వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దేశంలో సరసమైన ధరలకు తగినంత చక్కెర లభ్యత: ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ
ప్రపంచంలోనే అత్యంత చౌక భారతీయ చక్కెర
ప్రస్తుత సీజన్‌లో 94% చెరకు బకాయిలను రైతులకు ఇప్పటికే చెల్లించడం జరిగింది
Posted On:
14 SEP 2023 5:09PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం తీసుకున్న సమయోచితమైన చర్యలు ఏడాది పొడవునా తగినంత చక్కెర సరసమైన ధరలకు లభ్యతను నిర్ధారించాయి. గత సంవత్సరం అక్టోబర్ లో ప్రారంభమైన ప్రస్తుత చక్కర సీజన్ 30 సెప్టెంబరు 2023తో ముగుస్తున్నది. ఇథనాల్ ఉత్పత్తి కోసం దాదాపు 43 LMT మళ్లింపు మినహా భారత్ ఇప్పటికే 330 LMT చక్కెర ఉత్పత్తిని దాటింది. ఈ విధంగా, దేశంలో మొత్తం సుక్రోజ్ ఉత్పత్తి సుమారు 373 LMT ఉంటుంది. గత ఐదు చక్కర సీజన్లతో పోల్చి చూసినప్పుడు ఇది రెండవ అత్యధికం.
దేశ పౌరుల అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రైతుల చెరకు బకాయిలను చెల్లించడం కోసం భారత్ ఎగుమతుల కోటాను దాదాపు 61 LMTకి మాత్రమే పరిమితం చేసింది. ఈ చర్యల ఫలితంగా దేశంలో ఆగస్టు 2023 చివరి నాటికి సుమారుగా 83 LMT చక్కెర నిల్వ ఉంది. ఈ స్టాక్ సుమారు మూడున్నర నెలల వాడకానికి సరిపోతుంది. అంటే ప్రస్తుత 2022-23 చక్కెర సీజన్ ముగిసే నాటికి దేశంలో అందుబాటులో ఉండే వాంఛనీయ / గరిష్ఠ స్టాక్ అది. ఈ యథార్థము దేశీయ వినియోగదారులకు భవిష్యత్తులో కూడా చక్కెర సరసమైన ధరకు అందుబాటులో ఉండగలదనే నమ్మకాన్ని కలుగజేస్తుంది.
భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లుగా, ఇప్పటి వరకు రుతుపవనాలు సెప్టెంబర్ 2023లో సాధారణంగానే ఉన్నాయి మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలలో చెరకు పండించే ప్రాంతాలు కూడా మంచి పంట దిగుబడికి అవకాశాలను మెరుగుపరిచాయి. మరియు చక్కర సీజన్ 2023-24లో మరింత ఎక్కువ దిగుబడి పొందే అవకాశాలు ఏర్పడ్డాయి. చక్కెర ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలలో అధినేతలుగా ఉన్న రాష్ట్ర కేన్ కమిషనర్లు పంటల స్థితిగతులపై నిఘా వేసి ఉంచాలని, చెరకు విస్తీర్ణం, దిగుబడి మరియు ఆశిస్తున్నా చక్కెర ఉత్పత్తిపై వారి సమాచారాన్ని తాజాపరచి సవరించాలని అభ్యర్థించారు. దీని ఆధారంగా వచ్చే సీజన్‌లో చక్కెర ఎగుమతి విధానానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశీయ వినియోగం కోసం చక్కెర లభ్యత, ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లింపు మరియు సీజన్ ముగింపులో తగినంత సరకు నిల్వ ఉండటానికి ప్రాధాన్యతనిస్తుంది. అందుబాటులో ఉంటే మిగులు చక్కెర మాత్రమే ఎగుమతికి అనుమతిస్తారు. ఈ విధానం దేశీయ మార్కెట్‌లో ధరల స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. చక్కెర కర్మాగారాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ పొందకుండానే భారతీయ వినియోగదారులు ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు చక్కెరను పొందడం ఈ విధానం పర్యవసానం ఫలితం.
దానికి తోడుగా భారత ప్రభుత్వం ఈ చురుకైన చర్యద్వారా వివిధ చక్కెర మిల్లుల నుండి వ్యాపారులకు సంబంధించిన సమాచారాన్ని కోరింది, తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలో చక్కెర నిల్వలను నిశితంగా పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవచ్చు. పరిశ్రమ సంఘాలు కూడా దీనిపై ప్రతిస్పందిస్తూ తగినంత స్టాక్ ఉన్నట్లు ధృవీకరించాయి మరియు సీజన్ చివరలో వాంఛనీయ / గరిష్ఠ స్థాయిలో చక్కెర నిల్వ సాధించడం వలన మిల్లుల ఆర్థిక స్థితి మెరుగుపడిందని మెచ్చుకున్నాయి. ప్రభుత్వం మరియు పరిశ్రమల సమష్టిప్రయత్నాల ఫలితంగా రూ. 1.07 కోట్లకు పైగా (ప్రస్తుత సీజన్‌లో చెరకు బకాయిల్లో 94%) బకాయిలను మిల్లులు ఇప్పటికే చెల్లించడం వల్ల చక్కెర రంగం పట్ల రైతుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
***
(Release ID: 1957779)
Visitor Counter : 87