భారత ఎన్నికల సంఘం
యువ ఓటర్లకు అవగాహన కల్పించి ప్రోత్సహించేలా కామిక్ బుక్
- "చాచా చౌదరి ఔర్ చునావి దంగల్" పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చిన భారత ఎన్నిక కమిషన్
- ఈ కామిక్ పుస్తకం భారత ఎన్నిక కమిషన్ (ఈసీఐ) & ప్రాణ్ కామిక్స్ సంయుక్త చొరవ
- కామిక్ అనేది ఔట్ రీచ్ మాధ్యమంగా నేటి డిజిటల్ యుగంలో కూడా భర్తీ చేయలేని, మేటి మాధ్యమంగా ఉంది: సీఈసీ రాజీవ్ కుమార్
Posted On:
20 SEP 2023 6:09PM by PIB Hyderabad
మనం ప్రతిష్టాత్మకమైన మన చిన్ననాటి రోజులలోకి తిరిగి చూస్తే చాచా చౌదరి కామిక్స్ మనతో వివిధ పుస్తకాల రూపంలో పంచుకున్న వ్యామోహపూరిత సాహసాలు చిరస్మరణీయంగా మదిలో మెదులుతూ ఉంటాయి. చాచా చౌదరి మరియు సాబు పాత్రలు అన్ని తరాల పాఠకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే వారు తమ ఆకర్షణీయమైన సంభాషణలు, పరస్పర చర్యలతో పాఠకులను (ప్రేక్షకులను) మంత్రముగ్ధులను చేసి పుస్తకాంశం పట్ల మన ఆకస్తిని రేకెత్తిస్తారు. చాచా చౌదరి కామిక్స్‌కు అపారమైన ఆదరణ ఉన్నందున భారత ఎన్నికల ప్రక్రియ ఓటరు ప్రాధాన్యతను గురించి వివరించేందుకు "చాచా చౌదరి ఔర్ చునావి దంగల్" అనే కామిక్ పుస్తకాన్ని సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ మరియు ఈసీలు శ్రీ అనుప్ చంద్ర పాండే మరియు శ్రీ అరుణ్ గోయెల్ ఈ రోజు నిర్వాచన్ సదన్‌లో ఆవిష్కరించారు. కామిక్ పుస్తకం ఈసీఐ & ప్రాణ్ కామిక్స్ యొక్క ఉమ్మడి చొరవ. ఇది ప్రజాస్వామ్య పండుగలో నమోదు చేసుకోవడానికి మరియు పాల్గొనడానికి యువతను ప్రేరేపించడానికి రూపొందించబడింది. ఇది ప్రముఖ కార్టూనిస్ట్ దివంగత శ్రీ ప్రాణ్ కుమార్ శర్మచే జీవం పోసిన చాచా చౌదరి, సాబు, బిల్లూ అనే ఐకానిక్ కార్టూన్ పాత్రలను కలిగి ఉంది. ఈ సందర్భంగా సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా యుగంలో కూడా కామిక్స్ ఔట్ రీచ్ మాధ్యమంగా ప్రాసంగికమని మరియు భర్తీ చేయలేనిదని అన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, సీఈసీ ఈ హాస్య పాత్రలు వారి విశ్వజనీన ఆకర్షణ మరియు నిజాయితీ, దయ మరియు కరుణ వంటి విలువలకు ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సృజనాత్మకంగా తెలియజేయడానికి ఈ పుస్తకం ఒక ఆకర్షణీయమైన వేదికను అందిస్తుందని అన్నారు. పిల్లలు మరియు యుక్తవయస్కులలో గణనీయమైన అనుచరులను కలిగి ఉన్న మాధ్యమం యువ ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనేలా చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు తోడ్పడుతుంది, చిన్న వయస్సు నుండే సమాచారం అందించడంతో పాటుగా బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందిస్తుంది.
కామిక్ ఎన్నికల ప్రక్రియను ఊహించుకోవడానికి పిల్లలకు సహాయం చేస్తుంది, యు పాత తరం వారి పూర్వపు రోజులను పునరుద్ధరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. నైతిక ఎన్నికలు, భాగస్వామ్య ప్రజాస్వామ్యం, ఎన్నికలలో కండబలం మరియు ధనబలం ప్రభావం వంటి క్లిష్టమైన అంశాలను చాలా స్పష్టంగా మరియు పాఠకులకు స్నేహ పూర్వకంగా తెలియజేస్తూ పిల్లలకు, పెద్దలను ప్రభావితం చేయడానికి ఈ కామిక్ పుస్తకం ప్రయత్నిస్తుందని ఈసీ శ్రీ అనుప్ చంద్ర పాండే చెప్పారు. ఈసీ శ్రీ అరుణ్ గోయెల్ మాట్లాడుతూ కామిక్ పుస్తకంలో ఎన్నికల ప్రక్రియ గురించి హాస్యంతో పాటు సానుకూల, నిర్మాణాత్మక సందేశం ఉందని, ఇది ఎన్నికల ప్రక్రియలో మెరుగైన భాగస్వామ్యం కోసం యువత, యు భవిష్యత్తు ఓటర్లను పురికొల్పుతుందని అన్నారు. ఈ కామిక్ పుస్తకం బహుముఖ సాధనంగా పనిచేస్తుంది, ఓటరు అవగాహనకు సంబంధించిన వివిధ క్లిష్టమైన అంశాలను ప్రస్తావిస్తుంది. దీని ప్రాథమిక దృష్టి యువ, అర్హత కలిగిన ఓటర్లు తమను తాము నమోదు చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు రాబోయే ఎన్నికలలో వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారించేలా చేస్తుంది. ఈ కామిక్ సివిజిల్ (cVigil) మరియు కేవైసీ వంటి భారత ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన వివిధ యాప్‌లను కూడా పాఠకులకు పరిచయం చేస్తుంది. ఈ దిశగా పుస్తకంతో చాచా చౌదరి కీలక పాత్ర పోషిస్తారు, తద్వారా ఎన్నికల ప్రక్రియలో చురుకుగాను తగిన సమాచారంతోను పాల్గొనే అవకాశం కల్పించారు. కామిక్ పుస్తకం ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్య ప్రాముఖ్యతను గట్టిగా నొక్కి చెబుతుంది, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈసీఐ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ కామిక్ ప్రింట్ మరియు డిజిటల్ ఫార్మాట్‌లు రెండింటిలోనూ అందుబాటులో ఉంది, అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ప్రాప్యతను నిర్ధారిస్తుంది. అదనంగా, యువకులను ప్రేరేపించడానికి, కామిక్ పుస్తకం యొక్క ఉచిత కాపీలు పాఠశాలలకు పంపిణీ చేయబడతాయి, భవిష్యత్తు ఓటర్లకు ఎన్నికల గురించి అవగాహన కల్పిస్తాయి. కామిక్ డిజిటల్ కాపీని https://ecisveep.nic.in/files/file/2152-chacha-chaudhary-aur-chunavi-dangal/ ద్వార యాక్సెస్ చేసుకోవచ్చు. చాచా చౌదరి యొక్క ప్రజాదరణ పట్టణాలు నగరాలను మించిపోయి.. భారతదేశంలోని చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో కూడా ప్రతిధ్వనిస్తుంది. 1960లో కార్టూనిస్ట్ ప్రాణ్ కుమార్ శర్మ దీనిని పరిచయం చేసినప్పటి నుండి.. పాత్ర యొక్క శాశ్వతమైన అప్పీల్ కాల పరీక్షకు నిలిచి ఉంది మరియు ఈ ప్రత్యేకమైన చొరవ అది నోస్టాల్జియా ద్వారా ఏర్పడే భావోద్వేగ సంబంధాన్ని ఉపయోగించుకుంటుంది. ఓటరు అవగాహనకు సమగ్ర విధానాన్ని సృష్టిస్తుంది.
ప్రాణ్ కామిక్స్ డైరెక్టర్ పబ్లిషర్ శ్రీ నిఖిల్ ప్రాణ్ మరియు కమిషన్ సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1959247)
Visitor Counter : 170