ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023-24 మదింపు సంవత్సరానికి ఫారం 10బి/10బిబి, ఐటీఆర్‌-7 సమర్పించే గడువు తేదీని పొడిగించిన సీబీడీటీ

Posted On: 18 SEP 2023 8:19PM by PIB Hyderabad

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఫారం 10బి/ఫారం 10బిబి మదింపు నివేదికలు సమర్పించడానికి గడువు తేదీని 30.09.2023. ఈ తేదీని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) 31.10.2023 వరకు పొడిగించింది.


2023-24 మదింపు సంవత్సరానికి ఐటీఆర్‌-7 ద్వారా ఆదాయాన్ని ప్రకటించే గడువు తేదీని కూడా 31.10.2023 నుంచి 30.11.2023 వరకు పొడిగించింది.

తేదీల పొడిగింపుపై సమాచారమిస్తూ, 18.09.2023న సర్క్యులర్ నం. 16/2023ను సీబీడీటీ జారీ చేసింది. ఈ సర్క్యులర్‌ను www.incometaxindia.gov.inలో చూడవచ్చు.

****


(Release ID: 1958694) Visitor Counter : 187