జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛభారత్ మిషన్ - గ్రామీణ్ కింద 75% ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలతో పారిశుధ్యంలో ప్రధాన మైలురాయిని సాధించిన భారత్


4.4 లక్షలకు పైగా గ్రామాలు ఒడిఎఫ్ ప్లస్ గా ప్రకటించుకోవడం 2025 నాటికి ఎస్ బి ఎం - జి ఫేజ్ 2 లక్ష్యాలను సాధించే

దిశగా ఒక ముఖ్యమైన అడుగు: కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో 2.05 కోట్ల మంది పైగా శ్రమదానంతో ఐదు కోట్ల మంది భాగస్వామ్యం: షెకావత్
14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని గ్రామాలు ఒడి ఎఫ్ ప్లస్ హోదాను, 4 రాష్ట్రాలు/కేంద్రపాలిత
ప్రాంతాల్లోని గ్రామాలు
ఒడి ఎఫ్ ప్లస్ మోడల్ స్టేటస్ ను సాధించాయి.

అత్యుత్తమ పనితీరు కనబరచిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్ నికోబార్ , దాద్రా అండ్ నాగర్ హవేలీ, గోవా,

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర

Posted On: 23 SEP 2023 5:58PM by PIB Hyderabad

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్ 2 కింద దేశం మరో ప్రధాన మైలురాయిని
సాధించింది, దేశంలోని మొత్తం గ్రామాలలో నాలుగింట మూడు వంతులు అంటే 75% గ్రామాలు
మిషన్ రెండవ దశ కింద ఒడిఎఫ్ ప్లస్ హోదాను సాధించాయి. ఘన లేదా ద్రవ వ్యర్థాల
నిర్వహణ వ్యవస్థలను అమలు చేయడంతో పాటు బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్) హోదాను
నిలుపుకున్న గ్రామాన్ని ఒడిఎఫ్ ప్లస్ గ్రామం గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు, 4.43
లక్షలకు పైగా గ్రామాలు తమను తాము ఒడిఎఫ్ ప్లస్ గా ప్రకటించుకున్నాయి, ఇది 2024-25
నాటికి స్వచ్ఛభారత్ మిషన్-గ్రామీణ (ఎస్ బి ఎం -జి) ఫేజ్ 2 లక్ష్యాలను సాధించే దిశగా
ఒక ముఖ్యమైన అడుగు.
అండమాన్ నికోబార్ , దాద్రా అండ్ నాగర్ హవేలీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, లడఖ్,
పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలు 100% ఒడిఎఫ్ ప్లస్ సాధించాయి.
అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ ,డామన్ డయ్యూ, జమ్మూ కాశ్మీర్
,సిక్కింలో 100% ఒడిఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాలు ఒడిఎఫ్ ప్లస్ హోదాను సాధించడంలో గణనీయమైన పురోగతిని
చూపించాయి. ఈ మైలురాయిని చేరుకోవడంలో వారి ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయి.

కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ శనివారం న్యూఢిల్లీలో విలేకరుల
సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014 లో బాధ్యతలు
స్వీకరించినప్పటి నుండి స్వచ్ఛ భారత్ మిషన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని,
'స్వచ్ఛత'ను 'జన్ ఆందోళన్'గా మార్చాలని ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం
మద్దతు తెలిపిందని అన్నారు.‘2019 నాటికి దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా
మార్చాలనే ప్రధాన మంత్రి దార్శనికత , లక్ష్యం నిజమైన ప్రజా ఉద్యమంగా మారింది
లక్ష్యాలను సమయానికి ముందే సాధించారు. ఈ విజయాన్ని ప్రధాన మంత్రి ఒక మైలు
రాయిగా అభివర్ణించారు వ్యర్థాల నుండి సంపద అనే దృక్పథంతో కనిపించే పరిశుభ్రత
,సమర్థవంతమైన నిర్వహణ ,అన్ని వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే 'సంపూర్ణ స్వచ్ఛత'
దిశగా పయనించాలని భావించారు‘ అని పేర్కొన్నారు.
ఈ విజన్, మిషన్ ఆధారంగా ఎస్బిఎం- జి ఫేజ్-2 2025 నాటికి అన్ని గ్రామాలను ఒ డి ఎఫ్
ప్లస్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని షెకావత్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న
4,43,964 ఒ డి ఎఫ్ ప్లస్ ప్లస్ గ్రామాలలో 2,92,497 గ్రామాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్
మెంట్ లేదా లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లతో ఒ డి ఎఫ్
ప్లస్ ఔత్సాహిక గ్రామాలు కాగా, 55,549 గ్రామాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్,
లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రెండింటికీ ఏర్పాట్లు ఉన్న ఒ డి ఎఫ్ ప్లస్ రైజింగ్
గ్రామాలు, మరో 96,018 గ్రామాలు ఒ డి ఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలు. మొత్తంగా ఇప్పటి
వరకు 2,31,080 గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు ఉండగా, 3,76,353
గ్రామాల్లో ద్రవ వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు ఉన్నాయి.
ఈ ఏడాది స్వచ్ఛభారత్ మిషన్ కు తొమ్మిదేళ్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి
తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2లో దేశం ఒ డి ఎఫ్ నుంచి ఒ డి ఎఫ్ ప్లస్ కు
మారినందున 75 శాతం ఒ డి ఎఫ్ ప్లస్ గ్రామాలను సాధించడం భారతదేశానికి ఒక ముఖ్యమైన
మైలురాయి.బహిరంగ మలవిసర్జన రహిత స్థితి (ఒ డి ఎఫ్ -ఎస్), సాలిడ్ (బయో డీగ్రేడబుల్)
వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ (పీడబ్ల్యూఎం), లిక్విడ్
వేస్ట్ మేనేజ్మెంట్ (ఎల్ డబ్ల్యూఎం), ఫేకల్ (మల) స్లడ్జ్ మేనేజ్మెంట్
(ఎఫ్ఎస్ఎం), గోబర్ధన్, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్/ బిహేవియర్
ఛేంజ్ కమ్యూనికేషన్ (ఐఈసీ/బీసీసీ), కెపాసిటీ బిల్డింగ్ వంటివి ఎస్ బి ఎం(జీ) ఫేజ్-
2లోని ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సును

మెరుగుపరచడంలో ఎస్ బిఎం-జీ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. ఒ డి ఎఫ్ ప్లస్
మోడల్ విలేజ్ అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ , లిక్విడ్ వేస్ట్ మేనేజ్
మెంట్ రెండింటికీ సంబంధించిన ఏర్పాట్లను కలిగి ఉంటుంది. దృశ్య పరిశుభ్రతను
గమనిస్తారు, అనగా, తక్కువ చెత్త, తక్కువ నిలిచిపోయిన మురుగునీరు, బహిరంగ ప్రదేశాలలో
ప్లాస్టిక్ వ్యర్థాల డంప్ లేకపోవడం; ఇంకా ఒ డి ఎఫ్ ప్లస్ ఇన్ఫర్మేషన్,
ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐ ఇ సి ) సందేశాలను ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం
96,192 గ్రామాలు ఒ డి ఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలుగా ఉన్నాయి.

ఎస్ బి ఎం ఫేజ్-2కు మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1.43 లక్షల కోట్లు కాగా, ఇందులో
52,497 ఎస్ బి ఎం-జీ నుంచి రావాల్సి ఉందని, మిగిలినది 15వ ఆర్థిక సంఘం నిధులు (51,057
కోట్లు), ఎంజీఎన్ ఆర్ ఈజీఏ (24,823 కోట్లు) నుంచి రావాల్సి ఉందని షెకావత్
పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి ఎస్ బి ఎం-జీ నుంచి కేంద్ర వాటా కేటాయింపు
రూ.7,192 కోట్లు కాగా, ఈ ఏడాది అన్ని వనరుల నుంచి రూ.22,264 కోట్లు ఖర్చు చేయాలని
రాష్ట్రాలు ప్రణాళిక రూపొందించాయి. ఎస్ బి ఎం-జీ నిధుల నుంచి రూ.4,690 కోట్లు, ఎఫ్ఎఫ్
సి ఎంజీఎన్ఆర్ఈజీఏ కలిపి మొత్తం రూ.18,686 కోట్లు ఖర్చు చేశారు. యూపీ (1214 కోట్లు),
బీహార్ (752 కోట్లు), పశ్చిమ బెంగాల్ (367 కోట్లు) రాష్ట్రాలు ఈ ఏడాది ఎస్ బిఎం-జీ
నిధులను ఎక్కువగా ఖర్చు చేశాయి. పారిశుద్ధ్య ఆస్తులను నిర్మించడానికి, ప్రవర్తన
మార్పును ప్రోత్సహించడానికి ,ఘన - ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను అమలు
చేయడానికి ఈ నిధులను ఉపయోగించారు.
జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్), తాగునీరు
,పారిశుద్ధ్య విభాగం కింద ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు
నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ (ఎస్ హెచ్ ఎస్) - ప్రచారంలో ఈ ఏడాది నాటికి 75%
ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను సాధించడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
'గార్బేజ్ ఫ్రీ ఇండియా' థీమ్ తో శ్రమదానం కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతా హీ సేవ
ప్రచార కార్యక్రమం ఓడీఎఫ్ ప్లస్ వేగాన్ని పెంచుతోందని, స్వచ్ఛ భారత్ మిషన్
లక్ష్యాలను సాధించే దిశగా సమాజ భాగస్వామ్యాన్ని - జన్ ఆందోళన్- ను

పునరుజ్జీవింపచేస్తోందని అన్నారు.

ఎస్ హెచ్ ఎస్ -2023లో ఇప్పటివరకు సాధించిన ప్రధాన విజయాలను వివరిస్తూ, 5 కోట్ల మంది
ఈ ప్రచారంలో పాల్గొన్నారని, శ్రమదానం కార్యక్రమాల్లో భాగంగా 2,303 బీచ్. లు,
1,468 నదీతీరాలు , తీరప్రాంతాలు; 3,223 లెగసీ వేస్ట్ సైట్; 480 టూరిస్ట్ అండ్ ఐకానిక్
ప్రదేశాలు ; 32,178 బహిరంగ ప్రదేశాలు; 4432 జలవనరులు; 17,027 సంస్థాగత భవనాలు, 14,443
చెత్త శుద్ధి కేంద్రాలలో 2.05 కోట్ల మందికి పైగా శ్రమదానం చేశారని శ్రీ షెకావత్
తెలియజేశారు.
ఎస్ బి ఎం-జిలోని 34 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, సుమారు 42
భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు / విభాగాలు కూడా ఎస్ హెచ్ ఎస్ 2023 లో చురుకుగా
పాల్గొంటున్నాయి. పారిశుధ్యం , పరిశుభ్రతను మెరుగుపరచడానికి సమిష్టి , ఏకీకృత
ప్రయత్నం ఉన్నప్పుడు ఏమి సాధించవచ్చో ఎస్ బిఎమ్ (జి) ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ.
గర్వించదగిన ఈ ఘనత సాధించినందుకు జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన తాగునీరు
,పారిశుద్ధ్య విభాగం అన్ని గ్రామాలు, గ్రామ పంచాయితీలు, జిల్లాలు, రాష్ట్రాలు/
కేంద్రపాలిత ప్రాంతాలను అభినందించింది ప్రశంసించింది.
Click Here to view SHS- 2023 State Report Card

సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ - ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి, 2,380
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్లను, 1,78,556 వ్యర్థాల సేకరణ ,
సెగ్రిగేషన్ షెడ్ లను ఏర్పాటు చేశారు. దేశంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్

సమర్థవంతంగా జరిగేలా 3 లక్షలకు పైగా వాహనాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని 2,603
బ్లాకులు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను కలిగి ఉన్నాయి. 23 రాష్ట్రాలు/
కేంద్రపాలిత ప్రాంతాలు బిటుమినస్ రోడ్డు నిర్మాణం కోసం వ్యర్థ ప్లాస్టిక్ ను
ఉపయోగిస్తున్నాయి. తమిళనాడు , కేరళ రాష్ట్రాలు సిమెంట్ కర్మాగారాల్లో
ఉపయోగిస్తున్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన
మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టిక్ ను శుభ్రం చేసి, ముక్కలు చేసి , బెయిలింగ్ అనంతరం
రోడ్డు నిర్మాణంలో ఉపయోగించడానికి , సిమెంట్ కర్మాగారాలలో ఇంధనంగా వాడేందుకు
రవాణా చేస్తారు. దాదాపు 1.59 లక్షల గ్రామ పంచాయతీలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్
యూపీ)ను నిషేధించాలని తీర్మానించాయి. ప్లాస్టిక్ వ్యర్థాల పట్టణ -గ్రామీణ
సమ్మేళనంపై దృష్టి సారించారు, దీని కింద పట్టణ ఆస్తులను మొదట గ్రామీణ ప్రాంతాల
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సమర్థవంతంగా ఉపయోగిస్తారు, తరువాత గ్రామీణ
ప్రాంతాల్లో పిడబ్ల్యుఎంయులు ఏర్పాటు చేస్తారు. ఇంటి స్థాయిలో బయో-
డీగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్ మెంట్ కోసం , కమ్యూనిటీ స్థాయిలో కంపోస్టింగ్
కోసం ప్రజలు తమ పొడి ,తడి (సేంద్రీయ) వ్యర్థాలను మూలం వద్ద వేరు చేసేలా
ప్రోత్సహిస్తున్నారు. 4,94,822 కమ్యూనిటీ కంపోస్టు గుంతలు, 1,78,554 వ్యర్థాల
సేకరణ షెడ్లు, వ్యర్థాల సేకరణ, రవాణా కోసం సుమారు 3,16,123 వాహనాలు
పనిచేస్తున్నాయి.
279 జిల్లాల్లో 729 బయోగ్యాస్, 63 సీబీజీ ప్లాంట్ల పూర్తి
గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్-ధన్ అని పిలువబడే గోబర్ధన్,
బయోడిగ్రేడబుల్ వ్యర్థాల రికవరీ, వ్యర్థాలను వనరులుగా మార్చడానికి , క్లీన్ అండ్
గ్రీన్ విలేజ్ సృష్టించడానికి మద్దతు ఇచ్చే ఒక చొరవ. ఇది 'వేస్ట్ టు వెల్త్' చొరవ,
దీనిలో గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను బయోగ్యాస్ / సిబిజితో పాటు
బయో స్లరీ / బయో ఎరువును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు . ఇది భారత ప్రభుత్వ
సర్క్యులర్ ఎకానమీ ,మిషన్ లైఫ్ చొరవలకు అనుగుణంగా ఉంటుంది. 307 జిల్లాల్లో 848
ఫంక్షనల్ బయోగ్యాస్/సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
గ్రేవాటర్ మేనేజ్ మెంట్ : ఎస్ బి ఎం జీ) మార్గదర్శకాల ప్రకారం గ్రామీణ
ప్రాంతాల్లో ఇంటింటికీ వినియోగించే తాగునీటిలో 65-70 శాతం గ్రేవాటర్ గా మారుతుందని,
ఇది తలసరి రోజుకు 36 లీటర్లు అవుతుందని అంచనా. జల్ జీవన్ మిషన్ ప్రకారం తలసరి తాగునీటి
సరఫరా 55 లీటర్ల ఆధారంగా ఈ అంచనా వేశారు. ఎస్ బి ఎం (జి) కింద గ్రేవాటర్ మేనేజ్
మెంట్ మూడు ‘ఆర్‘ ల సూత్రం - రెడ్యూస్, రీ యూజ్, రీ చార్జీ- పై దృష్టి పెడుతుంది.
కిచెన్ గార్డెన్, ఇంకుడుగుంత, , లీచ్-పిట్ , మ్యాజిక్-పిట్ మొదలైన సుస్థిర , చౌకైన
పరిష్కారాల ద్వారా ఆన్ సైట్ ట్రీట్ మెంట్ వ్యూహాల ద్వారా ఈ తగ్గించడం,
పునర్వినియోగం చేయడం రీఛార్జ్ చేయడం సూత్రం ఆధారపడి ఉంది. పెద్ద గ్రామాలు (5000
కంటే ఎక్కువ జనాభా ఉన్న) లేదా ఈ సాధారణ సాంకేతికతలు సాధ్యం కాని చోట,
డబ్ల్యుఎస్ పి, , సిడబ్ల్యు, ఫైటోరిడ్, డిఇడబ్ల్యుఎటి, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను
అవలంబించాలని సిఫార్సు చేశారు.
2021-23 నుండి మూడు వెర్షన్లలో సుజలాం క్యాంపెయిన్ లను ప్రారంభించడం ద్వారా
గ్రామీణ ప్రాంతాల్లో గ్రేవాటర్ సమర్థవంతమైన నిర్వహణను ప్రోత్సహించడానికి ఎస్
బిఎం (జి) చొరవ తీసుకుంది. ఈ క్యాంపెయిన్ లు ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం
ఇంకా ఆయా గ్రామాల నుండి ప్రోత్సాహకరమైన భాగస్వామ్యాన్ని తీసుకురాగలిగాయి. దీని
ప్రభావం చాలా ఎక్కువగా ఉంది , మూడు ప్రచార కార్యక్రమాల సమయంలో కమ్యూనిటీ
ప్రాంతాలు, సంస్థలు ,డ్రైనేజీ డిశ్చార్జ్ పాయింట్ల వద్ద మూలానికి దగ్గరగా ,
ఆన్సైట్ కు సమీపంలో గ్రేవాటర్ నిర్వహణ కోసం 5.1 మిలియన్ ఇంకుడు గుంతలు తక్కువ

శ్రమ, ఖర్చులతో నిర్మించబడ్డాయి. ఇది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఎల్
డబ్ల్యూ ఎం, మొత్తం ఓడిఎఫ్ ప్లస్ సాధనతో బహుళ గ్రామాల గరిష్ట సంతృప్తతకు
దారితీసింది. 63% గ్రామాలు గ్రేవాటర్ నిర్వహణను సాధించాయి. ఓడిఎఫ్ ప్లస్ విజయాలకు
దోహదం చేశాయి. మిగిలిన 37 శాతం గ్రామాలు త్వరలోనే ఈ లక్ష్యాన్ని
చేరుకోనున్నాయి. 100% హర్ ఘర్ జల్ ఉన్న గ్రామాలు, నమామి గంగే పరిధిలోని గ్రామాలు,
ఆకాంక్షాత్మక జిల్లాలు, ఎస్ఏజీవై , 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద గ్రామాలు ఈ
37% మిగిలిపోయిన వాటి కింద గ్రే వాటర్ మేనేజ్మెంట్ సాధనను ముందుకు
తీసుకువెళుతున్నాయి. ఎన్ జి టి స్పెసిఫికేషన్ల ప్రకారం సీఓడీ/బీఓడీ ఉండేలా చూడటం
ద్వారా డ్రైనేజీ డిశ్చార్జ్ పాయింట్ల వద్ద ట్రీట్మెంట్ సిస్టమ్ లను
మ్యాపింగ్ చేయడం, ఫిక్స్ చేయడం ద్వారా నమామి గంగే గ్రామాలకు ప్రాధాన్యత
ఇస్తారు. గ్రేవాటర్ మేనేజ్ మెంట్ కింద ఉన్న డిడిడబ్ల్యుఎస్ కిచెన్ గార్డెన్ వంటి
చిన్న స్థాయిలో , పెద్ద ఎత్తున వ్యవసాయ భూమి/ పరిశ్రమలు వంటి నీటిపారుదల అవసరాల
కోసం గ్రే వాటర్ ను రీసైక్లింగ్ చేయడం ద్వారా సర్క్యులరిటీ కాన్సెప్ట్ కు దోహదం
చేస్తోంది. డిడిడబ్ల్యుఎస్ కూడా ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ , ఎకోసిస్టమ్ సేవలకు
సహకారం అందించడం ద్వారా ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది.
మల వ్యర్థ, ద్రవ వ్యర్థాలను శుద్ధి చేయడానికి ట్విన్ పిట్ టాయిలెట్ లను
సిఫార్సు చేస్తున్నారు. సింగిల్ పిట్ మరుగుదొడ్లు ఉన్న చోట, అవి ఇంకా నిండని, లేదా
ఖాళీ చేయని చోట కూడా యునిసెఫ్ , ఇతర అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వీటిని
సురక్షితమైనవిగా పరిగణిస్తారు. కానీ వాటిని ఖాళీ చేయాల్సిన చోట లేదా సెప్టిక్
ట్యాంకులు ఉన్న చోట (ఇంకుడు గుంతలతో లేదా లేకుండా), యాంత్రిక వ్యర్థాలను శుద్ధి
చేయడానికి మలాన్ని ఎస్ టిపి/ ఎఫ్ ఎస్ టి పికి తరలించడం జోక్యం చేసుకునే పద్ధతిగా
మారుతుంది. నేటి వరకు రాష్ట్రాలు ఎస్ బి ఎం జి, ఐ ఎమ్ ఐ ఎస్ ద్వారా. టాయిలెట్
టైపోలజీ , బేస్ లైన్ ను అప్ డేట్ చేశాయి . గ్రామీణ గృహాలలో మొత్తం 73% ట్విన్
పిట్స్, 12.4% సింగిల్ పిట్స్ ,11% సెప్టిక్ ట్యాంకులను నివేదించాయి. ఎస్ బిఎమ్ (జి)
కో-ట్రీట్ మెంట్ నిర్మాణాలను ప్లాన్ చేయడానికి లేదా కొత్త ఎఫ్ ఎస్ టిపిలను
నిర్మించడానికి రాష్ట్రాలకు తలసరి రూ .230 అందిస్తుంది. అదనంగా, ఆన్-సైట్
పారిశుద్ధ్య వ్యవస్థల యాంత్రిక తొలగింపును బలోపేతం చేయడానికి ,మల వ్యర్థాలను
సురక్షితంగా పారవేయడానికి ట్రీట్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి జిల్లాలకు
మద్దతు ఇవ్వడంతో పాటు, సింగిల్ పిట్ టాయిలెట్లను ట్విన్ పిట్ టాయిలెట్లుగా
(లేదా ఇలాంటి వ్యవస్థలు) మార్చే అవకాశం ఉంది, దీని కోసం ఎఫ్ఎస.పి / ఎంజిఎన్ఆర్ఇజిఎ
నుండి నిధులను ఉపయోగించాలి. సెప్టిక్ ట్యాంకులు ఉన్న మిగిలిన మరుగుదొడ్లను
కన్వర్జెన్స్ విధానంలో సమీపంలోని ఎఫ్ఎస్టీపీ/ఎస్టీపీతో అనుసంధానం చేస్తున్నారు.
ప్రస్తుతం.. 1198 ఎఫ్ ఎస్ టిపిలు , 765 ఎస్ టిపిలు పని చేస్తున్నట్టు రాష్ట్రాలు ,
మొత్తం మీద 316 జిల్లాలు నివేదించాయి. అవి కన్వర్జెన్స్ మెథడాలజీ కింద ప్రస్తుత
ఎస్ టిపిలు / ఎఫ్ ఎస్ టిపిలతో అనుసంధానాన్ని ప్రారంభించాయి. ఐఎంఐఎస్ లో నివేదించిన
టాయిలెట్ టైపాలజీ డేటా విశ్లేషణ ప్రకారం, 288 జిల్లాల్లో 80% సెప్టిక్
ట్యాంకులు పైన పేర్కొన్న 11% కింద ఉన్నాయి మరియు వాటిని హాట్ స్పాట్ జిల్లాలుగా
పరిగణిస్తారు. పైన పేర్కొన్న ఎఫ్ ఎస్ టిపిలు/ఎస్ టిపిలతో అనుసంధానం ప్రారంభించిన 316
జిల్లాలలో 108 జిల్లాలు హాట్ స్పాట్ జిల్లాలుగా ఉన్నాయి.

 

*****


(Release ID: 1960056) Visitor Counter : 178