ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంవత్సరానికి 7.8% వద్ద, భారతదేశ వృద్ధి రేటు అనేక ఇతర ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉందన్న ప్రధాన ఆర్థిక సలహాదారు


ప్రపంచ మందగమనం ఉన్నప్పటికీ, సేవల రంగ ఎగుమతులు విశేషమైన పనితీరును కనబరిచాయి: సిఈఏ

ప్రైవేట్ సెక్టార్ ప్రకటించిన కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు 14 సంవత్సరాలతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో క్యూ1లో అత్యధికంగా ఉన్నాయి: సిఈఏ

Posted On: 31 AUG 2023 8:32PM by PIB Hyderabad

డాక్టర్ నాగేశ్వరన్ మొత్తం ఈ అంశాలను సంక్షిప్తంగా వివరించారు. 

 

పెట్టుబడి మరియు వినియోగదారుల కార్యకలాపాలు ఊపందుకోవడం, రాబోయే సంవత్సరంలో పటిష్టమైన వృద్ధి అవకాశాలను బలపరుస్తుంది

ప్రభుత్వ క్యాపెక్స్ పుష్ మద్దతుతో కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేయడంతో ప్రైవేట్ రంగం బలమైన పెట్టుబడి వృద్ధికి తోడ్పడటానికి సిద్ధంగా ఉంది.

మార్కెట్‌లోకి తాజా స్టాక్‌ రావడం, ప్రభుత్వ ముందస్తు చర్యలతో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తర ,పీఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటి పెను మార్పులు తయారీ ఉత్పత్తిని పెంచుతాయి. 

Click here for CEA’s Presentation

 

Click here for MOSPI Press Note

 

****


(Release ID: 1954139) Visitor Counter : 164