వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెండింగ్ విజ్ఞప్తులను పరిష్కరించడం, స్వచ్ఛతను పెంచడానికి డిపిఐఐటీ ప్రత్యేక ప్రచారం 2.0


ప్రచారం వల్ల 22,000 చదరపు అడుగుల స్థలానికి విముక్తి, వ్యర్థం రద్దును అమ్మకం ద్వారా
ఒక లక్ష రూపాయల ఆదాయం

Posted On: 13 SEP 2023 5:46PM by PIB Hyderabad

స్వచ్ఛతను మెరుగుపరచడం, పెండింగ్‌లో సిఫార్సులను పరిష్కరించడానికి ప్రత్యేక ప్రచారం 2.0 పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటీ), దాని పరిధిలోని 18 సంస్థలలో 2022 అక్టోబర్ 2 నుండి 31 వరకు 95 ప్రచార సైట్‌లలో విజయవంతంగా నిర్వహించబడింది. ఫీల్డ్/అవుట్‌స్టేషన్ సంస్థలే ప్రధాన లక్ష్యంగా కొనసాగింది.  ప్రత్యేక ప్రచారం 2.0కి కొనసాగింపుగా, ప్రచార దశలో చేపట్టిన కార్యకలాపాలు నవంబర్, 2022 నుండి ఆగస్టు, 2023 వరకు నిరంతర అమలు కోసం ముందుకు తీసుకెళ్తున్నారు.

 

ఉద్యోగ భవన్, న్యూ ఢిల్లీ 

 డిపార్ట్‌మెంట్ పీఎంఓ/వీఐపీ సూచనలు, ఎంపీ రిఫరెన్స్‌లు, డీఓ లెటర్‌లు, పబ్లిక్ గ్రీవెన్స్, మొదలైన వాటి పరిష్కరించడానికి,  పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక డ్యాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. ప్రచార సమయంలో,  2,826 పబ్లిక్ గ్రీవెన్స్/ పబ్లిక్ గ్రీవెన్స్ అప్పీల్స్, 161 పీఎంఓ రిఫరెన్స్‌లు, 158 ఎంపీ రిఫరెన్స్‌లు. అంతర్ మంత్రిత్వ సూచనలు, 66 రాష్ట్ర ప్రభుత్వం. సూచనలు, 11 పార్లమెంటరీ హామీలు (3 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి)  విజయవంతంగా లిక్విడేట్ చేయడం/విసర్జించడం జరిగింది. రికార్డు నిర్వహణలో 5.42 లక్షల ఫిజికల్ ఫైళ్లను సమీక్షించగా, వాటిలో 1,63,997 ఫైళ్లు తొలగించారు. అదేవిధంగా, 48,267 ఈ-ఫైళ్లను సమీక్షించగా, వాటిలో 4300 ఈ-ఫైళ్లు మూసివేశారు. డీపీఐఐటీ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో 1,45,031 ఫైళ్లను డిజిటలైజ్ చేశారు. ఫలితంగా, 22,087 చదరపు అడుగులు స్థలం  ఖాళీ అయింది, రూ.1,09,500/-  స్క్రాప్ డిస్పోజల్‌గా  రాబడి వచ్చింది.

 

Chief Controller of Accounts, Jaipur

ప్రత్యేక ప్రచారం 2.0 పని ప్రదేశాలలో స్వచ్ఛత ప్రాముఖ్యతను, పని సామర్థ్యంలో ఐసీటీ పాత్రను అర్థం చేసుకోవడానికి ఒక వేదికగా పనిచేసింది.  అన్నింటికీ మించి, సంస్థ ఉద్యోగులు, ఇతర వాటాదారులకు అనుకూలమైన పని వాతావరణాన్ని అందించడానికి స్థిరమైన యంత్రాంగాన్ని సంస్థాగతీకరించడానికి సంస్థలను సులభతరం చేసింది. పని ప్రదేశాలను మెరుగుపరచడానికి ఈ సంస్థలు అనేక మంచి పద్ధతులను అవలంబించాయని నివేదిక స్పష్టం చేసింది. 

02.10.2023 నుండి షెడ్యూల్ చేసిన ప్రత్యేక ప్రచారం 3.0 అమలు ద్వారా ప్రత్యేక ప్రచారం 2.0 ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చొరవను అమలు చేయడానికి డిపిఐఐటీ కింద భారతదేశం అంతటా ప్రచార సైట్‌లు గుర్తించారు. . 75 ప్రచార స్థలాలను సందర్శించి ప్రచారం పురోగతిపై నివేదిక ఇవ్వడానికి 49 మంది అధికారులను డిపార్ట్‌మెంట్ నియమించింది. 

 

 

***


(Release ID: 1957248) Visitor Counter : 106