పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

భారత్ మరియు న్యూజిలాండ్ దేశాలు పౌర విమానయాన రంగంలో సహకారాన్ని పెంపొందించేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి


కొత్త రూట్ల షెడ్యూల్, కోడ్ షేర్ సేవలు, ట్రాఫిక్ హక్కులు మరియు సామర్థ్య హక్కు అంశాలు ఎంఓయూలో ఉన్నాయి

Posted On: 29 AUG 2023 5:48PM by PIB Hyderabad

పౌర విమానయాన రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం మరియు న్యూజిలాండ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం పై సంతకం చేశాయి. కొత్త మార్గాల షెడ్యూల్, కోడ్ షేర్ సేవలు, ట్రాఫిక్ హక్కులు మరియు సామర్థ్య హక్కు వంటి అంశాలు వీటిలో వున్నాయి.

 

భారత పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మరియు న్యూజిలాండ్ వాణిజ్యం మరియు ఎగుమతి వృద్ధి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, బయోసెక్యూరిటీ శాఖ మంత్రి, భూమి సమాచార శాఖ మంత్రి మరియు గ్రామీణ సంఘాల మంత్రి డామియన్ ఓ కానర్ సమక్షంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సల్ మరియు న్యూజిలాండ్ హైకమిషనర్ గౌరవ డేవిడ్ పైన్ ఈ ఎమ్ఒయుపై సంతకం చేశారు. 

 

న్యూజిలాండ్ మరియు భారతదేశం మే 1, 2016న ఆక్లాండ్‌లో ఎయిర్ సర్వీసెస్ ఒప్పందం పై సంతకం చేసాయి. న్యూజిలాండ్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న విమాన సేవలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించాయి.  రెండు దేశాల మధ్య పౌర విమానయానంలో ద్వైపాక్షిక సంబంధాలను ఈరోజు సంతకాలు చేసిన ఎమ్ఒయు మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

 

న్యూజిలాండ్‌లోని నియమించబడిన విమానయాన సంస్థ (లు) భారతదేశంలోని న్యూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై , హైదరాబాద్ మరియు కోల్‌కతా వంటి ఆరు పాయింట్ల నుండి మూడవ మరియు నాల్గవ స్వాతంత్య్ర ట్రాఫిక్ హక్కులతో ఏ రకమైన విమానంతోనైనా ఎన్ని సేవలనైనా నిర్వహించగలిగే అవకాశం ఈ ఎంఓయూ కల్పిస్తుంది.

 

 శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ, “భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య పౌర విమానయాన  సేవలలో ఈ రోజు ముఖ్యమైన రోజు. మన రెండు దేశాల మధ్య వాయు రవాణాను మరింత మెరుగుపరిచే అవకాశాలను కల్పించే అవగాహన ఒప్పందంపై మేము సంతకం చేసాము. బహిరంగ వాయు రవాణా విధానం అమల్లోకి వచ్చింది, కాల్స్ పాయింట్ పెరిగింది. మేము ఇంటర్మీడియట్ పాయింట్లను కూడా పెంచాము" అని ఈ సందర్భంగా అన్నారు.

 

భారతదేశం  నియమించిన విమానయాన సంస్థ(లు) ఆక్లాండ్, వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్ మరియు భారత ప్రభుత్వం సూచించే న్యూజిలాండ్‌లోని మరో మూడు పాయింట్లకు భారతదేశం నుంచి మూడవ మరియు నాల్గవ స్వాతంత్య్ర ట్రాఫిక్ హక్కులతో ఏ రకమైన విమానాలతోనైనా ఎన్ని సేవలనైనా నిర్వహించవచ్చు.

 

రెండు పక్షాలు నియమించిన ఎయిర్‌లైన్‌లు ఏ రకమైన విమానంతోనైనా అన్ని మూడవ, నాల్గవ మరియు ఐదవ స్వాతంత్య్ర ట్రాఫిక్ హక్కులతో ఏదైనా ఇంటర్మీడియట్ పాయింట్(లు) ద్వారా ఇతర పార్టీ భూభాగంలోని ఏదైనా పాయింట్‌ నుండి వరకు రూట్ షెడ్యూల్‌లో పేర్కొన్న పాయింట్లతో సంబంధం లేకుండా పాయింట్(ల)కు మించిన ఏదైనా కార్గో సేవలను నిర్వహించవచ్చు. 

 

***



(Release ID: 1953348) Visitor Counter : 118