మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాగర్ పరిక్రమ 8 వ దశ కు (ఫేజ్ 8) కు నేతృత్వం వహించిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల


మత్స్యకారులతో సంభాషించి వారి జీవన విధానం , జీవనోపాధి గురించి తెలుసుకున్న శ్రీ పురుషోత్తం రూపాల

విధాన నిర్ణేతలు - ఆ విధానాల ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమైన వ్యక్తుల మధ్య అంతరాన్ని పూడ్చడమే ఇటువంటి పరస్పర సమావేశాల ప్రాధమిక లక్ష్యం - శ్రీ రూపాల

Posted On: 31 AUG 2023 7:52PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ (ఎఫ్ హెచ్ డి)మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల సాగర్ పరిక్రమ ఎనిమిదవ దశ (ఫేజ్ - 8) కు నేతృత్వం వహించారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, డి .ఎఫ్ కార్యదర్శి డాక్టర్ అభిలాష్ లిఖి, సంయుక్త కార్యదర్శి శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్, జాతీయ మత్స్య పరిశ్రమ అభివృద్ధి బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఎల్.ఎన్.మూర్తి యాత్ర లో పాల్గొన్నారు.

శ్రీ పురుషోత్తం రూపాలకు మత్స్యకారులు, మహిళలు సాదర స్వాగతం పలకడంతో ప్రారంభమైన సాగర్ పరిక్రమ ఫేజ్ 8 ప్రయాణం తిరువనంతపురం జిల్లాలోని ముత్తలపోజీ ఫిషింగ్ హార్బర్, విజింజం ఫిషింగ్ హార్బర్ కు చేరుకుంది. శ్రీ పురుషోత్తం రూపాల మత్స్యకారులతో సంభాషించి వారి జీవన విధానం, జీవనోపాధి గురించి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారులు తమ అనుభవాలు, తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, బోట్ల సంఖ్య పెరగడంతో విజింజం ఫిషింగ్ హార్బర్ వద్ద రేవు విస్తరణ అవసరం వంటి తమ ఆకాంక్షలను మంత్రి తో పంచుకున్నారు.

కేంద్ర మంత్రి (ఎఫ్ హెచ్ డి) ముత్యాలపోజీ బ్రేక్ వాటర్ నిర్మాణం గురించి చర్చించారు.   పిఎమ్ ఎంఎస్ వై చొరవ కింద అవసరమైన దిద్దుబాటు చర్యలను అమలు చేయడానికి తిరిగి రూపొందిస్తున్న చేస్తున్న డిజైన్ పై చర్చించారు. విధాన నిర్ణేతలు, విధానాల వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైన ప్రజల మధ్య అంతరాన్ని పూడ్చడమే ఇటువంటి చర్చల ప్రాథమిక లక్ష్యమని శ్రీ రూపాలా తెలిపారు. ముత్తలపోజి ఫిషింగ్ హార్బర్ లో సుమారు 200 మంది, విజ్జం ఫిషింగ్ హార్బర్ లో 150 మంది మత్స్యకారులు మంత్రితో సమావేశాలలో పాల్గొన్నారు.

అనంతరం శ్రీ పురుషోత్తం రూపాల, డాక్టర్ ఎల్.మురుగన్ లతో కలిసి సిఎంఎఫ్ ఆర్ లోని సిల్వర్ పోంపనో ఉత్పత్తి యూనిట్లను సందర్శించి పరిశీలించారు. ఉత్పత్తిని గరిష్టంగా పెంచడానికి పెద్ద ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయాలని శ్రీ రూపాలా సూచించారు

తదుపరి కేంద్ర మంత్రి (ఎఫ్ హెచ్ డి ) నేతృత్వంలోని ప్రముఖులు, ఉన్నతాధికారుల బృందం కన్యాకుమారి జిల్లాలో పర్యటించింది. కార్యక్రమంలో ఎఫ్ హెచ్ డి సహాయ  మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, నాగర్ కోయిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు గాంధీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీ పొన్ కూడా పాల్గొన్నారు. మెరైన్ అంబులెన్స్, హెలికాప్టర్ ద్వారా మత్స్యకారులను రక్షించే సౌకర్యం, మత్స్యకారులకు బీమాను రూ.10 లక్షలకు పెంచడం, రేడియో ఫోన్లు, కమ్యూనికేషన్ సెంటర్ల ఏర్పాటుతో సహా చేపల వేటకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి పలు డిమాండ్ల ను తీరప్రాంత గ్రామాల మత్స్యకారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. వివిధ పథకాల లబ్ధిదారులు, మత్స్యకారులు, మత్స్యకారమహిళలు, , చేపల రైతులు, పడవ యజమానులు తమ క్షేత్రస్థాయి అనుభవాలు, జీవిత గాథలను ప్రతినిధి బృందంతో పంచుకున్నారు. తమ జీవనోపాధికి పీఎంఎంఎస్ వై, కెసీసీ వంటి ప్రభుత్వ పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.

మత్స్యకారుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని, వాటిలో ప్రతి ఒక్క దానిపై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి శ్రీ రూపాల హామీ ఇచ్చారు. సమస్యలను తమతో చర్చించిన మత్స్యకారులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయనమత్స్య సంబంధిత అంశాల మెరుగుదలకు అధ్యయనం చేపడతామని తెలిపారు. దేశ నలుమూలల  మత్స్యకారుల  జీవనోపాధిని పెంపొందించే బృహత్తర లక్ష్యం తో ప్రధాన మంత్రి ప్రత్యేక మత్స్య శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధికి పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. మత్స్యరంగంలో గ్రామస్తుల కృషిని శ్రీ రూపాల ప్రశంసించారు. మత్స్య పరిశ్రమ విలువ గొలుసులో కీలకమైన అంతరాలను తొలగించడం గురించి వివరంగా మాట్లాడారు.

చేపల పెంపకంఅనుబంధ కార్యకలాపాల కోసం కెసిసి ప్రయోజనాలను ఉపయోగించు కోవడానికి ముందుకు రావాలని శ్రీ పురుషోత్తం రూపాలా  లబ్దిదారులను కోరారు. పిఎంఎంఎస్ వై, కె సి సి  వంటి పథకాలపై అవగాహన కల్పించేందుకు వలంటీర్లు సహకరించాలని, తద్వారా లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకో గలుగుతారని అన్నారు.

సాగర్ పరిక్రమ ఏడు దశల దశల ద్వారా మత్స్యకారులు, మత్స్యకార మహిళలకు చేకూరిన ప్రయోజనాలు, సంతృప్తి, వారి సానుకూల స్పందన గురించి సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ వివరించారు. దేశంలో సముద్ర చేపల పెంపకానికి తమిళనాడుకు అపారమైన సామర్థ్యం ఉందని, అలాగే తగిన సముద్ర చేపల వేట నిబంధనలు, సముద్ర చేపల ల్యాండింగ్ లలో సరైన పరిశుభ్రతపారిశుధ్య నిర్వహణ , సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉందని ఆయన వివరించారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలో 4 స్థానంలో ఉందన్నారు. చెన్నైలోని కైమేడు హార్బర్ ను ఇప్పుడు ఆధునీకరించామని, గత తొమ్మిదేళ్లలో మత్స్యకారుల అభివృద్ధికి రూ.38,500 కోట్లు కేటాయించామని ఆయన తెలియచేశారు. మత్స్యరంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ సలహాలు, సూచనలు అందించిన మత్స్యకారులు, చేపల పెంపకందారులు, లబ్ధిదారులు, కోస్ట్ గార్డ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం కన్యాకుమారిలో శ్రీ పురుషోత్తం రూపాల ఇతర ప్రముఖులతో కలిసి సుమారు 700 మంది మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి, 160 మందికి పైగా లబ్ధిదారులకు వివిధ ప్రయోజనాలను పంపిణీ చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు.

చేపల పెంపకం ఆక్వాకల్చర్ ఆహారం , పోషణ, అలాగే ఉపాధి, ఆదాయం, విదేశీ మారకద్రవ్య ప్రధాన వనరులు. భారతదేశం వైవిధ్యభరితమైన జల వనరులను కలిగి ఉంది. విస్తృత శ్రేణి చేపలను ఉత్పత్తి చేస్తోంది. భారతదేశంలోని ముఖ్యమైన రంగం ప్రాథమిక స్థాయిలో సుమారు 2.8 కోట్ల మంది మత్స్యకారులు , చేపల రైతులకు జీవనోపాధి, ఉపాధి , వ్యవస్థాపక అవకాశాలను అందిస్తోంది. ఇంకా ఇది విలువ గొలుసులో అనేక లక్షలలో మాటే. ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8 శాతం వాటాతో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రొయ్యల పెంపకంలో భారత్ మొదటి స్థానంలో, ఆక్వాకల్చర్ చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది.

మంచి రేపటి కోసం చేపలు పట్టడం సాగర్ పరిక్రమ లక్ష్యం, ఇక్కడే జీవనోపాధి సుస్థిరతను కలుస్తుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి నేతృత్వంలో 2022 మార్చిలో ప్రారంభమైన సాగర్ పరిక్రమ యాత్ర భారత తీరప్రాంతంలో సుమారు 8000 కిలోమీటర్ల మేర సాగుతుంది. మత్స్యకారులను వారి ఇంటి ముంగిట కలుసుకోవడం, వారి కష్టాలు, సమస్యలు వినడం, గ్రామస్థాయిక్షేత్రస్థాయి వాస్తవాలను చూడటం, సుస్థిర చేపల వేటను ప్రోత్సహించడం, ప్రభుత్వ రాయితీలు, కార్యక్రమాలు చివరి మైలు వరకు చేరేలా చూడటం యాత్ర లక్ష్యం. ఇంతవరకు గుజరాత్ లోని మాండవి నుంచి కేరళలోని విజింజం వరకు ఏడు దశల్లో యాత్ర సాగింది.

భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డుతో పాటు కేరళ ప్రభుత్వ మత్స్య శాఖ, తమిళనాడు ప్రభుత్వం, ఇండియన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారుల ప్రతినిధులు 2023 ఆగస్టు 30 కేరళ లోని విజింజం నుంచి ప్రారంభమైన సాగర్ పరిక్రమ ఫేజ్ 8లో చురుకుగా పాల్గొంటున్నారువిజింజమ్ లోని ముత్తలపోజి ఫిషింగ్ హార్బర్, విజింజం ఫిషింగ్ హార్బర్, సీఎంఎఫ్ ఆర్ సెంటర్ మీదుగా తీరం వెంబడి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చేరుతుంది. చేరుకుంది. సాగర్ పరిక్రమ ఫేజ్ 8 యాత్ర తమిళనాడులోని తీరప్రాంత ప్రాంతాల గుండా తేంగపట్టణం, తూత్తూర్, వలవల్లి, కరుంపనై, వానియకుడి, కోలాచెల్, ముత్తం, ఉవారి, పెరియతలై, వీరపాండియన్ పట్నం, తరువైకుళం, మూకాయూర్, రామేశ్వరం, మండపం, వలమావూర్ గ్రామాల మీదుగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం  తీర ప్రాంతాలు నాలుగింటిని కవర్ చేస్తుంది. తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, విల్లుపురం, కడలూరు, తిరువారూర్, కరైకల్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సాగర్ పరిక్రమ రానున్న ఉప దశల్లో ఉంటాయి.

***


(Release ID: 1953934) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi