సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

'భారత్: ప్రజాస్వామ్య మాత' భారతీయ ప్రజాస్వామ్య నైతికత సారాంశాన్ని సూచిస్తుంది.

Posted On: 11 SEP 2023 6:15PM by PIB Hyderabad

జీ 20 శిఖరాగ్ర సదస్సు కోసం ఐ టీ పి ఓ హాల్ నంబర్ 14 (ఫోయర్ ఏరియా)లో 'భారత్: ప్రజాస్వామ్య మాత' పై భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 8-10 సెప్టెంబర్ 2023లలో ప్రదర్శనను నిర్వహించింది. ఈ సంగ్రహ అనుభవం మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రదర్శించింది. 

(భారత ప్రజాస్వామ్య స్వరూప చరిత్ర 26 ఇంటరాక్టివ్ ప్యానెల్‌ల ద్వారా వివిధ భాషల్లో ప్రదర్శించబడింది.)

 

(మధ్యలో సింధు-సరస్వతి నాగరికతకు చెందిన అమ్మాయి శిల్పం)

 

(రిసెప్షన్ వెనుక భాగంలో భారతదేశం యొక్క గొప్ప సంస్కృతీ సంప్రదాయాల దృశ్యాలను ప్రదర్శించే భారీ వీడియో స్క్రీన్)

(శ్రీ సచ్చిదానంద్ జోషి, మెంబర్ సెక్రటరీ, ఐ జీ ఎన్ సీ ఏ 'భారత్: ప్రజాస్వామ్య మాత' ఎగ్జిబిషన్ గురించి మీడియాకు వివరిస్తున్నారు)

 

ఆమె స్వతంత్ర, విముక్త,ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యం తో  ప్రపంచాన్ని సూటిగా చూస్తోంది.  ఆమె పశ్చిమ భారతదేశంలోని మహిళలు ప్రతిరోజూ ధరించే ఆభరణాల వంటి ఆభరణాలను ధరిస్తుంది. శిల్పం యొక్క అసలు ఎత్తు 10.5 సెం.మీ. అయితే ప్రతిరూపం 5 అడుగుల ఎత్తు మరియు 120 కిలోల బరువు కాంస్యంతో రూపొందించబడింది.

 

 భారతదేశంలో ప్రజాస్వామ్య చరిత్రను సందర్శకులు 26 ఇంటరాక్టివ్ ప్యానెల్‌ల ద్వారా 16 విభిన్న భాషలలో చదవవచ్చు మరియు ఆడియోను  వినవచ్చు.   ప్యానెల్‌లలో స్థానిక స్వపరిపాలన, ఆధునిక భారతదేశంలో ఎన్నికలు, కృష్ణదేవరాయలు, జైన ధర్మం తదితరాలు ఉన్నాయి. ప్రదర్శనను జీ 20 అప్లికేషన్‌లో డిజిటల్‌గా పొందవచ్చు.

 

ప్రజాస్వామ్యం భారతదేశంలో పురాతన భావన. భారతీయ మౌలిక విలువల  ప్రకారం  ప్రజాస్వామ్యం భావన అంటే సమాజంలో స్వేచ్ఛ, ఆమోదయోగ్యత, సమానత్వం మరియు కలుపుగోలు సమ్మిళితం వంటివి వాటి విలువలు.  ఇది పౌరులు నాణ్యమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అనుమతిస్తుంది.  అందుబాటులో ఉన్న తొలి పవిత్ర గ్రంథాలైన ఋగ్వేదం మరియు అథర్వవేదం, సభ, సమితి మరియు సన్సద్ వంటి భాగస్వామ్య సంస్థలను సూచిస్తాయి, చివరి పదం ఇప్పటికీ మన పార్లమెంటును సూచిస్తుంది. ఈ దేశ ఇతిహాసాలైన రామాయణం మరియు మహాభారతాలు కూడా నిర్ణయాధికారంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం గురించి మాట్లాడుతున్నాయి. పరిపాలించే అధికారం అర్హత లేదా ఉమ్మడి ఏకాభిప్రాయం ద్వారా పొందబడుతుంది కానీ వంశపారంపర్యంగా కాదు అని భారతీయ వచన సాహిత్య ఉదాహరణలలో కూడా ఉంది. పరిషత్ మరియు సమితి వంటి వివిధ ప్రజాస్వామిక సంస్థలలో ఓటరు యొక్క చట్టబద్ధతపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భారతీయ ప్రజాస్వామ్యం  సత్యం, సహకారం, సహాయం, శాంతి, సానుభూతి మరియు సామూహిక ప్రజా బలం  అనే నిజమైన ఉత్సవ ప్రకటన.

 

***



(Release ID: 1956519) Visitor Counter : 352