వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

2030 నాటికి ఇంజినీరింగ్ సేవలు, డిజైన్, నిర్మాణం మరియు ఆర్ & డీ లో $100 బిలియన్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని ఇంజనీరింగ్ రంగాన్ని శ్రీ పీయూష్ గోయల్ ప్రోత్సహిస్తున్నారు


జీ 20 నాయకులు న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడం కీలకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయాల వల్ల భారతదేశ సామర్థ్యాలు మరియు నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించింది: శ్రీ గోయల్

ఎస్ టీ ఈ ఎం గ్రాడ్యుయేట్ల సమృద్ధిగా ఉన్న భారతదేశంలోని ప్రతిభను సద్వినియోగం చేసుకుంటూ కొత్త మార్కెట్లను స్వాధీనం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని గోయల్ భారతీయ కంపెనీలను కోరారు.

భారతదేశ అభివృద్ధి మరియు ఆవిష్కరణలకోసం జర్మన్ తరహా స్పెషలైజేషన్ మరియు సర్టిఫికేషన్‌ నమూనాను శ్రీ గోయల్ సూచించారు. జాతీయ నూతన విద్యా విధానం 2020 దీనికి వశ్యతను అందిస్తుంది.

Posted On: 15 SEP 2023 2:16PM by PIB Hyderabad

2030 నాటికి ఇంజినీరింగ్ సేవలు, డిజైన్, నిర్మాణం మరియు పరిశోధన మరియు అభివృద్ధి లో  $100 బిలియన్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని ఇంజినీరింగ్ రంగాన్ని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రోత్సహించారు.  ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన 'డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం, ఆర్&డి మరియు పర్యావరణ సేవలు: సుస్థిర హరిత విద్యుత్ , రవాణా మరియు మౌలిక సదుపాయాలు పై ప్రపంచ సేవల ఎగుమతుల సదస్సు'లో మంత్రి ప్రసంగిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లకు ఇంజనీర్స్ దినోత్సవ సందర్భంగా తన హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.

 

భారత అధ్యక్షతన జీ 20 శిఖరాగ్ర సదస్సు 2023ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా  ప్రపంచ దృష్టిలో పెరుగుతున్న భారతదేశ స్థాయిని శ్రీ గోయల్ హైలైట్ చేశారు. జీ 20 సమ్మిట్ 2023 మొదటి రోజున జీ 20 నాయకులు న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడం, కీలకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయాలతో భారతదేశం యొక్క సామర్థ్యాలు మరియు నాయకత్వానికి ప్రపంచ గుర్తింపు స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశవాణి ఇప్పుడు దక్షిణాది ప్రపంచానికే  కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా వాణిగా  ఎదుగుతోందని ఆయన అన్నారు.

 

దీన్ని 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి విజయంగా జరుపుకోవాలని భారతీయులందరికీ మంత్రి పిలుపునిచ్చారు.  ఎస్ టీ ఈ ఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ లేదా మ్యాథమెటిక్స్) గ్రాడ్యుయేట్ల భారతదేశం యొక్క సమృద్ధిగా ఉన్న టాలెంట్ పూల్‌ను ఉపయోగించుకుని భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని కొత్త మార్కెట్లను స్వాధీనం చేసుకోవాలని తమ రంగాలలో అగ్రగామి ప్రపంచ కంపెనీలుగా అవతరించాలని ఆయన కోరారు.

 

నిర్దిష్ట రంగాలలో స్పెషలైజేషన్ మరియు సర్టిఫికేషన్ యొక్క జర్మన్ మోడల్‌ను పరిగణించమని ఇంజినీరింగ్ నాయకులను శ్రీ గోయల్ ప్రోత్సహించారు. ఇంజినీరింగ్ రంగంలో నిపుణులు మరియు మేధావులు ఉండటం భారతదేశ వృద్ధికి మరియు ఆవిష్కరణకు దోహదపడుతుందని సూచించారు. 2020లో ప్రవేశపెట్టబడిన భారతదేశ జాతీయ విద్యా విధానం, విద్యలో పార్శ్వ మార్పులకు తలుపులు తెరిచిందని, విద్యార్థులు విభిన్న రంగాలను మధ్యంతరం లో అన్వేషించడానికి వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వెసులుబాటు, మరింత నైపుణ్యం కలిగిన మరియు వైవిధ్యమైన శ్రామికశక్తికి దారి తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని పాత విద్యావిధానాలు విద్యార్థుల ఎంపికలను ఎలా నిర్బంధించాయో ఆయన వివరించారు.

 

ప్రపంచ ప్రాజెక్ట్‌లలో భారతీయ ఇంజినీరింగ్ సంస్థల భాగస్వామ్యాన్ని నిరోధించే అంతర్జాతీయ పద్ధతులపై అధ్యయనం చేయాలని శ్రీ గోయల్ సేవల ఎగుమతి ప్రోత్సాహక మండలి  మరియు ఇంజినీర్స్ (ఇండియా) లకు పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పరిశోధన అధ్యయనం ఆధారంగా భారతీయ ఇంజనీర్లు మరియు వ్యాపారాల కోసం సమస్థాయి వ్యాపార ఆవరణాన్ని నిర్ధారించడానికి  పరస్పర చర్యలను అన్వేషిస్తుందని మంత్రి ఉద్ఘాటించారు.

 

ప్రపంచ వాణిజ్యంపై భారతదేశ వైఖరి గురించి మాట్లాడుతూ  శ్రీ గోయల్ న్యాయమైన మరియు సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య  ఒప్పందం చర్చలకు దేశ నిబద్ధత గురించి  నొక్కి చెప్పారు.వ్యాపారాలు, నిపుణులు మరియు ఎం ఎస్ ఎం ఈ వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపుల ద్వారా  వాటాదారులందరికీ ప్రయోజనం చేకూర్చే సమానమైన ఒప్పందాలు భారతదేశం యొక్క విధానం అని ఆయన నొక్కి చెప్పారు. ఇరు దేశాలకు విజయం చేకూర్చే ఎఫ్‌టిఎలోకి ప్రవేశించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

 

ఇతర దేశాలు చేయగలిగినంతగా మనం ఎఫ్‌టిఎను ఉపయోగించుకోలేకపోతున్నామని శ్రీ గోయల్ అన్నారు. ప్రధాన మంత్రిని ఉటంకిస్తూ, “ప్రతి దేశం యొక్క అభివృద్ధి ప్రయాణంలో దేశం తనను తాను కొత్తగా పునర్నిర్వచించుకునే సమయం వస్తుంది మరియు కొత్త తీర్మానాలతో ముందుకు సాగుతుంది. నేడు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఆ శుభసమయం వచ్చింది.

 

ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం లోని ప్రాముఖ్యతను మంత్రి నొక్కిచెప్పారు, ఇది వ్యక్తులు సంస్థలు దేశాన్ని మరింత ఎత్తుకు చేరుకోవడానికి స్ఫూర్తినిస్తుందని నొక్కి చెప్పారు. ఈ సందర్భం గత విజయాలను ప్రతిబింబించే క్షణం అలాగే ఆవిష్కరణ మరియు ప్రపంచ నాయకత్వం కోసం పిలుపునిచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యొక్క దార్శనికత స్ఫూర్తితో స్వావలంబన మరియు ప్రపంచవ్యాప్త ప్రభావశీల భారతదేశం కోసం భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ నాయకత్వం దిశ గా సాగే ప్రస్థానం లో సహకారం, ఆవిష్కరణ మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను శ్రీ గోయల్ నొక్కి చెప్పారు.

 

***(Release ID: 1957770) Visitor Counter : 95