ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పి 17 ఎ ప్రాజెక్టు కింద, ఏడవ యుద్ధ నౌకకు స్టీలు సరఫరాచేసిన స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా (ఎస్.ఎ.ఐ.ఎల్).


ఇది రక్షణ రంగాన్ని దేశీయం చేసే చర్యలను బలోపేతం చేస్తుంది.

Posted On: 31 AUG 2023 6:42PM by PIB Hyderabad

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్.ఎ.ఐ.ఎల్) , భారతదేశపు అతిపెద్ద స్టీలు ఉత్పత్తిదారు. ఇది భారతీయ నావికాదళం , దేశీయంగా
పి 17 ఎ ప్రాజెక్టుకింద నిర్మించనున్న ఏడవ తేలికపాటి యుద్ధనౌక నిర్మాణానికి అవసరమైన మొత్తం స్పెషల్ స్టీల్ ప్లేట్లను అందించి తద్వారా భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టిపెడుతోంది. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా పడిన ముందడుగుగా చెప్పుకోవచ్చు.

కొత్త ప్రాజెక్టులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా –సెయిల్ ,అన్ని యుద్ధనౌకలకు అవసరమైన ప్రత్యేక స్టీల్ ప్లేట్ లు సుమారు 28 ,000 టన్నుల మేరకు సరఫరా చేయనుంది. సెయిల్ సరఫరా చేసే ప్రత్యేక స్టీలు ప్లేట్లు అత్యంత బలమైనవి, శక్తికలిగినవిగా, తుప్పును నిరోధించేవిగా ఉంటాయి. ఇవి నౌకా దళానికి ఎంతో ఉపకరిస్తాయి. ఆరో తేలికపాటి యుద్ధనౌక వింధ్యగిరి తయారీకి కూడా ఇంతే మొత్తంలో ప్రత్యేక స్టీలును సెయిల్ సరఫరా చేసింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే ప్రారంభించారు. మెస్సర్స్ మజగాన్ డాక్ లిమిటెడ్  నిర్మించినఏడవ తేలికపాటి యుద్ధ నౌక, నాలుగో యుద్ధనౌకను సెప్టెంబర్ 1, 2023న  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ప్రారంభించనున్నారు.  ఈ కార్యక్రమం దేశ సముద్ర రవాణా భద్రతా వ్యవస్థలో కీలక మైలు  రాయిగా నిలవనుంది.

పి 17  ఎ ప్రాజెక్టు:

పి 17 ఎ ప్రాజెక్టు, భారత నౌకాదళం కోసం ఏడు అత్యధునాతన తేలికపాటి నౌకలను భారతీయ నౌకాదళం కోసం నిర్మించనుంది. ఇందులో నాలుగు నౌకలను మెస్సర్స్ మజగాన్ డాక్ లిమిటెడ్, మూడు నౌకలను మెస్సర్స్ జి.ఆర్.ఎస్.ఇ నిర్మిస్తున్నాయి.

భారత నావికాదళానికి గట్టి మద్దతు నివ్వడంలో సెయిల్ సంస్థకు గొప్ప చరిత్ర ఉంది.  ఇది అత్యధునాతన ఉత్పత్తులను సేవలను రక్షణ రంగానికి అందిస్తోంది.

ఈ కంపెనీ పి 17 ఎ ప్రాజెక్టుకు స్టీలును సరఫరా చేయడమే కాక , ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులైన ఐఎన్ ఎస్ విక్రాంత్, ఐఎన్ ఎస్ ఉదయగిరి వంటి యుద్ధ నౌకలు, ఐఎన్ ఎస్ సూరత్, పదాతిదళతుపాకి ధనుష్ తయారీకి స్టీలు సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

 

***

 


(Release ID: 1954524) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi , Punjabi