మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 2023 ని జాతీయ పోషణ మాసంగా నిర్వహించనున్న మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పోషకాహారం అధికంగా ఉన్న భారతదేశం, విద్యావంతులైన భారతదేశం, సాధికారత కలిగిన భారతదేశం ఇతివృత్తంతో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహణ
Posted On:
31 AUG 2023 5:10PM by PIB Hyderabad
దేశంలో 6 సంవత్సరాల లోపు బాలలు, గర్భిణిలు, బాలింతల్లో పోషకాహార విలువలు పెంచేందుకు భారత ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తోంది. పోషణ్ (సంపూర్ణ పోషకవిలువలకు ప్రధానమంత్రి పథకం) పధకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.పోషక ఆహార లోపాలను సవరించడానికి పోషణ్ పథకం కింద చర్యలు అమలు జరుగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం కాలంలో, పోషణ్ అభియాన్, అంగన్‌వాడీ సేవల పథకం, కౌమార బాలికల కోసం అమలు జరుగుతున్న కార్యక్రమాలను అంగన్‌వాడీ, పోషణ్ 2 కింద కేంద్రం విలీనం చేసింది.పథకాలు మరింత సమర్థంగా అమలు జరిగి ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ, రోగనిరోధక శక్తిని పెంపొందించే పద్ధతులు అమలు చేయడానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేలా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
సెప్టెంబర్ 2023 అంతటా 6వ జాతీయ పోషణ మాసంగా నిర్వహించడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. జీవిత-చక్ర విధానం ద్వారా పోషకాహార లోపాన్ని సమగ్రంగా పరిష్కరించడం లక్ష్యంగా ఈ ఏడాది మిషన్ పోషణ్ 2.0 ను అమలు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కార్యక్రమంలో భాగంగా క్లిష్టమైన మానవ జీవిత దశల గురించి విస్తృత అవగాహన పెంపొందించడం: గర్భం, బాల్యంలో, బాల్యం, కౌమార దశ అంశాలపై దృష్టి సారించి కార్యక్రమాలు . "సుపోషిత్ భారత్, సాక్షర భారత్, సశక్త్ భారత్" (పోషకాహారం అధికంగా ఉన్న భారతదేశం, విద్యావంతులైన భారతదేశం, సాధికారత కలిగిన భారతదేశం) ఇతివృత్తంగా దేశంలో అన్ని ప్రాంతాల్లో పోషకాహారంపై అవగాహన ను పెంపొందించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం,ప్రత్యామ్నాయ ఆహారం లాంటి ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు జరుగుతాయి. ఆరోగ్యవంతులైన పిల్లలు లాంత్రి కార్యక్రమాలు నిర్వహించి పోషకాహారం, సంరక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. పోషకాహారంతో పాటు విద్య, పర్యావరణహిత జీవన శైలి అనుసరించడం ద్వారా పోషకాహారం అందించడం లాంటి కార్యక్రమాలతో పాటు గిరిజనుల పోషకాహారం, రక్తహీనత పరీక్షల నిర్వహణ, నివారణ కోసం విడిగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజల భాగస్వామ్యంతో అమలు జరుగుతున్న 'నా నేల నా దేశం' కార్యక్రమానికి కొనసాగింపుగా పౌష్టిక ఆహార మాసోత్సవాలు నిర్వహించాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
సంపూర్ణ పోషకాహార అంశంపై అవగాహన కల్పించడానికి అన్ని వర్గాలకు చెందిన ప్రజల సహకారాన్ని తీసుకుని గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలలో ఆవాహన కార్యక్రమాలు,లబ్ధిదారులను గుర్తించడానికి శిబిరాలు నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యక్తిగత, సమాజ స్థాయిలలో పోషకాహారాన్ని తీసుకునే విధంగా ప్రవర్తనను ప్రోత్సహించడం అభియాన్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా ఉంది. మిషన్ సురక్ష అంగన్‌వాడీ, పోషణ్ 2.0 ద్వారా ఈ లక్ష్య సాధన కోసం కృషి కొనసాగుతోంది.
లక్ష్యాన్ని సాధించడానికి,జాతీయ పోషణ మాసోత్సవాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని వర్గాల సహకారంతో మహిళా,శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సంబంధిత మంత్రిత్వ షాకేల సహకారం, భాగస్వామ్యంతో ఇంతవరకు మహిళా, శిశు అభివృద్ధి శాఖ అభియాన్ ప్రారంభమైనప్పటి నుంచి 5 సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2022లో జరిగిన చివరి పోషన్ మాహ్ సందర్భంగా కీలకమైన అంశాలతో 170 మిలియన్లకు పైగా సున్నితత్వ కార్యకలాపాలు జరిగాయి. . ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం పోషన్ పఖ్వాదాస్ (మార్చి), పోషన్ మాహ్స్ (సెప్టెంబర్) కింద ప్రజల సహకారంతో 600 మిలియన్లకు పైగా కార్యకలాపాలుజరిగాయి.
విభిన్న కార్యకలాపాల ద్వారా అమృత్ కాలంలో సుస్థిర భారతదేశం నిర్మాణం జరగాలి అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయం నెరవేర్చడానికి గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల సహకారంతో అన్ని వర్గాల సహకారంతో పోష మాసోత్సవాన్ని నిర్వహించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
***
(Release ID: 1953949)
Visitor Counter : 442