రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఢాకాలో భారత్ , బంగ్లాదేశ్ మధ్య రక్షణ అంశాలపై ఐదవ వార్షిక పరస్పర సంభాషణ జరిగింది.

Posted On: 28 AUG 2023 4:49PM by PIB Hyderabad

ఢాకాలో సోమవారం భారత్ , బంగ్లాదేశ్ మధ్య రక్షణ అంశాలపై ఐదవ వార్షిక సంభాషణ జరిగింది.  భారత్ నుంచి ఆగస్టు 27-28 తేదీలలో రెండు రోజుల బంగ్లా దేశ్  పర్యటనకు వెళ్లిన రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే,  బంగ్లాదేశ్ తరపున ఆ దేశ సాయుధ దళాల విభాగం ప్రధాన సిబ్బంది అధికారి లెఫ్టినెంట్ జనరల్ వాకర్ ఉర్ జమాన్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు.

రక్షణ అంశాలపై రెండు దేశాల మధ్య వార్షిక సంభాషణ జరపడం ఉన్నతస్థాయి సంస్థాగత భారత్, బంగ్లా మధ్య అన్యోన్య చర్చలకు వీలుకల్పించే యంత్రాంగం. రెండు దేశాల సాయుధ దళాల మధ్య సంబంధాల భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఈ సంభాషణ ప్రాముఖ్యతను రెండు పక్షాలు గుర్తించాయి.

 రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకార కార్యకలాపాలను సమావేశంలో సమీక్షించారు మరియు పెరుగుతున్న రక్షణ సహకార ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య జరుగుతున్న  ద్వైపాక్షిక సైనిక  విన్యాసాలను గురించి చర్చించడంతో పాటు  ఈ  విన్యాసాల సంక్లిష్టతను పెంచడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.


చర్చలు ఫలప్రదమైనట్లు శ్రీ గిరిధర్ అరమనే మరియు లెఫ్టినెంట్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్.   ఐదవ వార్షిక రక్షణ సంభాషణలో కుదిరిన ఉమ్మడి అవగాహన ఆధారంగా ఇరు దేశాలు నిరంతరం రక్షణ రంగంలో కలసి పనిచేయడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్నాయని ఇరువురు ఉద్ఘాటించారు.

రెండు దేశాల సాయుధ దళాలు బహుళ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని కోరుకుంటున్నాయి.  ఉమ్మడి కార్యకలాపాలు, ఒప్పందాలు   రెండు దేశాల మధ్య  భవిష్యత్ సంబంధాలకు  సానుకూల సంకేతం.


 

***


(Release ID: 1953289) Visitor Counter : 125