గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

అమెజాన్ ఇండియా మరియు లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌తో కలిసి ఈఎంఆర్‌ఎస్‌ల కోసం 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్' రెండో దశను ప్రారంభించిన ఎన్‌ఈఎస్‌టిఎస్‌ (మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్)


ఈ చొరవ గిరిజన వర్గాల మధ్య ఉన్న విద్యాపరమైన అంతరాన్ని తగ్గిస్తుంది అలాగే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో వారి విజయవంతమైన వృత్తిని నిర్ధారిస్తుంది: శ్రీ అర్జున్ ముండా

54 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఏఐ పాఠ్యాంశాలను చేర్చే కార్యక్రమంలో రెండవ దశ;ఈఎంఆర్‌ఎస్‌ ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 25 నుండి 27 వరకు శిక్షణ వర్క్‌షాప్ నిర్వహించబడుతుంది

ఈఎంఆర్‌ఎస్‌ కోడర్స్ ఎక్స్‌పో, మునుపటి విద్యా సంవత్సరంలో ఈఎంఆర్‌ఎస్‌ల నుండి టాప్ 20 కోడింగ్ ప్రాజెక్ట్‌ల ప్రదర్శన కూడా ప్రారంభించబడింది

Posted On: 25 SEP 2023 3:14PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్‌ఈఎస్‌టిఎస్‌) ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోని 54 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్‌)లో 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్' రెండో దశని ప్రారంభించింది. ఈ రెండవ దశలో అడ్వాన్స్‌డ్ బ్లాక్ ప్రోగ్రామింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలు ఉంటాయి. సెక్రటరీ (గిరిజన వ్యవహారాలు) శ్రీ అనిల్ కుమార్ ఝా మూడు రోజుల వ్యక్తిగత ఉపాధ్యాయుల శిక్షణ వర్క్‌షాప్‌తో పాటు ఈఎంఆర్‌ఎస్‌ కోడర్స్ ఎక్స్‌పో, మునుపటి విద్యా సంవత్సరంలో ఈఎంఆర్‌ఎస్‌ల నుండి టాప్ 20 కోడింగ్ ప్రాజెక్ట్‌ల ప్రదర్శనను ఈ రోజు న్యూ ఢిల్లీలో ప్రారంభించారు.

గత సంవత్సరం అమలులో ప్రోత్సాహకరమైన ఫలితాల ఆధారంగా సవరించిన మాడ్యూల్ సిబిఎస్‌ఈ నైపుణ్య విద్యతో సమలేఖనం చేయబడిన అనుకూలీకరించిన కోడింగ్ మరియు కృత్రిమ మేధస్సు (ఏఐ) పాఠ్యాంశాలను పరిచయం చేస్తుంది. ఇది కోడింగ్, లాజికల్ సీక్వెన్సింగ్, లెర్నింగ్ లూప్స్ మరియు బ్లాక్ ప్రోగ్రామింగ్‌లో ప్రస్తుత కోర్సులకు అదనంగా ఉంటుంది. 20 గంటల మాడ్యూల్‌ను ప్రస్తుతం గిరిజన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ మరియు కోడింగ్‌ను పరిగణనలోకి తీసుకొని నిర్మించారు. ఆరవ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ యొక్క ప్రాథమిక అంశాలు బోధించబడతాయి, ఏడవ తరగతిలో విజువల్ ప్రోగ్రామింగ్  అధునాతన భావనలను పరిచయం చేస్తారు; గ్రేడ్ ఎనిమిదికి ఏఐ పరిచయ ఎక్స్పోజర్ సెషన్లను పొందుతుంది; మరియు గ్రేడ్ తొమ్మిది ఏఐ  ప్రాథమికాలను నేర్చుకుంటారు. గ్రేడ్ 10 కోసం సిబిఎస్‌ నైపుణ్యాల పాఠ్యాంశాలతో సమలేఖనం చేయబడిన ఏఐ మాడ్యూల్ 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతుంది.

 

image.png


ప్రోగ్రాం పైలట్ దశను ప్రారంభించిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా తన సందేశంలో “అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రాం చొరవ గిరిజన తరాలు డిజిటల్ అవకాశాలను ఉపయోగించుకోవడానికి బాగా సన్నద్ధం అయ్యేలా చూసేందుకు ఒక భారీ అడుగు. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ మరియు ఎన్‌ఈఎస్‌టిఎస్‌ మధ్య సహకారం, గిరిజన వర్గాల మధ్య ఉన్న విద్యాపరమైన అంతరాన్ని తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో వారి విజయవంతమైన వృత్తిని నిర్ధారిస్తుంది" అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సెక్రటరీ (గిరిజన వ్యవహారాలు) శ్రీ అనిల్ కుమార్ ఝా ప్రసంగిస్తూ భారతదేశంలో 10 కోట్లకు పైగా గిరిజన జనాభా ఉందని ఆధునిక విద్యను పొందేందుకు అనేక సందర్భాల్లో ఇప్పటికీ భాష మరియు సాంస్కృతిక అడ్డంకులు వారికి ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. బోధనలో ఈ అడ్డంకులను అధిగమించడం గిరిజన విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో చాలా దోహదపడుతుంది. ముఖ్యంగా భారతదేశంలోని గిరిజన వర్గాల కోసం వారి స్థానిక భాషలలో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం వల్ల పాఠ్యాంశాలను మరింత మెరుగైన రీతిలో అందించడానికి మరియు గిరిజన విద్యార్థులను సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో పోటీపడేలా తయారు చేయడానికి వారికి శక్తి లభిస్తుందని ఆయన అన్నారు. ఈఎంఆర్‌ఎస్‌ ఉపాధ్యాయులను ప్రోగ్రాంలో పూర్ణ హృదయంతో పాల్గొనడానికి మరియు కోడింగ్ మరియు ఏఐ యొక్క ప్రాథమికాలను నేర్చుకునేలా వారి విద్యార్థులను ప్రేరేపించడానికి మరియు ఉత్తేజపరిచేందుకు శ్రీ ఝా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మొదటి ముగ్గురు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆయన అభినందించారు.

 

image.pngimage.png

 

image.pngimage.png

గత సంవత్సరం అమెజాన్ ఇండియా మరియు లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ (ఎల్‌ఎల్‌ఎఫ్‌) సహకారంతో ప్రారంభించబడిన పైలట్ దశ కంప్యూటర్ సైన్స్ మరియు బ్లాక్ ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్  ఫండమెంటల్స్‌పై ఆరు నుండి ఎనిమిది తరగతుల వరకు 7,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. రోజురోజుకు విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి గిరిజన విద్యార్థులను సిద్ధంగా ఉంచడానికి, విద్యావేత్తలు సరైన పరిజ్ఞానం మరియు వనరులతో సన్నద్ధం కావడం సముచితం. 50 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు 2-రోజుల సామర్థ్యం పెంపొందించే వర్క్‌షాప్ ద్వారా శిక్షణ పొందారు. (ఫేజ్ I ప్రారంభం: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1887065)

ఈ కార్యక్రమంలో అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ (కస్టమర్ ట్రస్ట్) హెడ్ శ్రీ నితిన్ సలూజా, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మేనేజింగ్ పార్టనర్ శ్రీమతి నూరియా అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1960765) Visitor Counter : 89