నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
యుఎస్ - ఇండియా వ్యూహాత్మక స్వచ్చ విద్యుత్ భాగస్వామ్యం కింద పునరుత్పాదక విద్యుత్ సాంకేతిక యాక్షన్ ప్లాట్‌ఫాం
Posted On:
30 AUG 2023 6:21PM by PIB Hyderabad
యు.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ (డి ఓ ఈ) మరియు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (ఎం ఎన్ ఆర్ ఈ), భారత ప్రభుత్వం మధ్య వ్యూహాత్మక స్వచ్చ విద్యుత్ భాగస్వామ్యం లో భాగంగా కొత్త యుఎస్ - ఇండియా వ్యూహాత్మక స్వచ్చ విద్యుత్ సాంకేతిక యాక్షన్ ప్లాట్‌ఫారమ్ (ఆర్ ఈ టీ ఏ పీ )ని ప్రారంభించడానికి ఆగస్టు 29, 2023న సమావేశం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ గౌరవ జోసెఫ్ ఆర్. బిడెన్ మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాని మోదీ మధ్య జూన్ 22, 2023న వాషింగ్టన్ డి.సి.లో జరిగిన సమావేశంలో ఇద్దరు నాయకులు ఆర్ ఈ టీ ఏ పీ ను, కొత్త విషయాలలో సహకార విస్తరణను ప్రకటించారు. స్వచ్ఛమైన విద్యుత్ శక్తి పరివర్తనను వేగవంతం చేయడానికి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వినియోగం తో ఆలోచనలను వేగంగా కార్యాచరణ ద్వారా నిజరూపం ఇవ్వటం నాయకుల శ్రద్ధా దృష్టిని సూచిస్తుంది.
డి ఓ ఈ డిప్యూటీ సెక్రటరీ డేవిడ్ టర్క్ మరియు ఎం ఎన్ ఆర్ ఈ సెక్రటరీ భూపిందర్ సింగ్ భల్లా నేతృత్వంలో, ఆర్ ఈ టీ ఏ పీ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కాలపరిమితితో సాంకేతికత ఫలిత-ఆధారిత దృష్టి తో స్థాపించబడింది. ఇది విస్తరణ మరియూ ప్రగతి వైపు దృష్టి ఉంచుకుని కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. హరిత/ స్వచ్చ హైడ్రోజన్, పవన శక్తి, దీర్ఘకాల శక్తి నిల్వపై మరియు భవిష్యత్తులో పరస్పరం నిర్ణయించబడిన భూఉష్ణ శక్తి, సముద్ర/అలల శక్తి మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అన్వేషించడం ఆర్ ఈ టీ ఏ పీ ముఖ్య ఉద్దేశ్యం.
డి ఓ ఈ మరియు ఎం ఎన్ ఆర్ ఈ ఆర్ ఈ టీ ఏ పీ సహకారానికి సంబంధించి ప్రారంభ కార్యప్రణాలిక పని ఐదు అంశాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది:
పరిశోదన మరియు అభివృద్ది
నూతన ఆవిష్కరణలు టెక్నాలజీల నమూనా మరియూ పరీక్ష
అధునాతన శిక్షణ నైపుణ్య అభివృద్ధి
ఆర్ ఈ టీ ని అభివృద్ధి చేయడం మరియు సాంకేతికతలను ప్రారంభించడం కోసం విధానం మరియు ప్రణాళిక
పెట్టుబడి, పారిశ్రామిక స్థాపక సంరక్షణ మరియు ప్రచార కార్యక్రమాలు
ఈ సమావేశంలో, ప్రతి దేశంలో హైడ్రోజన్, శక్తి నిల్వ, పవన , భూఉష్ణ శక్తి మరియు సముద్ర పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు మరియు స్వచ్ఛమైన ఇంధన విస్తరణ కార్యక్రమాలతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అభివృద్ధి గురించి ప్రతినిధి బృందాలు సమాచారాన్ని పంచుకున్నాయి.
ఆర్ ఈ టీ ఏ పీ స్టీరింగ్ కమిటీ, జాయింట్ వర్కింగ్ గ్రూప్‌లు మరియు సబ్జెక్ట్ నిపుణుల మధ్య సహకారంతో సహా ఆర్ ఈ టీ ఏ పీ సహకారాన్ని మెరుగుపరచాలని డి ఓ ఈ మరియు ఎం ఎన్ ఆర్ ఈ భావిస్తున్నాయి.
***
(Release ID: 1953781)
Visitor Counter : 207