నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గౌహతిలో రేపు, నైపుణ్యాభివృద్ధి, ఈశాన్య ప్రాంత నైపుణ్య, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ సదస్సు 2023ను ప్రారంభించనున్న నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌.

Posted On: 31 AUG 2023 6:01PM by PIB Hyderabad

కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ శాఖ , ఎలక్ట్రానిక్స్‌, ఐటి శాఖ మంత్రి శ్రీ రాజీవ్‌ చంద్రశేఖర్‌, మంథన్‌ పేరుతో ఈశాన్య ప్రాంత నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ ప్రెన్యుయర్‌షిప్‌ సదస్సు 2023ను గౌహతిలో రేపు ప్రారంభించనున్నారు. ఈ సదస్సును కేంద్ర నైపుణ్యాభివృద్ధి , ఎంటర్‌ ప్రెన్యుయర్‌ శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ (ఐఐఇ), ఐఐటి , గౌహతిల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో గురుకుల నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు.గిరిజన లబ్ధిదారులు టిఆర్‌ఐఎస్‌ఎస్‌ ఎఎం పథకం కింద తయారుచేసిన చిరుధాన్యాల ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. ఈ మూడు రోజుల సదస్సులో ఈశాన్యరాష్ట్రాలకు చెందిన ఎంటర్‌ప్రెన్యుయర్లు, హస్తకళాకారులు, చేతివృత్తులవారు తయాచు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించడంతోపాటు,  విజయవంతమైన ఎంటర్‌ ప్రెన్యుయర్లకు  వారివిజయానికి గుర్తుగా అవార్డులు ప్రదానం చేస్తారు.

ఈశాన్య ప్రాంతంలో ఎంటర్ప్రెన్యుయర్షిప్ వాతావరణాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్నచర్యలను కేంద్ర సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వివరిస్తారు. అలాగే ఈ ప్రాంత యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వారితో చర్చించనున్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో , కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధికి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతరాయంగా కృషిచేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలోని యువతకు నూతన అవకాశాలు కల్పించాలన్నది ప్రధానమంత్రి ఆకాంక్ష. నవ భారతం, నూతన నైపుణ్యాలు, నూతన అవసరాలు, నూతన ఉపాధి కి అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది.

ఆగస్టు నెలలో కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యుయర్షిప్ శాఖ మంత్రి  శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి తో కలసి, ప్రత్యేక కార్యక్రమం, ‘జీవితాలలో మార్పు, భవిష్యత్ నిర్మాణం, ఈశాన్యప్రాంతంలో  నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యుయర్షిప్ కు సంబంధించిన ప్రత్యేక   కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బడ్జెట్లో 360 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది 2.5 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూర్చగలదు.

 

***


(Release ID: 1954324) Visitor Counter : 78