వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమలుపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్ష సమావేశం నిర్వహించిన డీపీఐఐటీ

Posted On: 02 SEP 2023 11:41AM by PIB Hyderabad

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ను మరింత విసృత్తంగా అమలు చేసే అంశంపై వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (డీపీఐఐటీ) సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమలు జరుగుతున్న తీరుపై డీపీఐఐటీ ప్రతివారం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో     సమీక్షా సమావేశాలను నిర్వహిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రాలు రూపొందించిన ప్రణాళికలను సమావేశంలో చర్చించి ప్రణాళిక  అమలు కోసం సహాయ సహకారాలు అందిస్తారు. 

 2023 ఆగస్టు 31న న్యూఢిల్లీలో డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షతన పశ్చిమ,మధ్య మండల రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల  సమీక్ష సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, డామన్ డయ్యూ, దాదర్  నగర్ హవేలీ, గుజరాత్, మధ్యప్రదేశ్,  ఛత్తీస్‌గఢ్.రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి. 

మౌలిక సౌకర్యాల అభివృద్ధి,సామాజిక రంగ ప్రణాళిక కోసం 'మొత్తం ప్రభుత్వ' విధానాన్ని పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్, రాష్ట్ర స్థాయి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి చర్యలు అమలు జరగాలని డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) సూచించారు. 

పీఎం గతిశక్తి జాతీయ  మాస్టర్ ప్లాన్  ప్రభావవంతమైన, డేటా ఆధారిత నిర్ణయాధికారం కోసం డేటా లేయర్‌లు మరియు సాధనాలను ఉపయోగించుకోవడం ద్వారా కలిగే  వివిధ ప్రయోజనాలను డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) వివరించారు. 

పీఎం గతిశక్తి జాతీయ  మాస్టర్ ప్లాన్ అమలు వల్ల 

i. రహదారుల వినియోగం ఎక్కువగా సమర్ధంగా ఉంటుంది. 

ii. అటవీ, ఆర్థిక మండలాలు, పురావస్తు ప్రదేశాలు మొదలైన వాటి నుండి కూడళ్ల  మెరుగైన దృశ్యమానత సాధ్యమవుతుంది. 

iii. అధిక ఖచ్చితత్వంతో వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికల (DPR) తయారీని క్రమబద్ధీకరించడానికి జాతీయ మాస్టర్ ప్లాన్  డిజిటల్ సర్వేలను ఉపయోగించడం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమలు కోసం సమయం మరియు ఖర్చు ఆదా అవుతుంది. 

పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పరచడానికి, అంగన్‌వాడీలు, పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైన సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కోసం తగిన ప్రాంతాన్ని  ఎంచుకోవడం కోసం పీఎం గతిశక్తి పధకానికి  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని  ఆమె పేర్కొన్నారు. 

కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం అమలు చేస్తున్న  అభివృద్ధి కార్యక్రమాలు/పథకాలను జిఐఎస్ -ఆధారిత జాతీయ/రాష్ట్ర ప్రణాళికతో  అనుసంధానం చేస్తున్నాయి. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పాఠశాలల భవన నిర్మాణం కోసం ప్రాంతాన్ని నిర్ణయించడానికి , జనాభా, రవాణా సౌకర్యం, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి మొదలైన వివిధ అంశాలపై  సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర మాస్టర్ ప్లాన్ తో తన పహుంచ్ పోర్టల్‌ను ఏకీకృతం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించడానికి కోస్టల్ కారిడార్ ని 

గుజరాత్ ప్రభుత్వం పీఎం గతి శక్తి నీ ఉపయోగిస్తోంది. పీఎం గతి శక్తి జాతీయ, రాష్ట్ర మాస్టర్ ప్లాన్  పోర్టల్‌లను ఉపయోగించి వరదల సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు గోవా రాష్ట్రం విపత్తు నిర్వహణ/ తరలింపు మార్గాన్ని ప్లాన్ చేసింది.

పీఎం గతి శక్తి పథకం అమలులో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 

 

 కింది అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో సూచించారు.

 

i.రాష్ట్రాలు/కేంద్రపాలిత స్థాయిలో సంస్థాగత యంత్రాంగం  సమావేశాలు తరచు నిర్వహించాలి.

 

ii. జాతీయ మాస్టర్ ప్లాన్ /రాష్ట్ర మాస్టర్ ప్లాన్ సమాచార నాణ్యత నిర్ధారించాలి.

iii. సులభతర రవాణా, జీవనం, వ్యాపార నిర్వహణ కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేయడం కోసం రాష్ట్రాలు మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలి

జాతీయ రవాణా విధానానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయి రవాణా విధానాన్ని రూపొందించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కృషి చేయాలి.

 

 ఇప్పటివరకు, 22 రాష్ట్రాలు తమ రాష్ట్ర విధానాన్ని   నోటిఫై చేశాయి.

 

ప్రణాళికా ప్రయోజనాల కోసం జిల్లా స్థాయిలో  పీఎం గతి శక్తి జాతీయ, రాష్ట్ర మాస్టర్ ప్లాన్ అమలు చేయడం  వల్ల కలిగే ప్రయోజనాలపై  రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు అవగాహన కల్పించారు. ప్రాంత-ఆధారిత అభివృద్ధిని సాధించడానికి  ప్రాథమిక స్థాయిలో అవసరాలు గుర్తించడానికి, ప్రాజెక్ట్ అమలు  మొదలైన వాటి కోసం పీఎం గతిశక్తి మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.  తమ జిల్లాల్లో సామాజిక , ఆర్థిక ప్రణాళిక కోసం ప్రాంత-ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో జిల్లా స్థాయి అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.

 

ఈ విధానం వల్ల భూసేకరణ, ఆమోదాలు,  సమన్వయం, పరిపాలన సమస్యలు లాంటి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. పీఎం గతి శక్తి కింద ప్రయోగాత్మకంగా చేపట్టే పనులకు సంబంధించి ప్రణాళిక సిద్దం చేయాలని సమావేశంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ అయ్యాయి.

 

****



(Release ID: 1954491) Visitor Counter : 108