ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

సెమికాన్ ఇండియా 2023 విజయవంతం అయిన తర్వాత, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో జరగనున్న సెమికాన్ ఇండియాను ప్రారంభించడానికి సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం బెంగళూరు రానున్నారు.

Posted On: 12 SEP 2023 6:20PM by PIB Hyderabad

            గుజరాత్‌లో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సెమికాన్ ఇండియా 2023 విజయవంతమైన తరువాత తిరిగి సెప్టెంబర్ 2024లో
తిరిగి గ్లోబల్ సమ్మిట్ జరగనుంది.  సెమికాన్ ఇండియా 2024 కోసం పూర్వరంగంగా నిర్వహించే కార్యక్రమం 13 సెప్టెంబర్ బుధవారం జరుగుతుంది. ఈ కార్యక్రమం బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో రెండు రోజులు జరుగుతుంది.

              Electronica & Productionica భాగస్వామ్యంలో SEMI నిర్వహించే ఈ ప్రధాన కార్యక్రమాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభిస్తారు.

            పూర్వ రంగంగా జరిగే ఈ ప్రధాన కార్యక్రమం ఇతివృత్తం "భారతదేశం — ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామి మరియు పెరుగుతున్న శక్తి.".  సెమీకండక్టర్ పరిశ్రమలో భారతదేశం యొక్క ప్రముఖ శక్తిగా ఎదిగేందుకు
తోడ్పడటానికి పరిశ్రమకు చెందిన దిగ్గజాలు , పరిశోధకులు మరియు ప్రభుత్వ అధికారులను ఒక వేదికపైకి చేరుస్తుంది.
ఆ విధంగా ఇప్పుడు దేశంలో తప్పనిసరిగా హాజరు కావాల్సిన విశేష చిహ్నం వంటి కార్యక్రమంగా మారింది. అది
భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని పెంచడానికి స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థలను ఏకం చేసింది.

            ఈ ప్రత్యేక కార్యక్రమం సందర్బంగా  గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంలో భారతదేశం యొక్క పురోగతిని MoS శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఉద్ఘాటిస్తారు.  పెరుగుతున్న భారతదేశం ఉరవడిని , ముఖ్యంగా జి20 అధ్యక్ష హోదాలో  భారతావని  ఇటీవలి చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన నేపథ్యంలో ఎలా అభివృద్ధి చెందుతోందో ఆయన నొక్కిచెప్తారు. .

              ప్రపంచ దేశాల అభివృద్ధిలో భారతదేశం ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామిగా ఎలా మారుతున్నదో శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గతంలో ఉద్ఘాటించారు. మైక్రాన్, AMD, లామ్ రీసెర్చ్ మరియు అప్లైడ్ మెటీరియల్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి, ఉత్పాదక పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడుతున్నాయి, ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి మరియు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా కలసి నడుస్తున్నాయి. .

           ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పరిశ్రమకు చెందిన  భాగస్వామ్యపక్షాలు  మరియు సంఘాల సహకారంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆధ్వర్యంలో సెమికాన్ఇండియా 2023ని నిర్వహించారు.  

          భారతదేశ సెమీకండక్టర్ మిషన్ దార్శనికతకు అనుగుణంగా, సెమీకండక్టర్ డిజైన్, తయారీ మరియు సాంకేతిక అభివృద్ధికి ప్రపంచ కేంద్రంగా (గ్లోబల్ హబ్)గా  భారతదేశాన్ని అభివృద్ధి  చేయడం లక్ష్యం. ఈ కార్యక్రమంలో అంకుర సంస్థలు , వ్యవస్థాపకులు, వినూత్న కల్పనల ఆవిష్కర్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు మరియు ప్రభుత్వ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు.


 

***

 



(Release ID: 1957390) Visitor Counter : 82