కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దిల్లీ సర్కిల్ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ విభాగం, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ యూనిట్లకు చెందిన పింఛనుదార్ల ఫిర్యాదులు పరిష్కరించడానికి జాతీయ పింఛను అదాలత్

Posted On: 14 SEP 2023 4:17PM by PIB Hyderabad

దిల్లీ సర్కిల్ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ విభాగం, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ యూనిట్లకు చెందిన పింఛనుదార్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు, దిల్లీలోని ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ కార్యాలయం దేశవ్యాప్త పింఛను అదాలత్‌ను ప్రకటించింది. పింఛను చెల్లింపు ఆదేశాలు (పీపీవోలు), సర్వీసు పుస్తకాల నిర్వహణ, పింఛను పంపిణీ సహా పింఛను సంబంధిత వివిధ సమస్యలకు సత్వర పరిష్కారాలను అందించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.

కార్యక్రమం వివరాలు:

వేదిక: కాన్ఫరెన్స్ హాల్, సంచార్ లేఖ భవన్, ఆఫీస్‌ ఆఫ్‌ పీఆర్‌ సీసీఏ, ప్రసాద్‌ నగర్, న్యూదిల్లీ-110005 తేదీ: 20-09-2023 సమయం: ఉదయం 11:00 గంటలు

ఈ ఏడాది సెప్టెంబరు 01 నాటికి ఆరు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్న పింఛనుదార్ల ఫిర్యాదులను పరిష్కరించడంపై జాతీయ పింఛను అదాలత్ దృష్టి పెడుతుంది. దిల్లీ ఎన్‌సీఆర్‌లో నివసిస్తున్న పింఛనుదార్లు తమ దీర్ఘకాల సమస్యలను కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ కార్యాలయం ప్రిన్సిపల్‌ వద్ద నేరుగా పరిష్కరించుకోవడానికి ఈ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తారు.

నమోదు వివరాలు:

జాతీయ పింఛను అదాలత్‌లో పాల్గొనేందుకు, పింఛనుదార్లు ఈ కింది వివరాలను అందించాలి:

  1. పింఛనుదారు/కుటుంబ పింఛనుదారు పేరు
  2. పీపీవో సంఖ్య
  3. చివరిగా పని చేసిన యూనిట్ పేరు
  4. పదవీ విరమణ తేదీ/మరణించిన తేదీ
  5. వివరణాత్మక ఫిర్యాదు
  6. సంప్రదింపుల కోసం ఫోన్‌ నంబరు

ఫిర్యాదు నమోదుకు గడువు: సెప్టెంబర్ 15, 2023

పింఛనుదార్లు తమ ఫిర్యాదులను cca.dl-dot[at]nic[dot]in అడ్రస్‌కు ఈ-మెయిల్ చేయడం ద్వారా కమ్యూనికేషన్ అకౌంట్స్‌ ప్రిన్సిపల్ కంట్రోలర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు, ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

తపాలా చిరునామా: సంచార్ లేఖభవన్, ప్రసాద్ నగర్, న్యూదిల్లీ-110005

పింఛనుదార్ల శ్రేయస్సు & భద్రత కోసం కట్టుబడి ఉన్నామని, పింఛనుదార్లందరికీ సకాలంలో, సమర్థవంతమైన పింఛను సేవలను అందించడానికి కృషి చేస్తున్నామని దిల్లీలోని కమ్యూనికేషన్ అకౌంట్స్ ప్రిన్సిపల్ కంట్రోలర్ కార్యాలయం పేర్కొంది. తమ బాధ్యతలను నెరవేర్చడానికి తీసుకున్న చర్యల్లో ఈ జాతీయ పింఛను అదాలత్ ఒకటి అని వెల్లడించింది.               

 

***



(Release ID: 1957597) Visitor Counter : 78


Read this release in: English , Urdu , Hindi