సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 2.0 రూ.25.63 కోట్ల ఆదాయం ఆర్జన
Posted On:
14 SEP 2023 6:31PM by PIB Hyderabad
కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ కార్యాలయాలు ప్రత్యేక ప్రచారం 2.0లో భారీ విజయం సాధించాయి. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా 4.73 లక్షల కిలోల వ్యర్థాలను అమ్మడం ద్వారా రూ.25.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. 2022 నవంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు సాగిన ఈ ప్రక్రియలో 11.43 లక్షల చదరపు అడుగుల స్థలం కూడా అందుబాటులోకి వచ్చింది. మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ మార్గదర్శకత్వంలో, కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ఈ కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షించారు.
***
(Release ID: 1957592)
Visitor Counter : 95