కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

జూలైలో 18.75 లక్షల నికర సభ్యుల చేరికతో ఈపీఎఫ్ఓ వేదికపై అత్యధిక పేరోల్ జోడింపు నమోదు

Posted On: 20 SEP 2023 5:43PM by PIB Hyderabad

ఈపీఎఫ్ఓ ఈరోజు విడుదల చేసిన 2023 జూలై నెల తాత్కాలిక పేరోల్ డేటాలో తమ సంస్థ 18.75 లక్షల నికర సభ్యులను చేర్చుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్, 2018 నుండి సెప్టెంబరు, 2017 కాలానికి సంబంధించిన ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా ప్రచురించినప్పటి నుండి  నెలలో అత్యథిక చేరకలు నమోదయ్యాయి.  గత మూడు నెలల నుండి పెరుగుతున్న ట్రెండ్ కొనసాగుతోందిగత జూన్ 2023 కంటే దాదాపు 85,932 మంది నికర సభ్యుల పెరుగుదల జులై నెలలో నమోదు కావడం విశేషం. జూలై 2023లో దాదాపు 10.27 లక్షల మంది కొత్త సభ్యులు నమోదయినట్టుగా డేటా సూచిస్తోంది.  ఇది జూలై 2022 నుండి పరిశీలిస్తే అత్యధికంఈపీఎఫ్ఓలో చేరిన కొత్త సభ్యులలో ఎక్కువ మంది.. 18-25 సంవత్సరాల వయస్సు గలవారునెలలో మొత్తం చేరికలో దాదాపు ఈ వయస్సు వారే 58.45 శాతం ఉన్నారు.  దేశంలోని సంఘటిత రంగం మానవ శక్తిలోచేరిన మొదటి సారి ఉద్యోగార్ధులుగా ఉన్న యువత నమోదులో పెరుగుతున్న ధోరణిని ఇది అద్దం పడుతుంది. సుమారు 12.72 లక్షల మంది సభ్యులు చందా నుంచి నిష్క్రమించినా తిరిగి ఈపీఎఫ్ఓలో చేరినట్లు పేరోల్ డేటా నిరూపిస్తుంది. ఇది గత 12 నెలల్లో అత్యధికం. ఈ సభ్యులు తమ ఉద్యోగాలను మార్చుకొని.. ఆ తరువాత ఈపీఎఫ్ఓకింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరారు. వారి సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా వారి సంచితాలను బదిలీ చేయడానికి ఎంచుకున్నారులింగ వారీగా పేరోల్ డేటాను విశ్లేషిస్తే జూలై 2023లో దాదాపు 3.86 లక్షల మంది నికర మహిళా సభ్యులు పేరోల్లో చేర్చబడ్డారుదాదాపు 2.75 లక్షల మంది మహిళా సభ్యులు తొలిసారిగా సామాజిక భద్రత పరిధిలోకి వచ్చారురాష్ట్రాల వారీగా పేరోల్ డేటాను విశ్లేషిస్తే మహారాష్ట్రతమిళనాడుకర్ణాటకగుజరాత్, హర్యానా వంటి 5 రాష్ట్రాల్లో నికర సభ్యుల చేరిక అత్యధికంగా ఉన్నాయి.   రాష్ట్రాలు నికర సభ్యుల చేరికలో దాదాపు 58.78 శాతం ఉంది.  నెలలో ఆయా ప్రాంతాల నుంచి మొత్తం 11.02 లక్షల మంది సభ్యులు ఉన్నారుఅన్ని రాష్ట్రాల్లోకి పరిశీలన నెలలో 20.45% నికర సభ్యులను జోడించడం ద్వారా మహారాష్ట్ర ముందంజలో ఉందిపరిశ్రమ-వాణిజ్య సంస్థలుభవన నిర్మాణ పరిశ్రమఎలక్ట్రికల్మెకానికల్ మరియు జనరల్ ఇంజినీరింగ్ ఉత్పత్తులలో నిమగ్నమైన సంస్థల్లో పని చేసే సభ్యులలో పరిశ్రమల వారీగా డేటా యొక్క నెలవారీ పోలికలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. దీని తర్వాత జౌళి, ఆర్థిక రంగంలోని ఫైనాన్సింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్, దవాఖానాలు మొదలైనవి ఉన్నాయి. మొత్తం నికర సభ్యత్వంలో దాదాపు 38.40% అదనంగా నిపుణుల సేవల వారు (మానవ శక్తి సరఫరాదారులు, సాధారణ కాంట్రాక్టర్‌లు, భద్రతా సేవలు, ఇతర కార్యకలాపాలు మొదలైనవి) నుండి వచ్చారు. ఉద్యోగి రికార్డును అప్‌డేట్ చేయడం నిరంతర ప్రక్రియ, డేటా ఉత్పత్తి అనేది నిరంతర వ్యాయామం కాబట్టి పై పేరోల్ డేటా తాత్కాలికంగా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి మునుపటి డేటా ప్రతి నెలా నవీకరించబడుతుంది. ఏప్రిల్-2018 నెల నుండి ఈపీఎఫ్ఓ సెప్టెంబర్, 2017 నుండి కాలానికి సంబంధించిన పేరోల్ డేటాను విడుదల చేస్తోంది. నెలవారీ పేరోల్ డేటాలో ఆధార్ చెల్లుబాటు చేయబడిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యు.ఎ.ఎన్) ద్వారా మొదటిసారి ఈపీఎఫ్ఓలో చేరిన సభ్యుల సంఖ్య, ఈపీఎఫ్ఓ కవరేజీ నుండి నిష్క్రమించిన ప్రస్తుత సభ్యులు మరియు నిష్క్రమించి తిరిగి సభ్యులుగా చేరిన వారి సంఖ్య నికర నెలవారీగా చేరడాన్ని పరిగణనలోకి తీసుకోబడుతుంది.

****(Release ID: 1959245) Visitor Counter : 60


Read this release in: Urdu , Tamil , English , Hindi