శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 3.0 - బయోటెక్నాలజీ విభాగం

Posted On: 11 SEP 2023 4:37PM by PIB Hyderabad

ఎస్‌సీడీపీఎం 2.0 ప్రచారంలో భాగంగా, 2022 డిసెంబరు - 2023 జులై మధ్య కాలంలో, ఎంపీ సూచనలు (65%), పార్లమెంటరీ హామీలు (85%), పీఎంవో సూచనలు (90%), ఐఎంసీ సూచనలు (100%), ప్రజా ఫిర్యాదులు (88%) సహా
వివిధ అంశాల్లో పెండింగ్‌ను బయోటెక్నాలజీ విభాగం తగ్గించగలిగింది.

ఈ కాలంలో విభాగం ఉత్తమ పద్ధతులను, ముఖ్యంగా ఈ కింది వాటిలో కూడా అవలంబించింది:-

  1. 'బయోలాజికల్ రీసెర్చ్ రెగ్యులేటరీ అప్రూవల్ పోర్టల్' (బయోఆర్‌ఆర్‌ఎపీ) ప్రారంభం- శాస్త్రీయ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు సంబంధించిన అన్ని రకాల జీవ పరిశోధనల నియంత్రణల ఆమోదం కోసం ఏక గవాక్ష వేదిక.
  2. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం లేకుండా చూడటం.
  3. ఈ-ఆఫీస్ వెర్షన్ 7.0కి మారడం.
  4. 100% ఈ-రసీదులు, ఈ-దస్త్రాలు అమలయ్యేలా నిర్ధరించడం.

పనుల్లో జాప్యాన్ని తగ్గించడానికి, తన కార్యాలయంలో, తన ఆధ్వర్యంలో పని చేసే అన్ని స్వయంప్రతిపత్త సంస్థలు, పీఎస్‌యూల్లో స్వచ్ఛత ఉండేలా చూడడానికి బయోటెక్నాలజీ విభాగం కట్టుబడి ఉంది. రాబోయే ఎస్‌సీడీపీఎం 3.0లో సంపూర్ణంగా, చురుకైన భాగస్వామ్యం ఉండేలా చూడడానికి 5 సెప్టెంబర్ 2023న విభాగం అధికారులు, తన అన్ని స్వయంప్రతిపత్త సంస్థలు, యూఎస్‌యూలతో సమావేశం కూడా నిర్వహించింది.

      

 

****


(Release ID: 1956413)