సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చంద్రయాన్-3 మరియు ఆదిత్య-ఎల్‌1 రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశ అమృత్ కాల్ వృద్ధి ప్రయాణాన్ని నడిపిస్తాయి: డాక్టర్ జితేంద్ర సింగ్


అంతరిక్ష యాత్రలలో నాసా,రాస్‌కాస్మోస్‌ మొదలైన వాటితో పోటీపడే సామర్థ్యం ఇస్రోకి ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్

ఈ యుగాన్ని సరిగ్గా ‘మోడీ ఎరా’ అని పిలుస్తారని, ఆయన ప్రగతిశీల విధాన నిర్ణయాలకు ప్రపంచం ప్రశంసించిందని, చంద్రయాన్-3 మరియు ఆదిత్య-ఎల్1 దాని ఫలితాలు అని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 03 SEP 2023 6:10PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఒఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ..చంద్రయాన్-3 మరియు ఆదిత్య ప్రయోగాలు అమృత్ కాల్‌లో భారతదేశ రాబోయే 25 సంవత్సరాలలో వృద్ధికి నాయకత్వం వహిస్తాయి అని తెలిపారు.

ఉధంపూర్‌జిల్లాలోని టిక్రి-1బి పంచాయతీలో 'మేరీ మాతి మేరా దేశ్' ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ఇది దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే అమృత్ కలష్ యాత్రలకు గుర్తుగా మాతృభూమి శ్రేయస్సులో ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటి నుండి మట్టి మరియు బియ్యం సేకరణను సూచిస్తుందని చెప్పారు.

 

image.png

 

ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ద్వారా భారతదేశ అంతరిక్ష రంగానికి కొత్త దృశ్యాలను తెరిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో మాత్రమే భారతదేశం ఇటీవలి అంతరిక్ష అద్భుతాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ఇప్పుడు 'ఆకాశమే హద్దు కాదు'అని భారతదేశ అంతరిక్ష రంగానికి ఇది నిజమైందని తెలిపారు.

గత తొమ్మిదేళ్లుగా భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక క్వాంటం జంప్ జరిగిందని ఇప్పుడు అంతరిక్ష యాత్రల కోసం ఇస్రోతో సహకరిస్తున్న నాసా,రాస్‌కాస్మోస్‌ మొదలైన వాటితో సమానంగా భారతదేశాన్ని నిలబెట్టిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

 

image.png


డా.జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..పరిమిత వనరులు ఉన్నప్పటికీ తక్కువ ఖర్చుతో కూడిన మార్గాల ద్వారా మానవ వనరులు మరియు మానవ సామర్థ్యాల పరంగా భారతదేశం ప్రపంచం ముందు స్పష్టంగా ప్రదర్శించిన ఆధిపత్యం భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మరియు శాస్త్రీయ-ఆర్థిక శక్తిగా నిలబెట్టిందని అని పేర్కొన్నారు.

 

image.png


సమిష్టి సహకారంతో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం వంటి అనేక ప్రగతిశీల విధాన నిర్ణయాలను తీసుకున్నందుకు ప్రపంచం మొత్తం ప్రధాని మోదీకి ఈ ఘనతనిస్తుందని డా. జితేంద్ర సింగ్ చెప్పారు.

 

image.png


ఈ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రజలు అమృత్ కలాష్ యాత్రలలో పాల్గొనాలని, ‘పంచప్రాన్’ ప్రతిజ్ఞను తీసుకోవాలని అలాగా భారతదేశ పురోగతి మరియు అభివృద్ధికి కట్టుబడి ఉండాలని తద్వారా భారతదేశం 2047లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రజలను కోరారు.

స్థానిక పిఆర్‌ఐ ప్రతినిధులతో పాటు ఈ కార్యక్రమంలో డిడిసి చైర్‌పర్సన్ శ్రీ లాల్ చంద్ మరియు ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ సలోని రాయ్ ప్రసంగించారు.

 

*****


(Release ID: 1954528)