విద్యుత్తు మంత్రిత్వ శాఖ

పునరుత్పాదక ఇంధనం మరియు డీకార్బనైజేషన్‌లో కలిసి పనిచేయనున్న ఎన్‌టిపిసి మరియు ఓఐఎల్

Posted On: 01 SEP 2023 3:13PM by PIB Hyderabad

భారతదేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ కార్పొరేషన్ మరియు దేశంలోని రెండవ అతిపెద్ద జాతీయ చమురు మరియు గ్యాస్ కంపెనీ పునరుత్పాదక శక్తి రంగంలో కలిసి పనిచేయడానికి చేతులు కలిపాయి. అవును ఎన్‌టిపిసి లిమిటెడ్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ 31 ఆగస్టు 2023న ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలు మరియు భూఉష్ణ శక్తి వినియోగంతో సహా డీకార్బనైజేషన్ కార్యక్రమాలలో సహకారాన్ని అన్వేషించడానికి ఇది ఉపకరిస్తుంది. కార్బన్ సీక్వెస్ట్రేషన్ వంటి రాబోయే డీకార్బనైజేషన్ టెక్నాలజీలపై పరిజ్ఞానం మరియు అనుభవాన్ని పంచుకోవడానికి కూడా ఈ ఎమ్ఒయు దోహదపడుతుంది.

ఎమ్ఒయు ద్వారా రెండు మహారత్న దిగ్గజాలు పునరుత్పాదక శక్తి రంగంలో తమ ముద్రను పెంచుకోవాలని మరియు 2070 నాటికి నికర జీరోను సాధించాలనే దేశ లక్ష్యాన్ని సాధించే దిశగా స్థిరమైన పరిష్కారాలలోకి ప్రవేశించాలని ఉద్దేశించారు.

ఈ ఎంఓయుపై  న్యూఢిల్లీలో సంతకం జరిగింది. కార్యక్రమంలో ఎన్‌టిపిసి సిఎండి శ్రీ గురుదీప్ సింగ్, ఓఐఎల్‌ సిఎండి డా.రంజిత్‌ రాత్; మరియు వారి ఫంక్షనల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

 

image.png

 

ఎన్‌టిపిసి పవర్ సెక్టార్ వాల్యూ చైన్‌లో ఉంది. దీని మొత్తం స్థాపిత సామర్థ్యం 73,024 ఎండబ్ల్యూ. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది ముడి చమురు మరియు సహజ వాయువు యొక్క అన్వేషణ, అభివృద్ధి మరియు ఉత్పత్తి వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ-యాజమాన్య చమురు కంపెనీ.

2032 సంవత్సరం నాటికి 60 జిడబ్ల్యూ పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని సాధించడానికి ఎన్‌టిపిసి కట్టుబడి ఉంది. ఇది గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ మరియు ఎనర్జీ స్టోరేజ్ డొమైన్‌లో ప్రధాన సంస్థగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. హైడ్రోజన్ బ్లెండింగ్, కార్బన్ క్యాప్చర్ మరియు ఫ్యూయల్ సెల్, బస్సులు వంటి డీకార్బొనైజేషన్ దిశగా కంపెనీ అనేక కార్యక్రమాలను చేపడుతోంది.

సంబంధిత పఠనం:

నీతి ఆయోగ్ ‘కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్, అండ్ స్టోరేజ్ (సిసియుఎస్) పాలసీ ఫ్రేమ్‌వర్క్ మరియు  డిప్లాయ్‌మెంట్ మెకానిజం ఇన్ ఇండియా’పై అధ్యయన నివేదికను విడుదల చేసింది.


 

***



(Release ID: 1954319) Visitor Counter : 162