నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఇంధన రంగంలో సహకారం కోసం ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్, సౌదీ అరేబియా
Posted On:
11 SEP 2023 6:25PM by PIB Hyderabad
ఇంధన రంగంలో సహకారం పై భారత్, సౌదీ అరేబియా అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి. భారత గణతంత్ర ప్రభుత్వం, కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియా మధ్య ఈ ఎంఒయుపై 10 సెప్టెంబర్ 2023న న్యూఢిల్లీలో భారత దేశం తరుఫున కేంద్ర నూతన & పునరావృత ఇంధన, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్, కింగ్డమ్ సౌదీ అరేబియా తరుఫున సౌదీ ఇంధన మంత్రి హిజ్ హైనెస్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అల్ -సౌద్ సంతకాలు చేశారు.
అవగాహన పత్రం ప్రకారం భారత్, సౌదీ అరేబియాలు దిగువన పేర్కొన్న రంగాలలో సహకరించుకోనున్నాయిః
పునరావృత ఇంధనం, ఇంధన సామర్ధ్యం, హైడ్రొజెన్, ఇరు దేశాల మధ్య విద్యుత్, గ్రిడ్ అనుసంధానం, పెట్రోలియం, సహజ వాయువు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, ఇంధన భద్రత.
పునరావృత ఇంధన రంగంలో ద్వైపాక్షిక పెట్టుబడులను ప్రోత్సాహం, విద్యుత్, హైడ్రొజెన్, నిల్వ; చమురు & వాయువు.
పర్యావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించేందుకు ఆవృత ఆర్ధిక వ్యవస్థ, తత్సంబంధిత సాంకేతికలుః కర్బన గ్రహణం (కార్బన్ కాప్చర్), వినియోగం, నిల్వ .
ఇంధన రంగంలో డిజిటల్ పరివర్తనను, ఆవిష్కరణలను, సైబర్ భద్రతను, ఆర్టిఫిషియల్‌ను ప్రోత్సహించడం.
ఇంధన సరఫరా గొలుసులు, దాని సాంకేతికతలకు సంబంధించి అన్ని రంగాలకు చెందిన పదార్ధాలు, ఉత్పత్తులు, సేవలను స్థానికీకరించడానికీ రెండు దేశాల మధ్య గుణాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంపై కృషి.
ఇంధన రంగంలో ప్రత్యేకత కలిగిన కంపెనీలతో సహకారాన్ని బలోపేతం చేయడం.
ఇరు దేశాలూ అంగీకారానికి వచ్చిన ఇంధన రంగానికి సంబంధించిన ఏవైనా క్షేత్రాలు.
ఇంధన రంగంలో భారత్, సౌదీ అరేబియా మధ్య బలమైన భాగస్వామ్యాన్ని అవగాహనా పత్రం అభివృద్ధి చేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ఇంధన పరివర్తన, ప్రపంచ ఇంధన వ్యవస్థ పరివర్తన కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు అవగాహనా పత్రం మద్దతు ఇస్తుంది.
భారత్ - సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ & సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్
భారత్ - సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి సమావేశంలో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రకటన
***
(Release ID: 1956513)
Visitor Counter : 204