ఉప రాష్ట్రపతి సచివాలయం
1 సెప్టెంబర్‌న ముంబైలో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి
మహేంద్రగిరి యుద్ధ నౌకను ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి
Posted On:
30 AUG 2023 3:34PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధనఖడ్,డాక్టర్ సుదేష్ ధన్‌ఖడ్‌తో కలిసి 01 సెప్టెంబర్ 2023న ముంబైలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మజగాంవ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండిఎల్) నిర్మిస్తున్న యుద్ధ నౌక మహేంద్రగిరి ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ నావికాదళానికి చెందిన ప్రాజెక్టు 17ఎ కింద నిర్మిస్తున్న ఏడవ యుద్ధ నౌక, ఎండిఎల్ వరుసగా నిర్మించిన నౌకలలో ఒకటి మహేంద్రగిరి.
తన పర్యటన సందర్భంగా, ఎండిఎల్ హెరిటేజ్ మ్యూజియం అయిన ధరోహర్‌ను కూడా ఉపరాష్ట్రపతి సందర్శించనున్నారు.
***
(Release ID: 1953620)
Visitor Counter : 140