సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వికలాంగుల సాధికారత శాఖ కార్యదర్శి చేతుల మీదుగా పాద రక్షల యూనిట్‌ను ప్రారంభించారు

Posted On: 18 SEP 2023 12:16PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ప్రోస్తేటిక్స్ మరియు ఆర్థోటిక్స్ విభాగం, పీ డి యూ ఎన్ ఐ  పి పి డి, న్యూఢిల్లీ  ఫుట్ కేర్ యూనిట్‌ని ప్రభుత్వ కార్యదర్శి,  డి ఈ పీ డబ్ల్యూ డి, ఎం ఎస్ జే  ఈ  భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ, డి ఈ పీ డబ్ల్యూ డి ఎస్. రాజీవ్ శర్మ ఆగస్టులో ప్రారంభించారు. డా. జితేందర్ శర్మ, పీ డి యూ ఎన్ ఐ  పి పి డి  డైరెక్టర్, డా. లలిత్ నారాయణ్, డి. డైరెక్టర్, ప్రొస్టెటిక్స్ మరియు ఆర్థోటిక్స్ విభాగాధిపతి శ్రీ జీ. పాండియన్ మరియు పీ & ఒ విభాగం బృందం ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

భారత ప్రభుత్వ కార్యదర్శి, డి ఈ పీ డబ్ల్యూ డి, భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ, డి ఈ పీ డబ్ల్యూ డి మరియు ఇతర ప్రముఖులకు ఫుట్ కేర్ యూనిట్, రోగనిర్ధారణ, తయారీ ప్రక్రియ మరియు వివిధ పాదాల వైకల్యాల చికిత్సతో సహా పరికరాలు మరియు మెటీరియల్స్ మరియు అనుకూలీకరించిన ఇన్సోల్స్‌తో నిర్వహణ గురించి సమాచారాన్ని దశలవారీ విపులంగా వివరించడం జరిగింది.

 

ప్రోస్తేటిక్స్ మరియు ఆర్థోటిక్స్ పీ డి యూ ఎన్ ఐ  పి పి డి విభాగం, భారత ప్రభుత్వ కార్యదర్శి సమక్షంలో ఒక జత కస్టమైజ్డ్ ఇన్సోల్‌లను రూపొందించింది, అదే సమయంలో ఫాబ్రికేషన్ ప్రక్రియ సమాచారాన్ని దశలవారీ విపులంగావివరించడం జరిగింది .

 

అత్యంత అధునాతన ఫుట్ కేర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ముఖ్యంగా డయాబెటిక్ ఫుట్ మేనేజ్‌మెంట్ కోసం భారతదేశంలో అల్ట్రా మోడెమ్ ఫుట్ కేర్ యూనిట్‌ను కలిగిన ఏకైక జాతీయ సంస్థ ఇదేనని పీ డి యూ ఎన్ ఐ  పి పి డి గర్వంగా తెలియజేస్తోంది.

 

***



(Release ID: 1958539) Visitor Counter : 98