ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ విభాగం, ఆరోగ్య పరిశోధన విభాగంలో పెండింగ్ అంశాల పరిష్కారానికి 2.0 ప్రత్యేక ప్రచారం. స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహణ.


1,051 పరిశుభ్రతా ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. 27,162 చదరపు అడుగుల స్థలంలో చెత్త తొలగింపు, 25,846 ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్ల పరిష్కారం.

4750 ఫైళ్ల తొలగింపు, 2022 డిసెంబర్ నుంచి 2023 ఆగస్టు మధ్య కాలంలో చెత్త తొలగింపు ద్వారా వచ్చిన రాబడి రూ 25,69,693లు.

Posted On: 12 SEP 2023 5:27PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం, ఆరోగ్య పరిశోధన విభాగాలలో  పెండింగ్ అంశాల (ఎస్సిడిపిఎం) పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం 2.0,  పెద్ద ఎత్తున స్వచ్చతా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, పెండింగ్ అంశాలు లేకుండా చూడడం, స్వచ్ఛతను సంస్థాగతం చేయడం, అంతర్గత పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేయడం, రికార్డుల నిర్వహణలో అధికారులకు శిక్షణ ఇవ్వడం,
రికార్డులను డిజిటలైజ్ చేయడం, రికార్డుల నిర్వహణను మెరుగుపరచడం, అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలను ఒకే ఒక డిజిటల్ ప్లాట్ ఫారం  www.pgportal.gov.in/scdpm పైకి తీసుకురావడం.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం కింద, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కేంద్ర కార్యాలయం, దాని అనుబంధ కార్యాలయాలు, సబార్డినేట్ కార్యాలయాలు,  స్వయంప్రతిపత్తి సంస్థలు, కేంద్ర పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజ్లు,
వీటితోపాటు ఎఐఐఎంఎస్, జాతీయ ప్రాధాన్యతగల సంస్థలు, డిసెంబర్ 2022 నుంచి 2023 ఆగస్టువరకు ఈ ప్రచారంలో క్రియాశీలంగా పాల్గొన్నాయి.

పైన పేర్కొన్న కాలంలో, 9,213 ఫైళ్లను సమీక్షించి వీటిలో 4,750 ఫైళ్లను తొలగించడం జరిగింది. అలాగే 25,846 ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్లను పరిష్కరించారు.
1051 పరిశుభ్రతా ప్రచారాలు నిర్వహించారు. 27,162 చదరపు అడుగుల ప్రదేశాన్ని ఖాళీ చేశారు. చెత్త తొలగించడం ద్వారా రూ 25,69,693 రూపాయలు ఆర్జించారు. 

ఆరోగ్యపరిశోధనా విభాగం, ఐసిఎంఆర్ సంస్థలు కూడా ప్రత్యేక ప్రచార కార్యక్రమం 2.0ను పూర్తి స్థాయిలో చేపట్టాయి. 2022 డిసెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు పార్లమెంటరీ హామీలను పరిష్కరించడం జరిగింది.
అంతర్ మంత్రిత్వ సంప్రదింపులు, పిఎంఒ రెఫరెన్సులు, పిజి అప్పీళ్లు, పరిష్కరించడం జరిగింది. ఎం.పి రెఫరెన్సుల పరిష్కారం 67 శాతం వరకు ఉంది. దీనికి తోడు  177 ఫిజికల్ ఫైళ్లు కూడా తొలగించారు.

.ఫోటో:   ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ వద్ద      స్వచ్ఛ తా అభియాన్
ఎయిమ్స్ భొపాల్ అకడమిక్ బ్లాక్ వద్ద  చెత్త తొలగింపు

 

 


ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్), ముంబాయి.
ముందు– తర్వాత

 


 పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పిఐఐ), కూనూర్, తమిళనాడు.
మందు–                                                          తర్వాత      

 

 

                                            



స్వచ్ఛతను పెంపొందించేందుకు పలు సంస్థలు అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నాయి. ఇవి తమ క్యాంపస్ లో పరిశుభ్రత, పచ్చదనం ఏర్పాటు చేస్తున్నాయి.

ప్రతి నెలా, స్వచ్ఛత, ఫిర్యాదుల పరిష్కారం వంటి వాటికి సంబంధించి న సమాచారాన్ని, ఫోటోలను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం, ఆరోగ్య పరిశోధన విభాగం పాలనా సంస్కరణలు, ఫ్రజా ఫిర్యాదుల విభాగం వారి
ప్రత్యేక పోర్టల్(www.pgportal.gov.in/scdpm) లో పొందుపరచడం జరుగుతోంది.

 

***


(Release ID: 1956844) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi