వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అవలంబిస్తున్న వివిధ మోసపూరిత చీకటి నమూనాల నివారణ మరియు నియంత్రణ కోసం ముసాయిదా మార్గదర్శకాలపై కేంద్రం ప్రజల అభిప్రాయాలను కోరింది


వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అవలంబిస్తున్న వివిధ మోసపూరిత పద్ధతులను చీకటి నమూనాల స్వభావం గలవాటిని ముసాయిదా మార్గదర్శకాలు జాబితాను చేస్తాయి

30 రోజులలోపు 5 అక్టోబర్, 2023 వరకు మార్గదర్శకాలపై ప్రజల అభిప్రాయాలు/సూచనలను వినియోగదారుల వ్యవహారాల విభాగం అభ్యర్థిస్తుంది

Posted On: 07 SEP 2023 11:16AM by PIB Hyderabad

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం, చీకటి నమూనాల నివారణ మరియు నియంత్రణ కోసం డ్రాఫ్ట్ మార్గదర్శకాలపై ప్రజల అభిప్రాయాలను కోరింది. ముసాయిదా మార్గదర్శకాలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. పౌర వ్యాఖ్యలు /సూచనలు/ఫీడ్‌బ్యాక్ లింక్ https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Draft%20Guidelines%20for%20Prevention%20and%20Regulation%20of%20Dark%20Patterns%202023.pdf ద్వారా 30 రోజులలోపు (5 అక్టోబర్ 2023 వరకు) డిపార్ట్‌మెంట్‌కి అందించబడతాయి.

 

ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, న్యాయ సంస్థలు, ప్రభుత్వం మరియు స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలతో సహా  వాటాదారులతో వివరణాత్మక చర్చల తర్వాత చీకటి నమూనాల నివారణ మరియు నియంత్రణ కోసం డ్రాఫ్ట్ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి.

 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ 13 జూన్ 2023న "చీకటి ధోరణులు"పై  వాటాదారులతో సంప్రదింపులను నిర్వహించింది, దీనికి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఎన్ ఎల్ యూలు, న్యాయ సంస్థలు మొదలైనవి హాజరయ్యాయి. సమావేశంలో, చీకటి ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయని వాటిని చురుగ్గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఏకాభిప్రాయం వచ్చింది.

 

ఆ తర్వాత 28.06.2023 న  వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి ఈ-కామర్స్ కంపెనీలు, పరిశ్రమ సంఘాలు మరియు వాటాదారుల సంప్రదింపులలో పాల్గొనేవారికి లేఖను పంపారు. తమ ప్లాట్‌ఫారమ్ యొక్క ఆన్‌లైన్ ఇంటర్‌ఫేస్‌లో వినియోగదారు ఎంపికను మోసగించే ఏదైనా డిజైన్ లేదా నమూనాను చేర్చకుండా ఉండమని అభ్యర్థించారు. వినియోగదారు ఎంపికను మోసగించే లేదా మార్చే డిజైన్ లేదా నమూనాలు చీకటి నమూనాల వర్గంలోకి  వస్తాయి. వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 2(9) ప్రకారం వినియోగదారుల ఎంపికను మార్చేందుకు మరియు 'వినియోగదారుల హక్కుల'ను ఉల్లంఘించడానికి వారి ఆన్‌లైన్ ఇంటర్‌ఫేస్‌లో చీకటి నమూనాలను చేర్చడం ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు 'అన్యాయమైన వాణిజ్య పద్ధతుల'లో పాల్గొనవద్దని గట్టిగా సూచించింది.

 

తదనంతరం పరిశ్రమ సంఘాలు, ఏ ఎస్ సి ఐ, ఎన్ ఎల్ యూ లు, వీ సీ ఓ లు మరియు గూగుల్, ఫ్లిప్కార్ట్, ఆర్ ఐ ఎల్, అమెజాన్, గో ఎం ఎం టీ, స్విగ్గీ, జోమాటో, ఓలా, టాటా క్లిక్, ఫేస్ బుక్, మేట, షిప్రాకెట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులతో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. టాస్క్ ఫోర్స్ సభ్యులతో 5 సమావేశాలు నిర్వహించారు, ఇందులో టాస్క్ ఫోర్స్ సభ్యులందరి నుండి డ్రాఫ్ట్ పాలసీకి సంబంధించిన ఇన్‌పుట్‌లు తీసుకున్నారు.

 

వినియోగదారుల వ్యవహారాల శాఖకు టాస్క్ ఫోర్స్ సమర్పించిన చర్చలు మరియు ముసాయిదా మార్గదర్శకాల ఆధారంగా, చీకటి నమూనాల నివారణ మరియు నియంత్రణ కోసం ప్రస్తుత ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి అవే ఇప్పుడు ప్రజల సంప్రదింపుల కోసం ఉంచబడ్డాయి. వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 18 (2) (ఎల్) ప్రకారం ప్రతిపాదిత మార్గదర్శకాలు జారీ చేయబడతాయి.

 

డ్రాఫ్ట్ మార్గదర్శకాలు  ఏదైనా ప్లాట్‌ఫారమ్‌లో యూ ఐ/ యూ ఎక్స్ (యూజర్ ఇంటర్‌ఫేస్/యూజర్ అనుభవం) ఇంటరాక్షన్‌లను ఉపయోగించి వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి లేదా మోసగించడానికిఏవైనా పద్ధతులు లేదా మోసపూరిత డిజైన్ లను వినియోగదారు స్వయంప్రతిపత్తి, నిర్ణయం తీసుకోవడం లేదా ఎంపికను అణచివేయడం లేదా బలహీనపరచడం ద్వారా; తప్పుదోవ పట్టించే ప్రకటనలు లేదా అన్యాయమైన వాణిజ్య అభ్యాసం లేదా వినియోగదారు హక్కుల ఉల్లంఘనలను చీకటి నమూనాలు గా నిర్వచించాయి. మార్గదర్శకాల ప్రకారం, క్రింది చీకటి నమూనాలు పేర్కొనబడ్డాయి:

 

“తప్పుడు అత్యవసరఆవశ్యకత” అంటే తక్షణం కొనుగోలు చేయడానికి లేదా కొనుగోలుకు దారితీసే తక్షణ చర్యను తీసుకునేలా వినియోగదారుని తప్పుదారి పట్టించడానికి అత్యవసర లేదా కొరత యొక్క భావాన్ని తప్పుగా చెప్పడం లేదా సూచించడం.

 

బాస్కెట్ స్నీకింగ్” అంటే ప్లాట్‌ఫారమ్ నుండి చెక్అవుట్ సమయంలో వినియోగదారు అనుమతి లేకుండా ఉత్పత్తులు, సేవలు, దాతృత్వానికి చెల్లింపులు/విరాళం వంటి అదనపు వస్తువులను చేర్చడం, అంటే వినియోగదారు చెల్లించాల్సిన మొత్తం అంటే వినియోగదారు ఎంచుకున్న ఉత్పత్తి(లు) మరియు/లేదా సేవ(ల) కోసం చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. 

 

“అవమాన నిర్ధారణ” అంటే ఒక పదబంధం, వీడియో, ఆడియో లేదా మరేదైనా ఇతర మార్గాలను ఉపయోగించడం, తద్వారా వినియోగదారు మనస్సులో భయం లేదా అవమానం లేదా అపహాస్యం లేదా అపరాధ భావాన్ని సృష్టించడానికి  వినియోగదారుని ఒక నిర్దిష్ట మార్గంలో చర్య తీసుకునేలా చేస్తుంది. వినియోగదారు ప్లాట్‌ఫారమ్ నుండి ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేయడం లేదా సేవ యొక్క సభ్యత్వాన్ని కొనసాగించేలా చేస్తుంది.

 

“బలవంతపు చర్య” అంటే ఒక సంబంధం లేని సేవకు వినియోగదారు సబ్‌స్క్రయిబ్ లేదా సైన్ అప్ చేయడానికి వినియోగదారుని బలవంతం చేయడం. లేదా అసలు ఉద్దేశించిన ఉత్పత్తి/సేవను కొనుగోలు చేయడానికి లేదా సబ్‌స్క్రయిబ్ చేయడానికి వినియోగదారు ఏదైనా అదనపు వస్తువు(ల)ను కొనుగోలు చేయవలసి ఉంటుంది.  

 

“సభ్యత్వ ఎర” అంటే  సభ్యత్వాన్ని రద్దు ను అసాధ్యం చేయడం లేదా సభ్యత్వాన్ని రద్దు ను ఇతర పద్ధతులతో సంక్లిష్టమైన మరియు సుదీర్ఘమైన ప్రక్రియ గా చేయడం 

 

“ఇంటర్‌ఫేస్ జోక్యం” అంటే (ఏ)  నిర్దిష్ట సమాచారాన్ని హైలైట్  చేస్తూ వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మార్చే డిజైన్  (బి) తను కోరుకున్న చర్య తీసుకోకుండా వినియోగదారుని తప్పుదారి పట్టించడం కోసం సంబంధిత సమాచారాన్ని అస్పష్టం చేయడం 

 

“ఎర మరియు స్విచ్” అంటే వినియోగదారు చర్య ఆధారంగా నిర్దిష్ట ఫలితాన్ని ప్రకటించడం కాకుండా మోసపూరితంగా ప్రత్యామ్నాయ ఫలితాన్ని అందించడం.

 

“డ్రిప్ ప్రైసింగ్” అంటే ధరలను ముందస్తుగా బహిర్గతం చేయకుండా లేదా వినియోగదారుకు రహస్యంగా బహిర్గతమయ్యే ఒక వ్యూహం; మరియు/లేదా అలాంటి ఇతర పద్ధతులు

 

“ముసుగు ప్రకటన” అంటే వినియోగదారు రూపొందించిన కంటెంట్ లేదా కొత్త కథనాలు లేదా తప్పుడు ప్రకటనలు వంటి ఇతర రకాల కంటెంట్‌గా ప్రకటనలను మారువేషంలోముసుగు చేయడం. 

 

నగ్గింగ్”అంటే వినియోగదారులు ఉద్దేశించిన వస్తువులు లేదా సేవల యొక్క  కొనుగోలుతో సంబంధం లేని, అత్యధిక అభ్యర్థనలు, సమాచారం, ఎంపికలు లేదా అంతరాయాల ద్వారా ఒత్తిడిని ఎదుర్కొనే చీకటి నమూనా అని అర్థం;  ఇది ఉద్దేశించిన లావాదేవీకి అంతరాయం కలిగిస్తుంది. 

 

విక్రేతలు మరియు ప్రకటనదారులతో సహా అన్ని వ్యక్తులు మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. డ్రాఫ్ట్ మార్గదర్శకాల ప్రకారం, మరింత స్పష్టత తీసుకురావడానికి నిర్దిష్ట నిర్దేశిత చీకటి నమూనాలు నిర్వచించబడ్డాయి మరియు ఉదాహరణలతో వివరించబడ్డాయి. తరచుగా మోసపూరిత లేదా తప్పుదారి పట్టించే పద్ధతులు లేదా మానిప్యులేట్ చేసిన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌లు/వెబ్ డిజైన్‌లను ఉపయోగించడం ద్వారా వినియోగదారు ఎంపికలను తారుమారు చేసే లేదా మార్చే విధానాలను గుర్తించడం మరియు నియంత్రించడం మార్గదర్శకాల లక్ష్యం. అందువల్ల, ప్రతిపాదిత మార్గదర్శకాలు వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అటువంటి పద్ధతులను పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా పెరుగుతున్న విస్తరిస్తున్న మరియు చొచ్చుకుపోయే డిజిటల్ ఆవరణం లో డిపార్ట్‌మెంట్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మరియు సరసమైన మరియు పారదర్శకమైన మార్కెట్‌ప్లేస్‌ను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది. ప్రతిపాదిత మార్గదర్శకాలు పరిశ్రమను మరింత బలోపేతం చేస్తాయి మరియు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తాయి. కొత్త మార్గదర్శకాలపై మరింత సమాచారం ఈ దిగువ లింక్ ద్వారా పొందండి.

 

https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Draft%20Guidelines%20for%20Prevention%20and%20Regulation%20of%20Dark%20Patterns%202023.pdf.

 

***


(Release ID: 1955524) Visitor Counter : 178