వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమలుపై ఉత్తర ప్రాంత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్ష సమావేశం నిర్వహించిన డీపీఐఐటీ
Posted On:
15 SEP 2023 2:38PM by PIB Hyderabad
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) ను ఎక్కువగా వినియోగించేలా చూసేందుకు కేంద్ర వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం ( డీపీఐఐటీ) లాజిస్టిక్స్ విభాగం, వారానికోసారి సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశాలలో జాతీయ మాస్టర్ ప్లాన్ ని ఉపయోగించి ఆస్తుల మ్యాపింగ్ , ప్రాజెక్ట్ అమలులో సాధించిన పురోగతి అంచనా వేయడానికి వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ( నోడల్ అధికారులు/ప్రతినిధులతో డీపీఐఐటీ చర్చలు జరుపుతోంది.
వర్చువల్ మోడ్‌లో నిన్న డిపిఐఐటి ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షతన ఉత్తర ప్రాంత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సమీక్ష సమావేశంజరిగింది. ఈ సమావేశంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ, కాశ్మీర్, లడఖ్, హర్యానా, ఢిల్లీ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి.ప్రణాళిక అమలులో సాధించిన ప్రగతి పట్ల శ్రీమతి సుమితా దావ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. సాధించిన ప్రగతి పట్ల రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలను శ్రీమతి సుమితా దావ్రా తెలుసుకున్నారు.
ప్రాంత అభివృద్ధి కోసం PM గతిశక్తి ఎస్ఎంపి (స్టేట్ మాస్టర్ ప్లాన్)ని ఉపయోగించుకోవాలని ఉత్తర ప్రాంత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీమతి సుమితా దావ్రా సూచించారు. దీనికోసం SWOT (బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లు) విశ్లేషణ నిర్వహించాలని అన్నారు. విశ్లేషణ ద్వారా సామాజిక, మౌలిక సదుపాయాలు, రవాణా సమస్యలను గుర్తించి ప్రాంత అభివృద్ధి ప్రణాళికరూపొందించాలని శ్రీమతి సుమితా దావ్రా సూచించారు. కొండ ప్రాంతాల కారణంగా అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించే అంశంలో ఎదుర్కొంటున్న సమస్యలను పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద మౌలిక సదుపాయాలు, సామాజిక రంగ ప్రాజెక్టులను సిద్ధం చేయాలని అన్నారు. దీనివల్ల సులభతర వ్యాపార సౌలభ్యం, జీవన సౌలభ్యం, సేవలు అందించడం ద్వారా వ్యాపార పెట్టుబడులు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీలవుతుంది అని శ్రీమతి సుమితా దావ్రా వివరించారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడక్ కేంద్రపాలిత ప్రాంతం వంటి ఉత్తరాది రాష్ట్రాలలో ఆకాంక్షిత గ్రామాల అభివృద్ధిలో శాఖల పరంగా ఎదురవుతున్న సమస్యలను 'హోల్ ఆఫ్ గవర్నమెంట్' విధానం ద్వారా పరిష్కారం అవుతాయని శ్రీమతి సుమితా దావ్రా అన్నారు.
సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే బహుళ రవాణా సౌకర్యాన్ని పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అందిస్తుంది, ప్రాంత అభివృద్ధిని సులభతరం చేస్తుంది. అట్టడుగు స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు, కార్యక్రమాలు, సేవలు విస్తరించడానికి మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడం లక్ష్యంగా పీఎం గతిశక్తి అమలు జరుగుతుందన్నారు.
రాష్ట్ర స్థాయి మాస్టర్ ప్లాన్ అమలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత అవగాహన పొందడం కోసం పీఎం గతిశక్తి సహకారంతో రాష్ట్ర పరిపాలనా శిక్షణా సంస్థలు విస్తృత చర్చలు జరపాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీమతి సుమితా దావ్రా సూచించారు.
***
(Release ID: 1957768)
Visitor Counter : 129