కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఉపాధి కల్పనా లక్ష్యాన్ని అధిగమించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఎబిఆర్‌వై)
Posted On:
30 AUG 2023 6:11PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ వినూత్న ఉపాధి ప్రోత్సాహక పథకం అయిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఎబిఆర్‌వై) కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఉపాధి కల్పన, పునరుద్ధరణను ప్రోత్సహించడంలో సాధించిన విజయాలను ప్రదర్శిస్తూ, తన ప్రారంభ ఉద్యోగ కల్పనా లక్ష్యాలను అధిగమించింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ)తో నమోదు చేసుకున్న సంస్థల యాజమాన్యాలకు ఆర్ధిక తోడ్పాటును అందించడం ద్వారా నూతన ఉద్యోగ అవకాశాల సృష్టికి ప్రేరణను ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ఎబిఆర్‌వైని 1 అక్టోబర్ 2020 నుంచి ప్రభావవంతంగా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం 1000 మంది ఉద్యోగులు కలిగిన సంస్థలకు ఉద్యోగి, యజమాని విరాళాలను (వేతనాలలో 24%) కవర్ చేయడం ద్వారా మహమ్మారి కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన వారితో సహా నిరుద్యోగ వ్యక్తులకు ఉపాధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. వెయ్యికి పైగా ఉద్యోగులు కలిగిన సంస్థలకు, కొత్త ఉద్యోగుల విషయంలో కేవలం ఉద్యోగి ఇపిఎఫ్ విరాళాలు (వేతనాలలో 12%) ద్వారా కవర్ చేయడం జరిగింది.
31 మార్చి 2022వరకు నమోదులు తెరిచి ఉన్న ఈ పథకం, దేశవ్యాప్తంగా దాదాపు 7.18 మిలియన్ల ఉద్యోగలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 31 జులై 2023 నాటికి, ఎబిఆర్‌వై ఇప్పటికే 7.58 మిలియన్ కొత్త ఉద్యోగుల నమోదును సాధించి, తొలుత పెట్టుకున్న ఉపాధి ఉత్పాదన లక్ష్యాన్ని అధిగమించింది.
నేటివరకు, మొత్తం 1,52,380 సంస్థలు దాదాపు 60,44,155 కొత్త ఉద్యోగులను నియమించి, అన్ని అర్హతా నియమాలను నెరవేర్చిన తర్వాత ఎబిఆర్‌వై పథకం కింద రూ. 9,669.87 కోట్ల మేరకు ప్రయోజనాలను పొందాయి. ఈ పథకం నెల నెలా లబ్ధిదారు సంస్థలు, ఉద్యోగులు నిర్ధిష్ట అర్హతా ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత ప్రయోజనాల పంపిణీని నిర్ధారిస్తుంది.
ఈ పథకం ఉద్యోగ మార్కెట్ పునరుద్ధరణకు గణనీయమైన సహకారానికి ప్రాధాన్యతను ఇస్తూ, సవాళ్ళతో కూడిన ఈ సమయంలో ఆర్ధిక పునరుద్ధరణను పెంచడంలో తన పాత్రను నొక్కి చెబుతుంది.
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఎబిఆర్‌వై)పై మరింత సమాచారం కోసం <https://www.epfindia.gov.in/site_en/abry.php అన్న లింక్‌ను ఉపయోగించడం ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
****
(Release ID: 1953625)
Visitor Counter : 160