కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పరిశుభ్రత, సుపరిపాలన మరియు పౌర భాగస్వామ్యం తో అందరికీ, అన్ని చోట్ల పౌరులకు ఆనందం అందించడానికి కట్టుబడి ఉంది : తపాలా శాఖ
Posted On:
09 SEP 2023 4:43PM by PIB Hyderabad
పోస్టల్ డిపార్ట్‌మెంట్ పరిశుభ్రత మరియు సుపరిపాలన కోసం ప్రత్యేక ప్రచారం 2.0ని అక్టోబర్ 2 నుండి 31, 2022 వరకు నిర్వహించింది, తరువాత నవంబర్ 2022 నుండి ఆగస్టు 2023 వరకు ప్రతి నెలా కొనసాగించబడింది.
ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ అక్టోబర్ 2023లో స్పెషల్ క్యాంపెయిన్ 3.0 సందర్భంగా గత 10 సంవత్సరాలుగా పరిశుభ్రత ప్రయత్నాల ముగింపు దిశగా పని చేస్తోంది. ప్రచారం సందర్భంగా జాతీయ పోస్టల్ వారంలో భాగంగా, అనేక “పౌర భాగస్వామ్యం ” కార్యక్రమాలకు కూడా ప్రణాళిక చేశారు.
డిపార్ట్‌మెంట్ కస్టమర్‌లకు సేవా వాతావరణాన్ని మెరుగుపరచడానికి మరియు తన ఉద్యోగుల కోసం పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి శాశ్వతమైన నిబద్ధతతో పనిచేస్తోంది. అనేక హరిత పద్ధతులను అవలంబించింది అలాగే ఇండియా పోస్ట్‌తో అనుబంధించబడిన సేవా అనుభవాన్ని మెరుగుపరచాలనే తపనతో దాని పరిమిత వనరులను వినూత్న పద్దతులలో వినియోగిస్తోంది. బలమైన మరియు విస్తృత పౌర సంబంధాలతో, "పౌర భాగస్వామ్యం" విధానం తన అన్ని ప్రత్యేక కార్యక్రమాలలో అంతర్లీనంగా ఉంటుంది.
ప్రత్యేక ప్రచారం యొక్క విజయాలు 2.0
పోస్టల్ హెడ్‌క్వార్టర్స్ డాక్‌భవన్ లో ప్రత్యేక ప్రచారం 2.0 ను అమలు చేసారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని 24,000 ఫీల్డ్ సబ్ పోస్టాఫీసులలో 2022 అక్టోబర్ 2 నుండి 31 వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆగస్ట్ 2023 వరకు కొనసాగిన ప్రత్యేక ప్రచారంలో సాధించిన కొన్ని విజయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
840 ఇ-ఫైళ్లు మూసివేయబడ్డాయి.
దాదాపు 6 లక్షల ఫైళ్లను తొలగించారు.
అక్టోబర్ 2022లో 24000 ప్రదేశాలు మరియు నవంబర్ 2022-ఆగస్టు 2023 వరకు స్వచ్ఛతా కార్యకలాపాలలో 6713 ప్రదేశాలు శుభ్రం చేసారు
చెత్త పారవేయడం ద్వారా దాదాపు 2.9 కోట్ల ఆదాయం ఆర్జించింది.
2,90,000 కంటే ఎక్కువ ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి.
సుమారు 1,13,289 చ.అ.ల స్థలం ఖాళీ చేయబడింది.
ఈ కాలంలో అమలు చేసిన ఉత్తమ పద్ధతులు:
సీలింగ్ వ్యాక్స్ వినియోగాన్ని ను నిలిపివేయడం - మెయిల్ బ్యాగ్‌లను భద్రపరచడానికి గతంలో ఉపయోగించిన సీలింగ్ వ్యాక్స్ దశలవారీగా తొలగించబడింది. ఇప్పుడు పర్యావరణ అనుకూలమైన, పునర్వినియోగపరచదగిన సీల్స్‌తో భర్తీ చేయబడింది. ఈ పరివర్తన అన్ని మెయిల్ కార్యాలయాలలో విజయవంతంగా అమలు చేయబడింది, ఇది పర్యావరణ స్పృహతో తీసుకున్న చొరవను సూచిస్తుంది, ఇది మన పర్యావరణ వ్యవస్థను కాపాడడమే కాకుండా సిబ్బంది ఆరోగ్యాన్ని కూడా కాపాడింది.
గోడ చిత్రాలద్వారా పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడం - ఈ కాలంలో, స్థానిక సంస్కృతికి అనుగుణంగా పరిశుభ్రత సందేశాన్ని ప్రచారం చేయడానికి మొత్తం 888 గోడలకు పెయింట్ చేయబడింది.
డాక్‌భవన్‌లో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం – డాక్‌భవన్ పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చడం వల్ల విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గింది, దీనితో ప్రతి నెలా దాదాపు 4 లక్షల వరకు ఆదా అవుతుంది.
కోల్‌కతాలోని పార్సెల్ కేఫ్ -కోల్‌కతా జీ పీ ఓ లో పాత సార్టింగ్ టేబుల్‌లతో సహా వదిలివేసిన వస్తువులను ఉపయోగించి పూర్తిగా కేఫ్ ను సృజనాత్మకంగా అలంకరించారు. ఈ ప్రత్యేకమైన కేఫ్ లో కస్టమర్ల కోసం పార్శిల్ ప్యాకేజింగ్ యూనిట్ కూడా ఉంది.
తదుపరి దశలు:
డిపార్ట్‌మెంట్‌లో పరిశుభ్రత కార్యక్రమాలను పదేళ్లపాటు అమలు చేయడంతో పాటుగా ప్రత్యేక ప్రచారం 3.0 ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు, ఎందుకంటే డిపార్ట్‌మెంట్ తన గత ప్రయత్నాలను ఏకీకృతం చేస్తుంది మరియు జాతీయ పోస్టల్ నెట్‌వర్క్ వాటాదారుల మద్దతుతో భవిష్యత్తు దిశానిర్దేశం కోసం రాబోయే కొన్ని సంవత్సరాలు కాలంలో అమలు చేయగల కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధ తో రూపొందిస్తుంది. వాటాదారులతో సంప్రదింపులు మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ ఉన్న ప్రతి సామాజిక-భౌగోళిక కమ్యూనిటీకి అనుగుణమైన ప్రత్యేకమైన సహకార చర్యలు “జన్ చేతన” మరియు “జన్ భగీదారి” కార్యకలాపాలలో భాగంగా భారతదేశ పోస్ట్ యొక్క ప్రత్యేక శ్రద్ధ తో నిర్వహించబడతాయి.
****
(Release ID: 1955840)
Visitor Counter : 125