భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

భారతదేశం అధ్యక్షతన విజయవంతంగా ముగిసిన జీ- 20- దేశాల ముఖ్య శాస్త్రీయ సలహాదారుల రౌండ్ టేబుల్ సమావేశం అధ్యయన పత్రం, అధ్యక్ష సారాంశం విడుదల

Posted On: 28 AUG 2023 8:26PM by PIB Hyderabad

భారతదేశం  అధ్యక్షతన  షెర్పా ట్రాక్ ఆధ్వర్యంలో జరిగిన జీ- 20- దేశాల ముఖ్య శాస్త్రీయ సలహాదారుల (జీ-20-సీఎస్ఏఆర్) రౌండ్ టేబుల్ రెండవ సమావేశం గుజరాత్ లోని గాంధీనగర్ లో విజయవంతంగా ముగిసింది. 

జీ-దేశాలు,  ఆహ్వానిత దేశాలు కలిసి రూపొందించిన అధ్యయన పత్రం, అధ్యక్ష దేశం సారాంశంతో  నివేదికను సమావేశం  ఏకాభిప్రాయంతో ఆమోదించి విడుదల చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సలహా యంత్రాంగాన్ని సమన్వయం చేసి, కార్యాచరణ-ఆధారిత పద్ధతిలో సమాచార విధానాన్ని అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పటిష్టంగా అమలు చేయడం లక్ష్యంగా జీ-20-సిఎస్ఎఆర్ ఏర్పాటయింది. 

ఒక రోజు జరిగిన  జీ- 20- దేశాల ముఖ్య శాస్త్రీయ సలహాదారుల  రౌండ్ టేబుల్ సమావేశం గుర్తించిన ప్రాధాన్యత అంశాలపై చర్చలు జరిపింది.  (ఎ) మెరుగైన వ్యాధి నివారణ, నియంత్రణ , మహమ్మారి సంసిద్ధత కోసం ఒకే విధమైన ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి  (బి) నిపుణుల శాస్త్రీయ విజ్ఞానం ప్రపంచ దేశాలకు అందుబాటులోకి తీసుకరావడానికి జరుగుతున్న  ప్రయత్నాలను సమన్వయం చేయడం; (సి) శాస్త్ర, సాంకేతిక రంగంలో సమాన అవకాశాలు, వైవిధ్యం, చేరిక,ప్రాప్యత, గుర్తించిన, గుర్తించని  ప్రాధాన్యతలను నిర్ధారించడం; (డి)  సమగ్రమైన, నిరంతర మరియు కార్యాచరణ-ఆధారితప్రపంచ స్థాయి శాస్త్రీయ  సలహా యంత్రాంగాన్నిఅభివృద్ధి చేయడం అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చలు జరిగాయి. 

 సమావేశంలో జీ-20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, రెండు అంతర్జాతీయ సంస్థల(డబ్ల్యూహెచ్ వో, యునెస్కో) ప్రతినిధులు పాల్గొన్నారు. .

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (పిఎస్ఎ) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ నేతృత్వంలో సమావేశం జరిగింది. జీ-20-సీఎస్ఏఆర్ ను శాశ్వత వ్యవస్థగా కొనసాగించడానికి   జీ- 20 దేశాలు చూపిస్తున్న నిబద్ధతను ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్  ప్రశంసించారు. మరియు జి 20-సిఎస్ఎఆర్ మరింత సమర్థంగా అమలు చేయడానికి సహకరించాలని సభ్య దేశాలను కోరారు. 

సమావేశంలో ప్రసంగించిన ప్రొఫెసర్ .సూద్  జీ-20-సీఎస్ఏఆర్ వల్ల ప్రతి ఒక్క దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. అన్ని దేశాలకు ప్రయోజనం కలిగించే చూసేందుకు సమగ్ర, పటిష్ట సలహా యంత్రాంగాన్ని అభివృద్ధి చేసేందుకు జీ-20-సీఎస్ఏఆర్ కృషి చేస్తుందన్నారు. జీ-20-సీఎస్ఏఆర్ కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల సహకారం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.  

మెరుగైన వ్యాధి నివారణ, నియంత్రణ, మహమ్మారి సన్నద్ధత కోసం 'ఒకే ఆరోగ్యంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం' అనే ఇతివృత్తంతో జరిగిన సమావేశంలో  మానవ, జంతు, మొక్క , పర్యావరణానికి ఎదురవుతున్న ముప్పును ఒకే ఆరోగ్య విధానం కింద  సమిష్టిగా పరిష్కరించడానికి చర్యలు అమలు చేయాల్సిన అవసరాన్ని జీ-20 దేశాలు గుర్తించాయి.  వ్యాధుల నియంత్రణకు సంబంధించిన పరిజ్ఞానం ,సాంకేతిక పరిజ్ఞానం కోసం పరస్పర సహకారం, సామర్థ్య అభివృద్ధి కోసం గల అవకాశాలు గుర్తించాలని సమావేశంలో నిర్ణయించారు..ఈ రంగంలో సహకారాన్ని సులభతరం చేయడానికి ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థల మధ్య సమన్వయం సాధించడానికి చర్యలు అమలుచేయాలని  నిర్ణయించారు. 

' శాస్త్రీయ పరిజ్ఞానం ప్రాప్యతను విస్తరించడానికి ప్రపంచ ప్రయత్నాలను సమన్వయం చేయడం' అనే ఇతివృత్తంతో జరిగిన సమావేశంలో  జి 20 సభ్యదేశాలు, ఇతర దేశాలకు  శాస్త్రీయ జ్ఞానాన్ని అందుబాటులోకి  తీసుకు వచ్చేందుకు అమలు చేయాల్సిన శాస్త్ర సాంకేతిక రంగంలో వైవిధ్యత, సమానత్వం, అందుబాటులోకి తేవడం అనే ఇతివృత్తంతో జరిగిన సమావేశంలో జీ20 దేశాలు సంప్రదాయ, స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధి అంశాల ప్రాధాన్యత గుర్తించాయి. సాంస్కృతికంగా బలంగా ఉన్న అంశాలను  స్థానికంగా సంబంధిత సాక్ష్య-ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ వ్యవస్థలను సమకాలీన విజ్ఞానంగా పరిగణించాలి అని  సమావేశం  సిఫార్సు చేసింది. భాషలు, జ్ఞాన వ్యవస్థల బహుళత్వాన్నిగుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశం పేర్కొంది. 

. 'సమిష్టి, నిరంతర, కార్యాచరణ-ఆధారిత ప్రపంచ శాస్త్రీయ వ్యవస్థను రూపొందించడం' అనే అంశంపై సమావేశంలో చర్చలు జరిగాయి. ఒక బలమైన, సమగ్ర వ్యవస్థ అభివృద్ధి కోసం  పని చేయాలని సమావేశంలో సభ్య దేశాలు  నిర్ణయించాయి.సమకాలీన సమస్యల పరిష్కారం కోసం శాస్త్రీయ సలహా దారులు సలహాలు,  అందించి  ప్రపంచ సామాజిక ప్రయోజనం కోసం ఇప్పటికే ఉన్న జ్ఞాన అంతరాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.  

సమస్యల పరిష్కారం, భవిష్యత్తు లక్ష్యాల సాధన కోసం జీ-20-సీఎస్ఏఆర్ వేదికగా పని చేయాలని జీ-20 సభ్య దేశాలు నిర్ణయించాయి. వివిధ రంగాలకు  సంబంధించిన సభ్యులు చర్చలు జరిపి సమస్యల పరిష్కారం, నూతన వ్యవస్థల నిర్మాణం తదితర అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చి తగిన చర్యలు సిఫార్సు చేస్తారు. దేశాల మధ్య సమన్వయం సాధన కోసం   సైన్స్ డిప్లమసీ ఉపయోగించుకోవచ్చు.

జీ-20 అధ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశం  జీ-20-సీఎస్ఏఆర్ ను ప్రారంభించింది.  స్వచ్ఛంద జ్ఞానం , వనరుల భాగస్వామ్యం కోసం ఒక వేదికను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో భారతదేశం  జీ-20-సీఎస్ఏఆర్ ని ఏర్పాటు చేసింది.  వైవిధ్యత, పరస్పర సహకారం , పారదర్శకత,   బహుళత్వ నైపుణ్యం,   సామూహిక ఆసక్తి ఆధారంగా సైన్స్ సలహా ప్రక్రియలో ఉత్తమ విధానాల  మార్పిడి కోసం   జీ-20-సీఎస్ఏఆర్ కృషి చేస్తుంది. 

  జీ-20-సీఎస్ఏఆర్   ప్రారంభ సమావేశం 2023 మార్చి 28 నుంచి  30 వరకు ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో జరిగింది.  ఫలిత పత్రం, చైర్ సారాంశంపై తుది నివేదిక రూపొందించడానికి కి నాలుగు అంతర్జాతీయ  సమావేశాలు, ఆరు సైడ్ ఈవెంట్‌లు  అనేక ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. 

 

   జీ-20-సీఎస్ఏఆర్ అధ్యక్ష భాద్యతలను  బ్రెజిల్‌కు భారతదేశం అప్పగించింది. 

https://www.g20.org/content/dam/  లో   జీ-20-సీఎస్ఏఆర్ చర్చల సారాంశం, మీడియా సమావేశం వివరాలు 

 https://youtube.com/live/x0DJJ53iuHs?feature=share లో ఉన్నాయి. 

 

***



(Release ID: 1953101) Visitor Counter : 170