పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
తేజు విమానాశ్రయంలో కొత్తగా కల్పించిన మౌలిక సదుపాయాలను 2023 సెప్టెంబర్ 24 న ప్రారంభించనున్న శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా
* కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలలో రన్‌వే పొడిగింపు, కొత్త ఆప్రాన్ నిర్మాణం, కొత్త టెర్మినల్ భవనం, అగ్నిమాపక కేంద్రం, ఏటిసి టవర్
* మౌలిక సదుపాయాల అభివృద్ధికి 170 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
Posted On:
20 SEP 2023 12:40PM by PIB Hyderabad
తేజు విమానాశ్రయంలో కొత్తగా కల్పించిన మౌలిక సదుపాయాలను 2023 సెప్టెంబర్ 24 న కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూతో కలిసి ప్రారంభిస్తారు.
తేజు పట్టణంలో ఉన్న తేజు విమానాశ్రయం దేశీయ విమానాశ్రయంగా పనిచేస్తోంది.తేజు విమానాశ్రయంలో ఒకే రన్‌వే ఉంది. 212 ఎకరాల భూమిలో తేజు విమానాశ్రయం నిర్మాణం జరిగింది.ఏటిఆర్ 72 తరహా విమానాల కోసం కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది. తేజు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన అభ్యర్థన మేరకు ఏఏఐ అభివృద్ధి, అప్‌గ్రేడేషన్ పనులు చేపట్టి పూర్తి చేసింది. 170 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. దీనిలో భాగంగా రన్‌వే (1500మీ x 30మీ) పొడిగింపు, .ఏటిఆర్ 72 తరహా విమానాల కోసం రెండు ఆప్రాన్ నిర్మాణం,, కొత్త టెర్మినల్ భవనం, అగ్నిమాపక కేంద్రం, ఏటిసి టవర్ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఆర్ సి ఎస్ ఉడాన్ పథకం కింద తేజు విమానాశ్రయం 2018 లో పని చేయడం ప్రారంభించింది. . ఈ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం దిబ్రుఘర్, ఇంఫాల్, గౌహతిలకు అలయన్స్ ఎయిర్ , ఫ్లైబిగ్ ఎయిర్‌లైన్ సంస్థలు ప్రతిరోజూ విమాన సర్వీసులు నిర్వహిస్తున్నాయి.
టెర్మినల్ భవన్ ముఖ్య లక్షణాలు:
* టెర్మినల్ ప్రాంతం: 4000 చ.మీ.
* రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో 300 మంది ప్రయాణికులకు సౌకర్యాలు
* చెక్-ఇన్ కౌంటర్: 05 + (03 భవిష్యత్తులో)
* రాకపోకలు సాగించే కేంద్రాలు 02
* విమానాలు నిలిపే సౌకర్యం : 02 - ఏటిఆర్ 72 తరహా విమానాల కోసం
భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు:
* డబుల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్.
* ఇంధన పొదుపు కోసం హెచ్విఏసి, వెలుతురు సౌకర్యం
* వేడి తగ్గించడానికి గెయిన్ గ్లేజింగ్.
* ఈసీబీసీ ప్రమాణాల మేరకు పరికరాలు.
* ఘన వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థ
* శుద్ధి చేసిన నీటిని మరుగుదొడ్లు, మొక్కల పెంపకానికి ఉపయోగించడం కోసం సౌకర్యాలు
* వర్షం నీరు ఒడిసి పట్టడానికి చర్యలు
* నాణ్యమైన నీటి పరికరాల వినియోగం
ప్రాజెక్టు ప్రయోజనాలు
* మరింత ఎక్కువ ట్రాఫిక్‌ను నిర్వహించడానికి విమానాశ్రయ సామర్థ్యాన్ని విస్తరించడం.
*దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్యప్రాంతానికి రవాణా సౌకర్యం కలుగుతుంది.
* పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి
* ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం
లోహిత్ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం తేజు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లా ప్రధాన కార్యాలయంగా తేజు ఉంది. చుట్టూ పచ్చటి అడవులు, కొండలతో ఉన్న ఈ పట్టణం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది.
***
(Release ID: 1959232)
Visitor Counter : 152