కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టెలికాం, బ్రాడ్‌కాస్టింగ్ మరియు ఐ టీ రంగాలలో ఆర్ అండ్ డీ ని ప్రోత్సహించడంపై ట్రాయ్ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది

Posted On: 23 SEP 2023 4:31PM by PIB Hyderabad

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)  'టెలికాం, బ్రాడ్‌కాస్టింగ్ మరియు ఐ టీ (ఐ సి టి) రంగాలలో ఆర్ అండ్ డీ ని ప్రోత్సహించడం'పై ఒక సంప్రదింపుల పత్రాన్ని ఈరోజు సెప్టెంబర్ 22, 2023న విడుదల చేసింది.  ఆర్ అండ్ డీ ని మెరుగుపరచడం కోసం సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ సంప్రదింపు పత్రం యొక్క ఉద్దేశ్యం. దేశంలోని ఐ టీ సి సెక్టార్‌లోఆర్ అండ్ డీ శాస్త్రవేత్తలు/ ఇంజనీర్లను రూపొందించడానికి సువ్యవస్తితమైన ప్రక్రియలు ఉన్నాయి. భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడానికి మరియు ఐ సి టి రంగం లో ఎగుమతులను ప్రోత్సహించడానికి ఐ సి టి ఉత్పత్తులు మరియు సేవల అభివృద్ధి మరియు ఆవిష్కరణల కోసం ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వాముల ద్వారా తగిన మద్దతునిస్తుంది. 

 

వర్తమాన ప్రపంచాన్ని రూపొందించడంలో ఆర్ అండ్ డీ కీలక పాత్ర పోషించింది. సంవత్సరాలుగా ఆర్ అండ్ డీ  పరిణామం కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో మరియు అన్వయించడంలో, ఆర్థిక వ్యవస్థలను రూపొందించడంలో మరియు అనేక పారిశ్రామిక విప్లవాల ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినట్లుగా ఒక దేశం యొక్క ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థ దాని ఆర్థిక వృద్ధి మరియు మొత్తం పురోగతితో ముడిపడి ఉంది. ఆర్ అండ్ డీ ఉత్పత్తులు మరియు సేవల లభ్యత, ప్రాప్యత మరియు స్థోమత పెంచడం ద్వారా  పౌరుల జీవన నాణ్యతపై సానుకూల ప్రభావం చూపుతుంది.  దేశ స్వావలంబన మరియు భద్రత కోసం ఆర్ అండ్ డీ మరియు ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి.

 

"మధ్య మరియు దక్షిణ ఆసియా" ప్రాంతంలో అత్యున్నత స్థాయి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆర్ అండ్ డీ మరియు ఆవిష్కరణలలో విశేషమైన పురోగతిని సాధించింది.  గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో 40వ స్థానంలో ఉంది. దేశం మేధో సంపత్తి హక్కుల ( ఐ పీ ఆర్ లు)లో గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశంలో ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లో “జాతీయ విద్యా విధానం  2020”, “జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం  2019”, “జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం  2018”, “మేక్ ఇన్ ఇండియా”, “డిజిటల్ ఇండియా”, “స్టార్టప్ ఇండియా” మొదలైన ప్రభుత్వ కార్యక్రమాలు ముఖ్యమైన పాత్రలను పోషించాయి. ఇంకా "ఆత్మనిర్భర్ భారత్", "టెలికాం ప్రోడక్ట్-లింక్డ్ ఇన్సెంటివ్స్ (పిఎల్‌ఐ) స్కీమ్", "డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్నోవేషన్ స్క్వేర్" వంటి ఇటీవలి కార్యక్రమాలు కూడా ఈ దిశలో చర్యలను ప్రోత్సహించాయి.

 

అయితే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థ, ఐ సి టి రంగంలో ఆర్ అండ్ డీ ని ప్రోత్సహించడం, ఆర్ అండ్ డీ లో అంతర్జాతీయ ఉత్తమ అభ్యాసాల నుండి నేర్చుకోవడం మరియు భారతదేశంలో సంబంధిత అభ్యాసాలను వర్తింపజేయడం మరియు విధానాల పరంగా జోక్యం అవసరమయ్యే సమస్యలను గుర్తించడం ఐ సి టి రంగంలో ఆర్ అండ్ డీ ని మెరుగుపరచడానికి మరియు భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఎదగడంలో సహాయపడటానికి ప్రోత్సాహకాలు వంటి అంశాలలో ప్రగతి కి చాలా అవకాశాలు వున్నాయి.  దీని దృష్ట్యా ట్రాయ్ చట్టం 1997 ప్రకారం దేశీయంగా అభివృద్ధి చెందిన ఉత్పత్తులు మరియు సేవలతో ఐ సి టి పరిశ్రమ యొక్క క్రమమైన వృద్ధికి సంబంధించిన చర్యలపై దేశంలోని ఐ సి టి రంగానికి ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించే సమస్యలపై భారత ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి వాటాదారులతో సంప్రదింపులు  చేపట్టాలని అథారిటీ నిర్ణయించింది. 

 

ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ మరియు ఐఐటి హైదరాబాద్ మొదలైన విద్యాసంస్థలు మరియు పరిశ్రమ నిపుణుల నుండి ఆన్‌లైన్ మేధో మథనం సదస్సు లు మరియు సూచనల ఆధారంగా తయారు చేసిన ఈ సంప్రదింపుల పత్రంలో ట్రాయ్ భారతదేశంలోని ప్రస్తుత ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థలో జోక్యం చేసుకోవలసిన ముఖ్యమైన సమస్యలను మూడు అంశాలను విశ్లేషించింది. అంశాలు: "విద్య మరియు శిక్షణ వ్యవస్థ", "సైన్స్ వ్యవస్థ" మరియు "నియంత్రణ చట్రం". మూడవ కేంద్రీకృత అంశం“నియంత్రణ చట్రం” రెండు భాగాలుగా విభజించబడింది, అవి “విధానాలు మరియు కార్యక్రమాలు” మరియు “ఐ పీ ఆర్ చట్రం”. ఆర్ అండ్ డీ మరియు ఆవిష్కరణలకు ముందస్తుగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశంలోని వర్ధమాన పారిశ్రామిక వ్యవస్థాపకులు మరియు ఆవిష్కర్తలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. సంప్రదింపుల పత్రంలో ట్రాయ్ పటిష్టమైన ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థను నిర్మించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది మరియు దానిని ప్రారంభించడానికి అవసరమైన సంభావ్య సమస్యలను చర్చిస్తుంది.

 

టెలికాం, బ్రాడ్‌కాస్టింగ్ మరియు ఐటి రంగాలలో సాంకేతిక పురోగతులు మరియు కన్వర్జెన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 5జీ, 6జీ, ఓపెన్-రాన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ ఓ టీ), ఏ ఐ మరియు ఎం ఎల్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డి ఎల్ టీ), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏ ఆర్), వర్చువల్ రియాలిటీ (వీ ఆర్) మరియు మెటావర్స్, క్వాంటం కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్, ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్‌వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ (ఎన్ ఎఫ్ వీ), సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్‌వర్కింగ్ (ఎస్ డి ఎన్ ), ఓవర్-ది-టాప్ (ఓ టీ టీ) సేవలు మరియు హైబ్రిడ్ సెట్ టాప్ బాక్స్ (ఎస్ టీ బీ) మొదలైనవిఈ రంగాలలో అభివృద్ధి చెందుతున్న కొన్ని దోరాణులు.  సంప్రదింపుల పత్రంలో చర్చించినట్లు,  ప్రభుత్వం-పరిశ్రమ-విద్యాసంఘాల సహకారం, పరిశోధన యొక్క వాణిజ్యీకరణ, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహం, పేటెంట్ ఆమోదం చక్రాలు, ఐ పీ ఆర్ రక్షణ మరియు ఐ పీ -ఆధారిత ఫైనాన్స్ ప్రయత్నాలు వంటి ఉద్భవిస్తున్న ధోరణులను ఉపయోగించుకోవడానికి మరియు భారతదేశం యొక్క ఆర్ అండ్ డీ మరియు ఆవిష్కరణ ప్రయత్నాల యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించడానికి సంబంధిత సమస్యలపై దృష్టి సారించడం అవసరం.

 

ఈ కన్సల్టేషన్ పేపర్‌లో, ఆర్ అండ్ డీ మరియు ఇన్నోవేషన్ స్పేస్‌లో ప్రముఖ దేశాల ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థను కూడా ట్రాయ్ అన్వేషించింది. వీటిలో ఇజ్రాయెల్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యునైటెడ్ స్టేట్స్, స్వీడన్, జపాన్, స్విట్జర్లాండ్, జర్మనీ, డెన్మార్క్, ఫిన్లాండ్ మొదలైనవి ఉన్నాయి. ఆర్ అండ్ డీ లో అంతర్జాతీయ అత్యుత్తమ అభ్యాసాలు భారతదేశానికి దాని ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనే దాని ఆశయంతో కీలకమైన అభ్యాసాలుగా పని చేయవచ్చు.

 

వాటాదారుల నుండి సూచనలు కోసం సంప్రదింపు పత్రం ట్రాయ్ వెబ్‌సైట్‌లో (www.trai.gov.in) ఉంది. వాటాదారుల నుండి 23 అక్టోబర్ 2023లోపున సంప్రదింపులకు సంబంధించిన సమస్యలపై వ్రాతపూర్వక వ్యాఖ్యలు ఆహ్వానిస్తున్నారు.  6 నవంబర్ 2023లోపు కౌంటర్ కామెంట్‌లు ఆహ్వానించబడతాయి.

 

వ్యాఖ్యలు మరియు కౌంటర్-కామెంట్‌లను ఎలక్ట్రానిక్ ఫారమ్‌లో advisorit@trai.gov.inకు ఇమెయిల్ ద్వారా మరియు ja-cadiv@trai.gov.inకి కాపీతో పంపవచ్చు. మరింత సమాచారం కోసం, శ్రీ ఆనంద్ కుమార్ సింగ్, సలహాదారు (సి ఎ, ఐ టీ & టి డి)ని టెలి.నెం.+91-11-23210990లో సంప్రదించవచ్చు.

 

***



(Release ID: 1960058) Visitor Counter : 95