మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య & అక్షరాస్యత విభాగంలో 'పంచ్ ప్రాణ్', 'స్వచ్ఛత' ప్రతిజ్ఞలు నిర్వహణ
Posted On:
18 SEP 2023 7:42PM by PIB Hyderabad
కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య & అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే విభాగాధిపతులు, స్వయంప్రతిపత్త సంస్థల అధిపతులు, సీనియర్ అధికారులతో 'పంచ్ ప్రాణ్', 'స్వచ్ఛత' ప్రతిజ్ఞలు చేయించారు.
సమష్టి ప్రయత్నాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలన్న ప్రధానమంత్రి కలను నిజం చేసేందుకు, పంచప్రాణ్ ప్రతిజ్ఞ చేసేలా విద్యార్థులను ప్రేరేపించాల్సిన ప్రాముఖ్యతను శ్రీ కుమార్ స్పష్టం చేశారు.
స్వచ్ఛత అభియాన్ 3.0 ప్రాముఖ్యత గురించి కూడా శ్రీ కుమార్ వివరించారు. స్వచ్ఛత అభియాన్ 3.0 ప్రాధాన్యతపై ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలని అధికారులకు సూచించారు.
***
(Release ID: 1958707)
Visitor Counter : 134