ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబర్ 14 వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను మరియు ఛత్తీస్ గఢ్ ను సందర్శించనున్న ప్రధానమంత్రి
మధ్య ప్రదేశ్ లో 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కుశంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
బీనా రిఫైనరీ లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కుశంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
నర్మదపురం లో ‘పవర్ ఎండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ జోన్’ కు మరియు రత్ లామ్ లో మెగా ఇండస్ట్రియల్ పార్కు కుప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు
ఇందౌర్ లో రెండు ఐటి పార్క్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగాఆరు క్రొత్త ఇండస్ట్రియల్ పార్కుల కు కూడా శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
దాదాపు గా, 6,350 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక ప్రధాన రైలు రంగ ప్రాజెక్టుల ను ఛత్తీస్ గఢ్ లో దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి ఛత్తీస్ గఢ్ లో తొమ్మిది జిల్లాల లో ‘క్రిటికల్ కేయర్ బ్లాక్స్’ కు శంకుస్థాపన చేస్తారు
ఇదే కార్యక్రమంలో ఒక లక్ష సికల్ సెల్ కౌన్సెలింగ్ కార్డుల ను పంపిణీ చేయనున్న ప్రధాన మంత్రి
Posted On:
13 SEP 2023 10:41AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 14 వ తేదీ న మధ్య ప్రదేశ్ ను మరియు ఛత్తీస్ గఢ్ ను సందర్శించనున్నారు. ప్రధాన మంత్రి ఉదయం సుమారు 11 గంటల 15 నిమిషాల వేళ లో మధ్య ప్రదేశ్ లోని బీనా కు చేరుకొని, అక్కడ గల ‘బీనా రిఫైనరీ లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్’ కు మరియు రాష్ట్రం లో పలు ప్రాంతాల లో ఏర్పాటయ్యే పది క్రొత్త పారిశ్రామిక ప్రాజెక్టు లు సహా 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం పూట సుమారు 3 గంటల 15 నిమిషాల వేళ లో ఆయన ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ కు చేరుకొని, ముఖ్యమైన రైలు రంగ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ఛత్తీస్ గఢ్ లోని తొమ్మిది జిల్లాల లో ‘క్రిటికల్ కేయర్ బ్లాక్స్’ కు శంకుస్థాపన చేయడంతో పాటు ఒక లక్ష సికల్ సెల్ కౌన్సెలింగ్ కార్డుల ను కూడా పంపిణీ చేయనున్నారు.
మధ్య ప్రదేశ్ లో ప్రధాన మంత్రి
రాష్ట్రం లో పారిశ్రామిక అభివృద్ధి కి ఒక పెద్ద దన్ను గా నిలచేటటువంటి చర్య లో భాగం గా, ప్రధాన మంత్రి భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్) యొక్క బీనా రిఫైనరీ లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ అత్యాధునిక రిఫైనరీ ని సుమారు 49,000 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఇది వస్త్రాలు, ప్యాకేజింగ్, ఫార్మా వంటి విభిన్న రంగాల లో కీలకమైన కంపొనంట్ లు అయిన ఎథిలీన్ ను, ప్రొపలీన్ ను దాదాపు గా 1200 కెటిపిఎ (ఒక్కో సంవత్సరానికి కిలో - టన్స్) మేరకు ఉత్పత్తి చేస్తుంది. దీనితో దేశం దిగుమతుల పై ఆధారపడే దోరణి తగ్గుతుంది; అంతేకాకుండా, ‘ఆత్మనిర్భర్ భారత్’ తాలూకు ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణాన్ని సాకారం చేసే దిశ లో ఇది ఒక మహత్వపూర్ణమైనటువంటి చర్య కాగలదు. ఈ మెగా ప్రాజెక్టు తో ఉపాధి అవకాశాలు అందిరావడం తో పాటు పెట్రోలియమ్ రంగం లో చిన్న పరిశ్రమల అభివృద్ధి కి ఊతం అందగలదు.
ఇదే కార్యక్రమం లో, ప్రధాన మంత్రి నర్మదపురం జిల్లా లో ‘పవర్ ఎండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మాన్యు ఫాక్చరింగ్ జోన్’ లో పది ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ ప్రాజెక్టుల లో ఇందౌర్ లో రెండు ఐటి పార్కు లు; రత్ లామ్ లో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు మరియు యావత్తు మధ్య ప్రదేశ్ లో ఆరు సరిక్రొత్త ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి.
నర్మదపురం లో ‘పవర్ ఎండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మేన్యుఫేక్చరింగ్ జోన్’ ను 460 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఇది ఆ ప్రాంతం లో ఆర్థిక వృద్ధి కి మరియు ఉద్యోగాల కల్పన దిశ లో ఒక పెద్ద కార్యక్రమం కాగలదు. రమారమి 550 కోట్ల రూపాయల ఖర్చు తో ఇందౌర్ లో నిర్మించేటటువంటి ‘ఐటి పార్క్ 3 మరియు 4 ’ లతో ఐటి మరియు ఐటిఇఎస్ రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. దీనితో పాటు యువతీ యువకుల కు ఉపాధి తాలూకు సరిక్రొత్త అవకాశాల కు తలుపు లు తెరచుకొంటాయి.
లామ్ లో 460 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో మెగా ఇండస్ట్రియల్ పార్కు ను నిర్మించడం జరుగుతుంది. ఇది వస్త్రాలు, ఆటోమొబైల్, ఔషధ నిర్మాణం తదితర ముఖ్య రంగాల లో ఒక ప్రధానమైన కేంద్రం గా మారుతుందన్న అంచనా ఉంది. ఈ పార్కు దిల్లీ- ముంబయి ఎక్స్ ప్రెస్ వే తో మెరుగైన రీతి న జతపడి ఉంటుంది. ఈ పార్కు ఆ ప్రాంతం అంతటా ఆర్థిక అభివృద్ధి కి పెద్ద దన్ను గా నిలచి, యువత కు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాల ను అందించగలుగుతుంది.
రాష్ట్రం లో వివిధ ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి కి, సమాన ఉద్యోగ అవకాశాల కు ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశ్యం తో సుమారు 310 కోట్ల రూపాయల ఖర్చు తో శాజాపుర్, గుణ, మవూగంజ్, ఆగర్ మాల్ వా, నర్మదపురం మరియు మక్సీ లలో క్రొత్త గా ఆరు ఇండస్ట్రియల్ ఏరియాస్ ను అభివృద్ధి పరచడం జరుగుతుంది.
ఛత్తీస్ గఢ్ లో ప్రధాన మంత్రి
రాయ్ గఢ్ లో ఒక సార్వజనిక కార్యక్రమం లో సుమారు 6,350 కోట్ల రూపాయల విలువైన రైల్ రంగం ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం ద్వారా, దేశవ్యాప్తం గా కనెక్టివిటీ ని మెరుగు పరచాలని ప్రధాన మంత్రి తలపెట్టిన శ్రద్ధ కు పెద్ద ప్రోత్సాహం లభించనుంది. ఈ ప్రాజెక్టుల లో ఛత్తీస్ గఢ్ ఈస్ట్ రైల్ ప్రాజెక్టు ఒకటో దశ, చాంపా నుండి జమ్ గా మధ్య మూడో రైలు మార్గం, పెండ్రా రోడ్ నుండి అనూప్ పుర్ మధ్య మూడో రైలు మార్గం మరియు తలాయిపల్లి బొగ్గు గని ప్రాంతాన్ని ఎన్ టిపిసి లారా సూపర్ థర్మల్ పవర్ స్టేశన్ (ఎస్ టిపిఎస్) తో కలిపే ఎమ్ జిఆర్ (మెరీ-గో-రౌండ్) సిస్టమ్ వంటివి భాగం గా ఉన్నాయి. ఈ రైలు ప్రాజెక్టులు ఆ ప్రాంతం లో ప్రయాణికుల రాకపోకల కు తోడ్పడడం తో పాటు గా సరకుల చేరవేత ను సౌకర్యవంతం గా మార్చివేసి సామాజిక- ఆర్థిక అభివృద్ధి కి ఉత్తేజాన్ని అందించగలవు.
బహుళ విధ సంధానం కోసం సంకల్పించిన మహత్త్వాకాంక్షయుక్తమైనటువంటి పిఎమ్ గతిశక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ లో భాగం గా ఛత్తీస్ గఢ్ ఈస్ట్ రైల్ ప్రాజెక్టు ఒకటో దశ ను అభివృద్ధి పరచడం జరుగుతున్నది. మరి దీనిలో ఖర్ సియా నుండి ధరమ్ జయ్ గఢ్ వరకు 124.8 కిలోమీటర్ ల రైలు మార్గం కలిసి ఉంది. దీనిలో గారే - పెల్ మా కోసం ఒక చిన్న రైలు మార్గం మరియు ఛాల్, బరౌద్, దుర్గాపుర్ తదితర బొగ్గు గనుల ను కలిపేటటువంటి మూడు ఫీడర్ లైన్స్ కూడా చేరి ఉన్నాయి. దాదాపు గా 3,055 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించిన ఈ రైలు మార్గం లో విద్యుతీకరించిన బ్రాడ్ గేజ్ లెవల్ క్రాసింగు లు మరియు ప్రయాణికుల సౌకర్యాలతో పాటు గా ఫ్రీ పార్ట్ డబల్ లైన్ వంటి వ్యవస్థ ను జతపరచడమైంది. ఇది ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ లో నెలకొన్న మాండ్-రాయ్ గఢ్ కోల్ ఫీల్డ్స్ నుండి బొగ్గు ను రవాణా చేయడాని కి రైలు మార్గ సదుపాయాన్ని అందుబాటు లోకి తీసుకు వస్తుంది.
పెండ్రా రోడ్డు నుండి అనూపుర్ మధ్య మూడో రైలు మార్గం పొడవు 50 కిమీ పొడవు న ఉంది. దీనిని సుమారు 516 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడం జరిగింది. చాంపా మరియు జామ్ గా రైల్ సెక్శన్ మధ్య 98 కిలో మీటర్ ల పొడవైన మూడో రైలు మార్గాన్ని దాదాపు గా 796 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది. క్రొత్త రైలు మార్గాల తో ఆ ప్రాంతం లో కనెక్టివిటీ లో మెరుగుదల మరియు పర్యటన, ఇంకా ఉద్యోగ అవకాశాలు.. ఈ రెండిటి లోను అవకాశాలు పెరుగుతాయి.
అరవై అయిదు కి.మీ. పొడవైన విద్యుతీకరించిన ఎమ్ జిఆర్ (మెరీ-గో-రౌండ్) సిస్టమ్ సాయంతో ఎన్ టిపిసి కి చెందిన తాలాయిపల్లి బొగ్గు గని నుండి ఛత్తీస్ గఢ్ లో ఎన్ టిపిసి కే చెందిన 1600 మెగావాట్ సామర్థ్యం కలిగిన లారా సూపర్ థర్మల్ పవర్ స్టేశను వరకు తక్కువ ఖర్చు లో ఉన్నత శ్రేణి కి చెందిన బొగ్గు ను చేరవేయడం సాధ్యపడుతుంది. దీనితో ఎన్ టిపిసి లారా నుండి తక్కువ ఖర్చు తో పాటు విశ్వసనీయమైనటువంటి విద్యుత్తు ఉత్పాదన కు ఊతం లభిస్తుంది. తత్ఫలితం గా దేశం లో శక్తి సంబంధి సురక్ష బలపడగలదు. రెండు వేల డెబ్భయ్ కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించినటువంటి ఎమ్ జిఆర్ సిస్టమ్ అనేది బొగ్గు గనుల వద్ద నుండి విద్యుత్తు కేంద్రాల వరకు బొగ్గు ను రవాణా చేయడం లో మెరుగుదల కోసం ఒక అద్భుతమైనటువంటి సాంకేతిక విజ్ఞాన సంబంధి కార్యసాధన అని చెప్పవచ్చును.
ఇదే కార్యక్రమం లో, ప్రధాన మంత్రి ఛత్తీస్ గఢ్ లో తొమ్మిది జిల్లాల లో ఏభై పడకల తో ఉండే ‘క్రిటికల్ కేయర్ బ్లాక్స్’ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ తొమ్మిది క్రిటికల్ కేయర్ బ్లాక్స్ ను ప్రధాన మంత్రి- ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (పిఎమ్-ఎబిహెచ్ఐఎమ్) లో భాగం గా మొత్తం 210 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో దుర్గ్, కొండాగాఁవ్, రాజ్ నాంద్ గాఁవ్, గరియా బంద్, జశ్ పుర్, సూరజ్ పుర్, బస్తర్, ఇంకా రాయ్ గఢ్ జిల్లాల లో నిర్మించడం జరుగుతుంది.
ప్రత్యేకించి ఆదివాసి జనాభా లో సికల్ సెల్ రోగం కారణం గా తల ఎత్తుతున్నటువంటి ఆరోగ్యం సంబంధి సమస్యల ను పరిష్కరించాలనే ఉద్దేశ్యం తో, సికల్ సెల్ రోగం తాలూకు పరీక్షలు పూర్తి అయిన జనాభా కు ప్రధాన మంత్రి ఒక లక్ష సికల్ సెల్ కౌన్సెలింగ్ కార్డుల ను కూడా పంపిణీ చేయనున్నారు. సికల్ సెల్ కౌన్సెలింగ్ కార్డుల పంపిణీ ని నేశనల్ సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశన్ (ఎన్ఎస్ఎఇఎమ్) లో భాగం గా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ మిశను ను 2023 జులై లో మధ్య ప్రదేశ్ లోని శహ్ డోల్ లో ప్రధాన మంత్రి ప్రారంభించారు.
***
(Release ID: 1957013)
Visitor Counter : 121
Read this release in:
Urdu
,
Odia
,
Assamese
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam