గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయితీ రాజ్ మంత్రి నాయకత్వంలో, త్వరలో ప్రారంభం కాబోయే స్వచ్ఛత ప్రచారం 3.0లో పాల్గొంటున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి విభాగం
ప్రత్యేక ప్రచారం 3.0ను అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు అమలు చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేసిన పరిపాలన సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల విభాగం
Posted On:
18 SEP 2023 3:42PM by PIB Hyderabad
కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ నాయకత్వంలో, రాబోయే స్వచ్ఛత ప్రచారం 3.0లో పాల్గొనడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి విభాగం సిద్ధంగా ఉంది. విభాగంలో, తన అనుబంధ స్వయంప్రతిపత్త కార్యాలయాల్లో పరిశుభ్రతను సంస్థాగతీకరించడానికి, పెండింగ్‌లో ఉన్న పనులను తగ్గించడానికి సిద్ధమవుతోంది. స్వచ్ఛతను సంస్థాగతీకరించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల పెండింగ్‌ను తగ్గించడం వంటి లక్ష్యాలు సాధించడానికి ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచార 3.0ను అమలు చేయడానికి కేంద్ర పరిపాలన సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల విభాగం మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణాభివృద్ధి విభాగం, ప్రత్యేక ప్రచారం 3.0లో భాగంగా ఈ నెల 15న ప్రారంభమైన సన్నాహక దశలో పాల్గొంటోంది.
గ్రామీణాభివృద్ధి విభాగం, తన సచివాలయంతో పాటు తన అనుబంధ స్వయంప్రతిపత్తి కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న సూచనలను పరిష్కరించడం,స్వచ్ఛతను పాటించడం కోసం గత ఏడాది అక్టోబర్ 2 నుంచి 31 వరకు జరిగే ప్రత్యేక ప్రచారం 2.0లో కూడా పాల్గొంది. ఈ కార్యక్రమంలో భాగంగా, వీఐపీ సూచనలు, అంతర్-మంత్రిత్వ సంప్రదింపుల (ఐఎంసీ) సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, పీఎంవో సూచనలు, ప్రజా ఫిర్యాదులు సహా వివిధ పెండింగ్ పనులను సమర్ధవంతంగా పరిష్కరించింది. గుర్తించిన దస్త్రాలను సమీక్షించింది. ఈ ప్రచారంలో సాధించిన విజయాలు డీఏఆర్‌పీజీ పోర్టల్‌లోని ప్రత్యేక ప్రచారం 2.0లో కూడా అప్‌లోడ్ చేసింది. ప్రత్యేక ప్రచారం కింద చేసిన ప్రయత్నాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది, ఇది ప్రచారాన్ని మరింత విస్తృతం చేసింది.
ప్రత్యేక ప్రచారం 2.0 కింద చేపట్టిన ప్రయత్నాలు 2022 డిసెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు కొనసాగాయి. ఈ కాలంలో పరిష్కరించిన అంశాలకు సంబంధించిన ముఖ్యాంశాలు ఇవి:
- ఎంపీ సూచనలు - 155
- ప్రజా ఫిర్యాదులు - 13,313
- ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లు - 3,112
- ఉపయోగంలోకి వచ్చిన స్థలం - 2,242 చ.అ.
- ఆదాయం - రూ.17,04,828
***
(Release ID: 1958680)
Visitor Counter : 119