వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ - బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై పన్నెండవ సారి చర్చల ఫలితంపై సంయుక్త ప్రకటన
బ్రిటన్, భారత రిపబ్లిక్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు కోసం పన్నెండవ రౌండ్ చర్చలు
प्रविष्टि तिथि:
01 SEP 2023 4:32PM by PIB Hyderabad
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం బ్రిటన్ - భారత్ మధ్య పన్నెండవ రౌండ్ చర్చలు 2023 ఆగస్టు 8-31 తేదీల మధ్య జరిగాయి. గతంలో జరిగిన మునుపటి రౌండ్ల చర్చల మాదిరిగానే ఈ సారి కూడా చర్చలు మిశ్రమ పద్ధతిలో జరిగాయి. చాలామంది బ్రిటన్ అధికారులు ఢిల్లీకి వచ్చి చర్చలలో పాల్గొనగా మరికొందరు చాక్షుష రీతిలో పాల్గొన్నారు.
జి20 దేశాల బృందం వాణిజ్యం మరియు పెట్టుబడి శాఖల మంత్రుల స్థాయి సమావేశానికి భారత్ 2023 ఆగస్టు 24-25 తేదీలలో
జైపూర్ లో అతిథ్యం ఇచ్చింది. బ్రిటన్ వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి గౌ. కెమి బడెనోచ్ సమావేశంలో పాల్గొనడానికి భారత్ సందర్శించారు. భారత్ ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న తీరును ఇరువురు నేతలు తెలుసుకున్నారు. చర్చల పురోగతికి చేపట్టవలసిన చర్యలు, మార్గాలపై
అంగీకారానికి వచ్చారు.
పదమూడవ రౌండ్ FTA చర్చలు సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది.
(रिलीज़ आईडी: 1954492)
आगंतुक पटल : 161