జౌళి మంత్రిత్వ శాఖ
వస్త్ర పరిశ్రమలో పీఎల్‌ఐ పథకం కింద దరఖాస్తులు పంపేందుకు తుది గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
ఎంఎంఎఫ్ దుస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు, సాంకేతిక దుస్తుల ఉత్పత్తుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2023 7:39PM by PIB Hyderabad
ఎంఎంఎఫ్ దుస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు, సాంకేతిక దుస్తుల ఉత్పత్తుల కోసం 'పీఎల్‌ఐ స్కీమ్ ఆఫ్ టెక్స్‌టైల్స్' కింద దరఖాస్తులు ఆహ్వానించే తేదీని మరో 2 నెలల పాటు, అంటే అక్టోబర్ 31, 2023 వరకు పొడిగిస్తూ కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని జౌళి మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడానికి పీఎల్‌ఐ పోర్టల్‌ను 31 ఆగస్టు 2023 వరకు తెరచి ఉంచాలని మంత్రిత్వ శాఖ గతంలోనూ నిర్ణయించింది.
****
(రిలీజ్ ఐడి: 1953932)
సందర్శకుల సూచీ సంఖ్య : : 192