సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇప్పుడు డిడి స్పోర్ట్స్ హెచ్‌డి అయిన డిడి స్పోర్ట్స్‌

Posted On: 06 SEP 2023 2:24PM by PIB Hyderabad

డిడి స్పోర్ట్స్ ఛానెల్ ఇప్పుడు డిడి స్పోర్ట్స్ హెచ్‌డి అయింది. దేశంలోని ప్ర‌భుత్వ ప్ర‌సార సంస్థ అయిన ప్ర‌సార భార‌తి, డిడి స్పోర్ట్స్ హెచ్‌డి ఛానెల్‌తో త‌న ఛానెళ్ళ గుచ్ఛెంలో మ‌రొక హైడెఫినిష‌న్ ఛానెల్‌ను జోడించింది. డిడి స్పోర్ట్స్ హెచ్ డి అన్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఏషియా క‌ప్ క్రికెట్ మ్యాచ్‌ల  ప్ర‌సారాల‌తో ప్రారంభ‌మ‌వుతోంది. ఇది దేశ‌వ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికుల దీర్ఘ‌కాలిక డిమాండ్‌ను నెర‌వేర్చ‌డ‌మే కాక మారుతున్న కాలానికి అనుగుణంగా మొత్తం డిడి నెట్‌వ‌ర్క్‌ను తీర్చిదిద్ది, స‌హేతుకం చేయాల‌న్న ల‌క్ష్యం దిశ‌గా ఒక నిర్ణ‌యాత్మ‌క అడుగు. 
ఇప్పుడు క్రీడా ప్రేమికుల‌కు డిడి స్పోర్ట్స్ హెచ్ డి అన్న‌ది ప్ర‌ధాన ఎంపిక అవుతుంది. వారు  హైడెఫినిషన్ ట్రాన్్స‌మిష‌న్‌లో ప్ర‌ధాన అంత‌ర్జాతీయ క్రీడా కార్య‌క్ర‌మాల ప్ర‌సారాల‌ను చూడ‌గ‌లుగుతారు. రాబోయే నెల‌ల్లో డిడి స్పోర్ట్స్ మ‌రింత స్థిర‌మైన‌, బ‌ల‌మైన ప్ర‌చార ప్ర‌ణాళిక‌తో, మ‌రింత తాజా కంటెంట్‌తో (విష‌యాంశాలు) ముందుకు రావాల‌ని భావిస్తోంది. 
ఇటీవ‌లి నెల‌ల్లో విష‌యాంశాల‌ను ప్రెజెంట్ చేయ‌డంప‌రంగా అనేక వినూత్న‌, తాజా ప‌ద్ధ‌తుల‌ను  డిడి స్పోర్ట్స్ ప్రారంభించింది. ఇటీవ‌లే ముగిసిన భార‌త్ వెర్సెస్ వెస్ట్ ఇండిసీ అంత‌ర్జాతీయ క్రికెట్ సిరీస్ లో దూర‌ద‌ర్శ‌న్ నెట్‌వ‌ర్క్ హిందీ, ఇంగ్లీషు కామెంట‌రీ మాత్ర‌మే కాకుండా  త‌మిళ‌, క‌న్న‌డ‌, బంగ్లా, తెలుగు, భోజ‌పూరీ భాష‌ల‌లో వార్తా వ్యాఖ్యానాన్ని అందించింది. ఛానెల్‌కు తాజా కంటెంట్‌ను తెచ్చేందుకు ఎన్‌బిఎ, పిజిటిఎ స‌హా ప్ర‌ముఖ క్రీడా సంస్థ‌లతో ఒప్పందం చేసుకుంది. 
రాబోయే నెల‌ల్లో అనేక విష‌యాంశాల స‌మ‌న్విత భాగ‌స్వామ్యాలు వ‌రుస‌లో ఉన్నాయి. ఇవి  క్రీడా రంగంలో ప్ర‌ముఖ ఛానెళ్ల‌లో ఒక‌దానిగా డిడి స్పోర్ట్స్ స్థానాన్ని నిల‌బెడ‌తాయి. 
డిడిస్పోర్ట్స్‌ను 18 మార్చి 1998లో ప్రారంభించారు. మొద‌ట్లో అది రోజుకు ఆరు గంట‌ల పాటు క్రీడా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేస్తుండేది, తర్వాత 1999లో దానిని 12 గంట‌ల‌కు పెంచారు. జ‌న‌వ‌రి 1జూన్ 2000 నుంచి డిడి స్పోర్ట్స్ ఇర‌వై నాలుగు గంట‌ల శాటిలైట్ ఛానెల్ అయింది. డిడి స్పోర్ట్స్ హెచ్‌డిని ఇప్పుడు ప్రారంభించాల‌న్న నిర్ణ‌యంతో, ఈ ఛానెల్ ప్ర‌ధాన అంత‌ర్జాతీయ క్రీడలే కాకుండా క్షేత్ర‌స్థాయిలో ప‌రివ‌ర్తిత కార్య‌క్ర‌మ‌మైన‌ ఖేలో ఇండియా క్రీడ‌లు, శీతాకాల క్రీడ‌లు, దివ్యాంగుల కోసం క్రీడ‌లు స‌హా ప‌లు కార్య‌క్ర‌మాల‌కు ఏకైక గ‌మ్యం కానుంది.  
ప్ర‌స్తుతం డిడి స్పోర్ట్స్ ఛానెల్ నెంబ‌ర్ 079 డిడి ఫ్రీడిష్‌పై అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే అది ఇత‌ర వేదిక‌ల‌పై కూడా అందుబాటులో ఉంటుంది. 

 

***
 


(Release ID: 1955187) Visitor Counter : 176