కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నోట్ల రద్దు సమయంలో జరిగిన వ్యవహారాలతో సంబంధం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్‌ను అరెస్టు చేసిన ఎస్‌ఎఫ్‌ఐవో
प्रविष्टि तिथि:
18 SEP 2023 11:30AM by PIB Hyderabad
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే 'సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్' (ఎస్‌ఎఫ్‌ఐవో) అధికారులు, ముంబై పోలీసు కమిషనర్ సహకారంతో, చార్టర్డ్ అకౌంటెంట్ అయిన నళిన్ ప్రభాత్ పంచల్‌ను 13.9.2023న అరెస్టు చేశారు. నిత్యాంక్ ఇన్‌ఫ్రాపవర్ & మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసుకు సంబంధించి జారీ చేసిన సమన్లను నిర్లక్ష్యం చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు.
నోట్ల రద్దు కాలంలో నిత్యాంక్ ఇన్‌ఫ్రాపవర్ & మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన వ్యవహారాలపై ఎస్‌ఎఫ్‌ఐవో అధికారులు దర్యాప్తు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఎఫ్‌ఐవో ప్రత్యేక కోర్టు VIII అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎదుట ఆ కంపెనీపై, కొందరు వ్యక్తులపై దావా దాఖలు చేశారు. సమన్లు జారీ చేసినప్పటికీ, హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టుకు పంచల్ హాజరుకాలేదు. ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ప్రకారం అధికారులు అతన్ని అరెస్టు చేశారు. ప్రత్యేక కోర్టులో పంచల్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
****
(रिलीज़ आईडी: 1958478)
आगंतुक पटल : 228