి వివరిస్తూ, 500 నగరాల్లో (భారతదేశ జనాభాలో 60%) దాదాపు 14 మిలియన్ల నీటి కుళాయి కనెక్షన్లు మరియు 13.5 మిలియన్ మురుగునీటి కనెక్షన్లు సమకూర్చమని  శ్రీ పూరి చెప్పారు.

     జీవన సౌలభ్యం వైపు ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా  స్మార్ట్ సిటీస్ మిషన్ కింద $13 బిలియన్లకు పైగా విలువైన 6,069 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి, ఇది వినూత్నత,  శ్రేష్ఠత సంస్కృతి పాదుకునేందుకు తోడ్పడింది.

       “భారతదేశ చలనశీలత ఎజెండాలో ఒక నమూనా మార్పు; 871 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లు వేయగా, మరో 906 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ నిర్మాణంలో ఉన్నది.  తద్వారా ఇండియా ఇప్పుడు  ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా అభివృద్ధి చెందిందని మంత్రి తెలిపారు.

       వాతావరణ అజెండాల స్థానికీకరణ అవసరాన్ని ఎత్తిచూపిన మంత్రి, ప్రపంచంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న నగరాల కోసం మన వాతావరణ ఎజెండాలను స్థానికీకరించడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. "ఆర్ధిక స్థితి(అంశాలు)పై చర్చ లేకుండా అర్బన్ ప్లానింగ్ గురించి చర్చించలేము. మౌలిక ఆర్థిక అవసరాలను తీర్చడానికి నగరాలు ఎక్కువగా కేంద్ర నిధులపై ఆధారపడి ఉంటాయి. ఇది మారాల్సిన అవసరం ఉంది" అని  ఆయన అన్నారు.

      సాంప్రదాయ రాబడికి వినూత్నతను జోడించాలి.   ఆర్ధిక ప్రవేశ సాధ్యతలో వైవిధ్యం ఉండాలి.   వాతావరణ సమస్యలను ఎదుర్కోవడానికి వీలుగా ఈ వేదిక ఉత్తమ పద్ధతులను ప్రచారం చేయగలదని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

          పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన ప్రవర్తనలను ప్రోత్సహించడం మరియు క్లైమేట్ ఫైనాన్స్‌ను వేగవంతం చేసే విషయంలో  భారతదేశం నాయకత్వం వహిస్తున్న తీరు గురించి కూడా మంత్రి ప్రస్తావించారు.  జి20 తుది ప్రకటనలో వాతావరణ సమస్యను ఎదుర్కోవడనికి ఆర్ధిక దన్ను గురించి ప్రస్తావించడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

        న్యూ ఢిల్లీలోని హయత్ రీజెన్సీలో సోమవారం సెప్టెంబరు 25, 2023న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA)  మొదటి అర్బన్ షిఫ్ట్ ఫోరమ్ (ఆసియా) ప్రారంభమైంది.

         భారత ప్రభుత్వ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA), యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ (GEF), ఇతర సంస్థలు మరియు సంస్థలకు చెందిన  ప్రముఖులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అర్బన్‌షిఫ్ట్ ఆసియా ఫోరమ్ ప్రారంభ సమావేశాన్ని  ICLEI సౌత్ ఆసియా మరియు NIUA ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి.

      భారతదేశం, ఇండోనేషియా, చైనా, వియత్నాం, మలేషియా, నేపాల్, ఫిలిప్పీన్స్, జోర్డాన్ మరియు శ్రీలంక  ప్రభుత్వాలు మరియు నగరాల నుండి  అలాగే అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, వ్యాపార సంస్థలు  మరియు స్వచ్ఛంద సంస్థలకు (NGOs) చెందిన సుమారు 150 మంది ప్రతినిధులు, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రాంతీయ పట్టణ సవాళ్లు మరియు అనుకరించదగిన  పరిష్కారాల గురించి పరస్పర అభిప్రాయ మార్పిడి జరుగుతుంది.

      ఈ వేదిక ముఖ్య లక్ష్యం సమగ్ర మరియు స్థిరమైన పట్టణాభివృద్ధికి సంబంధించిన వివిధ కోణాలపై  ప్రాంతీయ నగరాలకు శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం.

 

***



(Release ID: 1960952) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Hindi , Tamil