మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల అధ్యక్షతన 'మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ జాతీయ కేసీసీ కాన్ఫరెన్స్


ఎ హెచ్ డి , మత్స్యకార రైతులకు కెసిసి జారీ చేయాలని శ్రీ పురుషోత్తం రూపాల ఉద్ఘాటన

సాగర్ పరిక్రమ సమయంలో కె.సి.సి ప్రమోషన్ కోసం జిల్లా అధికారులతో పాటు శాఖ అధికారులు చేపట్టిన కృషిని
అభినందించిన శ్రీ రూపాల

అర్హులైన మత్స్యకారులకు కెసిసి కార్డులను పంపిణీ చేసిన శ్రీ పురుషోత్తం రూపాల: క్షేత్రస్థాయి సమస్యను పరిష్కరించడానికి
జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆదేశం

Posted On: 04 SEP 2023 6:35PM by PIB Hyderabad

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా అధ్యక్షతన మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ లో కిసాన్ కార్డుల జారీ పై జాతీయ( కెసిసి ) సదస్సు మహారాష్ట్రలో జరిగింది. మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మత్స్యశాఖ సమన్వయంతో ఈ జాతీయ కె సి సి  సదస్సును నిర్వహించింది.

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరాడ్, మహారాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ మంత్రి శ్రీ సుధీర్ ముంగంటివార్, మహారాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి  శ్రీ రాధాకృష్ణ ఏక్నాథరావు విఖే పాటిల్, మత్స్య శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాష్ లిఖీ.పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ అదనపు కార్యదర్శి వర్షా జోషి, మత్స్యశాఖ ఇన్ లాండ్ ఫిషరీస్ సంయుక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా, ఎన్ ఎఫ్ డి బి చీఫ్ ఎగ్జిక్యూటివ్  డాక్టర్ ఎల్.నరసింహమూర్తి , ఏఆర్ఎస్ డాక్టర్ ఎల్.నరసింహమూర్తి, ఎ ఆర్ ఎస్ ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఇంకా ప్రత్యేక అతిథులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నీరజ్ నిగమ్,  నాబార్డు రీఫైనాన్స్ డిపార్ట్ మెంట్ సిజిఎం శ్రీ వివేక్ సిన్హా కూడా హాజరయ్యారు. 

మహారాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖకు చెందిన అధికారులను కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల అభినందించారు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ (ఎ హెచ్ డి) ,   మత్స్యకార రైతులకు కె సి సి జారీ చేయాలని, తొలి అడుగుగా వాటిని గుర్తించాలని సూచించారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. సాగర్ పరిక్రమ సమయంలో కె సి సి  ప్రమోషన్ కోసం జిల్లా అధికారులతో పాటు ఆ శాఖ అధికారులు చేపట్టిన కృషిని శ్రీ రూపాల అభినందించారు. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని చెప్పారు.

డి ఒఎఫ్ / డిఎహెచ్ డి పిఎమ్ఎమ్ఎస్ వై కెసిసి ల పైన , లబ్ధిదారుల నుండి  స్పందనతో పాటు కెసిసి ప్రయోజనాలు,  అర్హత పై రూపొందించిన లఘు వీడియోలను,   ప్రదర్శించారు. అర్హులైన మత్స్యకారులకు శ్రీ పురుషోత్తం రూపాల కెసిసి కార్డులను పంపిణీ చేశారు. వర్చువల్ ఇంటరాక్షన్ ల అనంతరం లబ్ధిదారులు కె సి సి ని పొందడం పై తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ మొదటి జాతీయ కెసిసి సమావేశానికి ప్రతి ఒక్కరినీ ఆహ్వానించిన సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, గరీబ్ కళ్యాణ్ లో ఆర్థిక సమ్మిళి తం ఒక భాగమని, అందువల్ల దేశవ్యాప్తంగా కెసిసిని ప్రోత్సహించడం ద్వారా స్థానిక రుణగ్రహీత ను అధిక వడ్డీ రుణ భారం నుంచి తప్పించి వలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందువల్ల అన్ని బ్యాంకులు ముందుకు రావాలని, శిక్షణ ఇవ్వాలని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రాధాకృష్ణ ఏక్నాథరావు విఖే పాటిల్, మాట్లాడుతూ, డి ఎ హెచ్ డి , డి ఒఎఫ్ రంగాలు రెండూ మార్పు చెందుతున్నందున, క్షేత్ర స్థాయిలో పరపతి అవసరమైనందున సంబంధిత నిబంధనలను సడలించాలని బ్యాంకర్లకు సూచించారు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరాడ్ పేర్కొన్నారు. మత్స్యకార దరఖాస్తుదారులందరికీ కేసీసీ ఇవ్వాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, బ్యాంకు లేదా దరఖాస్తుదారుడి నుంచి రిటర్న్ దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. 0% వడ్డీకే రుణాలు ఇచ్చే గుజరాత్ రాష్ట్ర పథకం మాదిరిగానే, అటువంటి నిబంధనను కూడా మంత్రివర్గానికి ప్రతిపాదించాలని అన్నారు. ఈ పథకాన్ని ప్రోత్సహించడంలో బ్యాంకులు చురుగ్గా పాల్గొనాలని, కెసిసి కోసం ఇంటింటికీ మొబిలైజేషన్ జరగాలని ఆయన సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వ మత్స్య, అటవీ , సాంస్కృతిక వ్యవహారాల మంత్రి శ్రీ సుధీర్ ముంగంటివార్ సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన  కేంద్ర మంత్రిని అభినందించారు. కె సి సి క దరఖాస్తుదారులను జాగ్రత్తగా చూసుకోవాలని, మార్కెట్ లింకేజీలు, టెక్నాలజీ అడాప్షన్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా విక్రేతలకు కూడా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జీవనోపాధి కల్పన కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిబంధనలను అన్వేషించాలని ఆయన సూచించారు.

ఫిషరీస్ కు రూ.25,000 కోట్ల రుణ లక్ష్యం ఉందని, అందువల్ల సులభతర వ్యాపారమే కీలకమని మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాఖ్ లిఖీ పేర్కొన్నారు. దరఖాస్తుల తిరస్కరణకు గల కారణాలను పరిశీలించడం, రొయ్యల పెంపకం, ఇతర విస్తృత కార్యకలాపాల కోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సమీక్ష, మహిళా విక్రేతలకు రుణాలు, ఘర్ ఘర్ కేసీసీ అభియాన్ లో ఎఫ్ ఎ హెచ్ డి డని చేర్చడం, సామర్థ్య పెంపు, అవుట్ రీచ్, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల కమ్యూనికేషన్ తదితర అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ మాట్లాడుతూ,  భారతదేశం 'ప్రపంచ డెయిరీ'గా ప్రసిద్ధి చెందిందని, ఇప్పుడు భారతదేశం స్వయం సమృద్ధి నుండి వ్యవస్థాపకత , విలువ జోడింపు దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. పెద్ద లబ్దిదారులను కవర్ చేయడానికి జిల్లా , బ్లాక్ స్థాయిలో కెసిసి ఔట్ రీచ్ ఆవశ్యకత , డిఎఫ్ఎస్ సహకారంతో పర్యవేక్షణ అవసరాన్ని నొక్కిచెప్పారు.

మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి (ఇన్ లాండ్ ఫిషరీస్) శ్రీ సాగర్ మెహ్రా స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.  కెసిసి పథకం అమలులో నిర్దిష్ట కారణాలు,  అంతరాలను గుర్తించడానికి హాజరైన భాగస్వాములందరూ తమ అభిప్రాయాలు, సమస్యలు, సవాళ్లు, సూచనలు, ఫీడ్ బ్యాక్ లను పంచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ కె సి సి  చేరేలా కొన్ని నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని, కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి వర్షా జోషి డి.ఎ.హెచ్.డి లో కె.సి.సిపై సాధించిన విజయాలు , ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. వాటాదారులు కొన్ని నిబంధనలను సడలించాలని, అవసరమైన విధంగా రైతులకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నీరజ్ నిగమ్ మాట్లాడుతూ, ఆర్థిక సమ్మిళితాన్ని సాధించడానికి చిన్న రుణాలను తీసుకోవడాన్ని పెంచడం చాలా అవసరం అని, బ్యాంకులు ఆర్ బి ఐ నిర్దేశించిన కె సి సి  మార్గదర్శకాలను పాటించాలని, బ్యాంకు సిబ్బందికి ఆర్థిక అక్షరాస్యతలో శిక్షణ ఇవ్వాలని, ఏడాది పొడవునా ప్రచారం చేయాలని, ప్రాసెసింగ్ టైమ్ లైన్ లను పాటించాలని, స్టేటస్ ను బ్యాంకులు తెలియజేయాలని సూచించారు. పర్యవేక్షణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో సమస్యలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా కింది స్థాయిలో అంటే బ్లాక్, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ జరగాలని ఆయన పేర్కొన్నారు. నాబార్డు రీఫైనాన్స్ విభాగానికి చెందిన సిజిఎం శ్రీ వి.కె.సిన్హా మాట్లాడుతూ,  వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రధాన రంగంతో సమానంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని, వాస్తవ సామర్థ్యాన్ని గ్రహించడానికి ప్రతి విలువ గొలుసు నోడ్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ ఆర్ బి లను నాబార్డు క్రమం తప్పకుండా సమీక్షిస్తోందని, క్షేత్రస్థాయి సమాచారం పొందేందుకు దీనిని కొనసాగిస్తుందన్నారు. డాక్యుమెంటేషన్ కు సంబంధించిన అంశాలపై బ్యాంకర్లు పాటించేందుకు ఏకరీతి మార్గదర్శకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఎస్ బి ఐ ఎబియు అండ్  జి ఎస్ ఎస్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ శంతను పెండ్సే మాట్లాడుతూ, రైతులకు ఎస్ బిఐ అందించే పథకాల గురించి వివరించారు. ఇందులో విలువ గొలుసులో విలువ జోడింపు / ప్రాసెసింగ్ కు మద్దతు ఇవ్వడానికి కొత్తగా అభివృద్ధి చేసిన ప్రొడక్ట్ కూడా ఉంది. సమావేశం లో చర్చించిన సవాళ్లను క్షుణ్ణంగా గమనించామని, తక్షణ చర్యగా కె సి సి మార్గదర్శకాలను పాటించడం, యాజమాన్య పత్రాల తప్పనిసరి ,  సిబిల్ స్కోర్ అంక్షల సడలింపు, , రూ.1.6 లక్షల వరకు పూచీకత్తు తొలగింపు, హామీదారు వంటి నిబంధనలను పాటించేల సూచనలు జారీ చేస్తామని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ కేంద్ర మంత్రి నేతృత్వంలోని సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని ప్రశంసించారు. స్మాల్ ల్యాండింగ్ సెంటర్లు మొదలైన కార్యకలాపాలకు సిఎస్ఆర్ ను చేర్చాలని కోరారు.

మొత్తం 80,000 మంది ఫిజికల్, వర్చువల్ పద్ధతులలో ఈ సమావేశంలో చేరారు. 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 370 ప్రాంతాల నుండి 21,000 మంది మత్స్యకారులు , చేపల రైతులతో ఈ సమావేశానికి ప్రాతినిధ్యం వహించాయి.9000 భౌతికంగా , వర్చువల్ విధానంలో పాల్గొనగా, 50,000 మంది ఎ హెచ్ డి రైతులు 1000 కామన్ సర్వీస్ సెంటర్ల (సిఎస్ సి ) ద్వారా అనుసంధానమయ్యారు. అవుట్ డోర్ క్యాంపెయిన్ లో భాగంగా డిజిటల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా సుమారు 22 లక్షల మంది ప్రజలకు ఈ సమావేశం చేరువ అయింది. మార్గదర్శకాలు/ఎస్ ఒ పి పై  ఏడు ప్రాంతీయ భాషల్లో ప్రచార సామగ్రిని పంపిణీ చేశారు. మత్స్యకారులకు  కె సి సి సదుపాయంపై వీడియోను విడుదల చేశారు. ఎన్ ఎఫ్ డి బి  సిఇ శ్రీ ఎల్ ఎన్ మూర్తి  వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.

****



(Release ID: 1955013) Visitor Counter : 111