ఆయుష్
ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆయుర్ వైద్య, సుప్రజ , వయోమిత్ర లకు సంబంధించి ఆయుష్ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి పిలుపు. జాతీయ ఆయుష్ మిషన్పై ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్.
Posted On:
06 SEP 2023 12:56PM by PIB Hyderabad
జాతీయ ఆయుష్ మిషన్ కు సంబంధించిన ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని కేంద్ర ఆయుష్, పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట
కేంద్ర ఆయుష్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయమంత్రి డాక్టర్ ముంజపర మహేంద్ర భాయ్, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తిరు మా సుబ్రమణియన్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
దినేష్ గుండూ రావు,కేంద్ర ఆయుష్ మంత్రిత్వశౄఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటెచా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, ఆయుష్ మంత్రిత్వశాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశం సందర్బ:గా , సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు ఆయుష్ కార్యక్రమ స్థితిగతులు, ఈ కార్యక్రమ అమలులో పురోగతిపై సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ శర్వానంద్ సోనోవాల్, మన గొప్ప వారసత్వం, మన సంప్రదాయ వైద్యం, మానవులు మరింత మెరుగైన, సంతోషకరమైన జీవనం సాగించేందుకు కాలపరీక్షకు నిలబడిందని
చెప్పారు. ఆధునిక వైద్యంతో పాటు, మనం ఆయుర్వేద, సిద్ద, యునాని,యోగా, నేచురోపతి, సొవా రిగ్ప, లేదా హోమియోపతి వంటి గొప్ప చికిత్సా విధానాల నుంచి, పూర్తి స్థాయి ప్రయోజనం పొందాలని చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికతో కూడిన నాయకత్వంలో మనం సంప్రదాయ వైద్య విధానాలను, ఆధునిక వైద్య విధానాలతో శాస్త్రీయంగా సమ్మిళితం చేస్తున్నామని అన్నారు.
ఆయుష్ వైద్య విధానం ప్రయోజనాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ మంత్రి, ఆయుష్ వైద్య విధానంలో ఆరోగ్యకరమైన జీవన విధానం సాధించే ఏర్పాటు ఉన్నదని, ఆయుష్ ద్వారా స్కూలు పిల్లలకు ఆయుర్వేదం ద్వారా మంచి జీవన విధానాన్ని అలవరచుకునేలా చేయవచ్చని అన్నారు. సుప్రజ, బాలింతలు, శిశు సంరక్షణకు ఆయుష్ కార్యక్రమమని, అలాగే వయోమిత్ర కార్యక్రమం ఆయుష్ ద్వారా వయోధికుల ఆరోగ్యాన్నికాపాడేదని చెప్పారు. ఆస్టియో అరిథ్రైటిస్, మస్కులో స్కెలిటల్ అనారోగ్యానికి చికిత్స, ఆయుష్ మొబైల్ మెడికల్ యూనిట్లు వంటివి ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయన్నారు.
ఆయుష్ మంత్రిత్వశఆఖ 12,500 ఆయుష్ హెల్త్, వెల్ నెస్ సెంటర్లను ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మద్దతుతో నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్.ఎ.ఎం) కింద 2023-24లో కార్యరూపం దాల్చేట్టుచేసింది. దీని ప్రధాన ఉద్దేశం ఆయుష్ సూత్రాల ఆధారంగా సమగ్ర ,ఆరోగ్య సేవలు అందించడమని అన్నారు. దీనివల్ల ప్రజలు తమ జేబు నుంచి అనవసర ఖర్చు పెట్టే పరిస్థితిలేకుండా వ్యాధులను తగ్గించుకోవచ్చన్నారు. ఆయుష్ మంత్రిత్వశాఖ ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు జాతీయ ఆయుష్ మిషన్ కింద 2014-15 నుంచి రూ 719.70 కోట్లరూపాయలు విడుదల చేసినట్టు తెలిపారు. ఈమంత్రిత్వశాఖ దక్షిణాది రాష్ట్రాలలో 17 సమీక్రుత ఆయుష్ ఆస్పత్రులకు కూడా మంత్రిత్వశాఖ మద్దతునిచ్చింది. ఇందులో ఆరు ఆస్పత్రులు ఇప్పటికే పనిచేస్తున్నట్టు అవి తెలిపాయి. 12,500 ఆయుష్ హెల్త్ వెల్ నెస్ సెంటర్లలో దక్షిణాది రాష్ట్రాలలో 2181 ఆయుష్ హెల్త్, వెల్ నెస్ కేంద్రాలకు మంత్రిత్వశాఖ మద్దతునిచ్చింది. ఇందులో 1518 కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్, ’’ ఈ కార్యక్రమం ఎంత అర్థవంతంగా ఫలితాలు సాధిస్తున్నదో మనం చూడాలి. మనం మన వ్యూహాలను , టెక్నిక్లను తగిన విధంగా రూపొందించుకుని వాటిని అమలు చేయాలి. మన పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. ఫలితాలను సరిచూసుకోవాలి. ఇలాంటి చర్చ మనకు ఒకరి మంచి విధానాలు మరొకరు అలవరచుకునేందుకు, మనమధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు ఇది ఉపకరిస్తుంది‘‘ అని ఆయన అన్నారు.
2022-23 వరకు 315 ఆయుష్ ఆస్పత్రులు, 5,023 ఆయుష్ డిస్పెన్సరీలు మౌలిక సదుపాయాల స్థాయిపెంపునకు,ఇతర సదుపాయాలకు మద్దతునివ్వడం జరిగింది. 13 కొత్త ఆయుష్ విద్యాసంస్థలకు 77 అండర్ గ్రాడ్యుయేట్, 35 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుష్ విద్యాసంస్థల మౌలికసదుపాయాలు, గ్రంథాలయం, ఇతరఅంశాల విషయంలో స్థాయిపెంపునకు మద్దతునివ్వడం జరిగింది.
నేషనల్ ఆయుష్ మిషన్ కింద, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆయుష్ సదుపాయాలకు మద్దతు నివ్వడంతోపాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరొగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులలో ఆయుష్ కేంద్రాల ఏర్పాటు తో, సమీక్రుత ఆయుష్ ఆస్పత్రుల, కొత్త ఆయుష్ కేంద్రాలు, ఆయుష్, వెల్ నెస్ కేంద్రాల స్థాయిపెంపు, ప్రస్తుత డిస్పెన్సరీలు, సబ్ సెంటర్ల స్థాయి పెంపు, యుజి, పిజి ఆయుష్ విద్యాసంస్థల స్థాయి పెంపు చర్యలకు మద్దతు నివ్వడం జరిగింది. దీనివల్ల ప్రజలు ఆయుష్ హెల్త్ కేర్ సెంటర్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుకలుగుతుంది.
నేషనల్ ఆయుష్ మిషన్ సదుపాయాలను మెరుగు పరచడం, వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా ఆయుష్ హెల్త్ కేర్ సేవలు మరింత మెరుగుగా అందించడం ఎన్.ఎ.ఎం లక్ష్యం.దీని ద్వారా ప్రజలు తమకు తోచిన ఆరోగ్య సేవలను ఎంచుకోవచ్చు. ఎన్.ఎ.ఎం కింద మంత్రిత్వశాఖ, కర్ణాటకలో 02 కొత్త ఆయుష్ విద్యా సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ లో 1, తమిళనాడులో 01 విద్యాసంస్థకు మద్దతు నిచ్చింది. కర్ణాటకలోని రెండు ఆయుష్ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. 2022-23 సంవత్సరం వరకు 137 సమీక్రుత ఆయుష్ ఆస్పత్రులకు మద్దతు నివ్వడం జరిగింది. ఇందులో 37 పనిచేస్తుండగా, 86 నిర్మాణంలో ఉన్నాయి. మరో 14 ఆయుష్ ఆస్పత్రులు వివిధదశలలో ఉన్నాయి. ఆయుష్ వైద్య విధానం ద్వారా 2022లో ఎ.హెచ్.డబ్ల్యుసి కింద 8.42 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు.
***
(Release ID: 1955387)
Visitor Counter : 99