ప్రధాన మంత్రి కార్యాలయం

విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు సాంప్రదాయక చేతివృత్తుల వారు మరియుశిల్పకారుల కోసం ‘పిఎమ్ విశ్వకర్మ’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ఈ పథకం సాంప్రదాయక చేతివృత్తుల లో నిమగ్నమైన వారికిసమర్థన ను మరియు నైపుణ్యాల ను అందించాలన్న ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణం నుండిప్రేరణ ను పొందింది

‘పిఎమ్  విశ్వకర్మ’ కు కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయల నిధులను తానే సమకూర్చనుంది

‘పిఎమ్ విశ్వకర్మ’ పరిధి విశాలమైంది గా ఉంటుంది – దీనిలో పద్దెనిమిదివిధాల చేతివృత్తుల ను చేర్చడం జరుగుతుంది

పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు ఐడి కార్డు లతో విశ్వకర్మ లకు గుర్తింపు ను ఇవ్వడం జరుగుతుంది

విశ్వకర్మల కు నైపుణ్యాల ను పెంపొందింప చేసుకోవడం కోసం రుణ సహాయం తో పాటు మరియు శిక్షణ ను కూడా ఇవ్వడం జరుగుతుంది

Posted On: 15 SEP 2023 12:36PM by PIB Hyderabad

విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు ఉదయం సుమారు 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిఎమ్ విశ్వకర్మ అనే పేరు తో ఒక క్రొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు.

 

సాంప్రదాయక చేతివృత్తుల లో నిమగ్నం అయిన వారి కి సాయాన్ని అందించాలన్నది ప్రధాన మంత్రి యొక్క నిరంతర ప్రయాస గా ఉంది. ఈ శ్రద్ధ లో చేతివృత్తిదారుల కు మరియు శిల్పకారుల కు ఆర్థిక పరం గా సహాయాన్ని అందించడం ఒక్కటే కాకుండా స్థానిక ఉత్పాదనలు, కళ లు, మరియు చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల మాధ్యం ద్వారా శతాబ్దాల నాటి ప్రాచీన సంప్రదాయాన్ని, సంస్కృతి ని మరియు వివిధ వారసత్వాలను బ్రతికించుకోవడం తో పాటు సమృద్ధం చేసుకోవాలన్న అభిలాష కూడా ఇమిడిపోయి ఉంది.

 

పిఎమ్ విశ్వకర్మ కు 13,000 కోట్ల రూపాయల తో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లో నిధుల ను అందించడం జరుగుతుంది. ఈ పథకం లో భాగం గా, పిఎమ్ విశ్వకర్మ పోర్టల్ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించి కామన్ సర్వీసెస్ సెంటర్స్ మాధ్యం లో విశ్వకర్మల పేరుల ను ఉచితం గా నమోదు చేయనున్నారు. వారి కి పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెట్ ను మరియు ఐడి కార్డు ను అందించడం, ప్రాథమిక శిక్షణ తోను, ఉన్నత శిక్షణ తోను నైపుణ్యాల కు మెరుగుల ను దిద్దడం, 15,000 రూపాయల టూల్ కిట్ సంబంధి ప్రోత్సాహకాన్ని ఇవ్వడం, 5 శాతం గా ఉండే తగ్గింపు వడ్డీ రేటు కు ఒకటో విడత లో ఒక లక్ష రూపాయల వరకు మరియు రెండో విడత లో రెండు లక్షల రూపాయల వరకు పూచికత్తు లేకుండానే రుణం రూపం లో సహాయాన్ని అందించడం, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ కై ప్రోత్సాహం తో పాటు మార్కెటింగ్ పరమైన సమర్థన మాధ్యం ద్వారా గుర్తింపు ను ఇవ్వడం జరుగుతుంది.

 

గురు-శిష్య సంప్రదాయం, లేదా సాంప్రదాయక నైపుణ్యాలు కలిగిన కుటుంబం ద్వారా ఆయా కార్యాల ను పూర్తి చేయడం లో నేర్పు ను అలవరచుకొనేటట్టు చూస్తూ, ఈ విధం గా వారి లోని కళ ను పెంచి పోషించాలనేదే ఈ పథకం యొక్క లక్ష్యం గా ఉంది. పిఎమ్ విశ్వకర్మ యొక్క ముఖ్య ధ్యేయం చేతివృత్తి కళాకారుల, శిల్పకారుల ఉత్పాదనల ను మరియు సేవల ను విస్తృత పరచడమూ, వాటి నాణ్యత ను మెరుగు పరచడమూ, ఆయా ఉత్పాదనల మరియు సేవల ను దేశీయ మరియు ప్రపంచ వేల్యూ చైన్ లతో ఏకీకృతం చేయడమూ ను.

 

ఈ పథకం భారతదేశం లో గ్రామీణ ప్రాంతాలు మరియు మరియు పట్టణ ప్రాంతాల లో చేతివృత్తిదారుల కు, శిల్పకారుల కు అండదండల ను ఇస్తుంది. పిఎమ్ విశ్వకర్మ పథకం పరిధి లోకి పద్దెనిమిది సాంప్రదాయక హస్తకళల ను చేర్చడం జరుగుతుంది. వీటిలో (i) వడ్రంగి పనివారు; (ii) పడవ ల తయారీదారులు; (iii) ఆయుధాల ను రూపొందించే వారు; (iv) కమ్మరులు; (v) సుతారి పని మరియు టూల్ కిట్ తయారీదారులు; (vi) తాళాల తయారీదారులు; (vii) స్వర్ణకార వృత్తి పని వారు; (viii) కుమ్మరి వృత్తిదారులు; (ix) శిల్పకారులు, రాళ్ళ ను కొట్టే పని లో నిమగ్నం అయ్యే వారు ; (x) పాదరక్ష ల తయారీదారులు (బూట్ల ను తయారు చేసే వారు); (xi) తాపీమేస్త్రీ లు; (xii) బుట్ట లు/చాప లు/చీపురుల ను తయారు చేసే వారు; (xiii) కొబ్బరి నార / కొబ్బరి పీచు అల్లిక తో వస్తువుల ను తయారు చేసే వారు & సాంప్రదాయక ఆటబొమ్మ ల తయారీదారులు(xiv) క్షురకర్మ లో నిమగ్నం అయ్యే వారు; (xv) పూల దండల ను సిద్ధం చేసే వారు; (xvi) రజకులు; (xvii) దర్జీ లు; మరియు (xviii) చేపల వలల తయారీదారులు ఉంటారు.

 

***



(Release ID: 1957735) Visitor Counter : 185